iDreamPost

అక్కడ నన్ను దుస్తులు విప్పమన్నారు.. సంచలన కామెంట్స్ చేసిన నటి ఆమని

భీమవరం బుల్లోడా పాలు కావాలా, మురిపాలు కావాలా అంటూ ఆడిపాడి.. చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక అంటూ గమ్యం తెలియని మహిళగా కనిపించి మెప్పించిన నటీమణి ఆమని. కుటుంబ కథా చిత్రాల నాయకిగా వెలుగొందిన ఆమె.. సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి రోల్స్ చేస్తోంది.

భీమవరం బుల్లోడా పాలు కావాలా, మురిపాలు కావాలా అంటూ ఆడిపాడి.. చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక అంటూ గమ్యం తెలియని మహిళగా కనిపించి మెప్పించిన నటీమణి ఆమని. కుటుంబ కథా చిత్రాల నాయకిగా వెలుగొందిన ఆమె.. సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి రోల్స్ చేస్తోంది.

అక్కడ నన్ను దుస్తులు విప్పమన్నారు.. సంచలన కామెంట్స్ చేసిన నటి ఆమని

నటి ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కుటుంబ కథా చిత్రాల నాయకిగా గుర్తింపు పొందారు. గడుసు అమ్మాయిగా, తెలివి గల ఇల్లాలిగా, భర్తను అమ్మేసే భార్యగా, పిల్లల ఎదుగుదల కోసం భర్తను ఎదిరించే మహిళగా ఆమె చేసిన పాత్రలు చిరకాలం తెలుగు వారి హృదయాల్లో గుర్తిండిపోతాయి. జంబలకడి పంబ సినిమాతో టాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేసిన ఈ నటి.. అనతికాలంలోనే మంచి మూవీస్ చేస్తూ.. టాప్ హీరోయిన్‌గా రాణించారు. మిస్టర్ పెళ్లాం, శుభ లగ్నం, మావిచిగురు, శుభ సంకల్పం, ఘరానా బుల్లోడు, ఆ నలుగురు వంటి చిత్రాలతో అలరించారు. తెలుగు, తమిళంలో పలు సినిమాలు చేసి ఫ్యామిలీ జోనులోకి వెళ్లిపోయారు. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా మంచి ఆఫర్లను రాబట్టుకుని మరింత దగ్గరవుతున్నారు ఆమని.

ఇదిలా ఉంటే తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె.. క్యాస్టింగ్ కౌచ్‌కు తానూ బలైనట్లు చెప్పారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఫోటోలు చూసి ఆడిషన్లకు పిలిచేవారని, తీరా వెళ్లేసరికి ఈ అమ్మాయా అంటూ దీర్ఘాలు తీసేవారని చెప్పారు. తాను కలర్ తక్కువగా ఉండటం వల్ల చాలా సినిమాలు రిజక్ట్ అయినట్లు చెప్పారామె. కొందరైతే మళ్లీ పిలుస్తామని చెప్పి పంపించేసే వారని, ఇలాంటి సంఘటనలు తననెంతో బాధించాయని తెలిపారు. అయితే టాలీవుడ్‌లో కంటే కోలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఎక్కువని అన్నారు. తాను తమిళ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డానని గుర్తు చేసుకున్నారు. ఓ సినిమా అవకాశం కోసం పిలిచినప్పుడు వెళ్లానని తెలిపారు.

అక్కడకు వెళ్లాక.. తక్కువగా ఉండే దుస్తులు ధరించాలి, టూ పీసెస్ డ్రస్సులు వేసుకోవాలని చెప్పారని ఆమని తెలిపారు. అలాంటి దుస్తులు వేసుకున్న సమయంలో ఒంటిపై స్ట్రెచ్ మార్కులు ఉండకూడదని, మీకు ఉన్నాయా.. ఒకసారి దుస్తులు విప్పి చూపిస్తారా? అంటూ అడిగారంటూ పేర్కొన్నారు. కొన్ని సినిమాలకు అడ్వాన్స్ కూడా తీసుకున్నప్పుడు.. మేనేజర్ వచ్చి డైరెక్టర్, ఫైనాన్సర్ మిమ్మల్ని ఒక సారి బీచ్ దగ్గరకు రమ్ముంటున్నారని.. అదీ కూడా ఒంటరిగా అని చెప్పేసరికి, దీంతో విషయం అర్థమై.. అడ్వాన్సులు కూడా తిరిగి ఇచ్చేసిన రోజులున్నాయన్నారు. ఏ రంగంలో అయినా మంచి, చెడులు ఉంటాయని, వాటిని ఎంపిక చేసుకోవడం మన చేతుల్లో ఉంటుందని అన్నారు. అయితే ఇటీవల పరిశ్రమలో వరుసగా హీరోయిన్లపై హీరోలు, విలన్లు మాటలు, చేష్టలు బయటకు వస్తున్న వేళ.. ఆమని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి