iDreamPost

శ్రీకాంత్, ఊహల విడాకుల గురించి శ్రీకాంత్ క్లారిటీ.. ఏం చెప్పారంటే?

విభిన్నమైన పాత్రలు పోషించి తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్నారు నటుడు శ్రీకాంత్. అయితే ఇటీవలి కాలంలో శ్రీకాంత్, ఊహా విడాకులు తీసుకుంటున్నట్లు గాసిప్స్ మొదలయ్యాయి. తాజాగా విడాకుల విషయంపై శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు.

విభిన్నమైన పాత్రలు పోషించి తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్నారు నటుడు శ్రీకాంత్. అయితే ఇటీవలి కాలంలో శ్రీకాంత్, ఊహా విడాకులు తీసుకుంటున్నట్లు గాసిప్స్ మొదలయ్యాయి. తాజాగా విడాకుల విషయంపై శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు.

శ్రీకాంత్, ఊహల విడాకుల గురించి శ్రీకాంత్ క్లారిటీ.. ఏం చెప్పారంటే?

సెలబ్రిటీల పెళ్ళిళ్ళు, వాళ్ళ మ్యారేజ్ లైఫ్, తర్వాత విడాకులు.. ఇవి ఎప్పటికప్పుడు మీడియాకి తిరుగులేని ఫుడ్. మ్యారేజ్ సెటిల్ కాకముందే గాసిప్ల రూపంలో దానికి సంబంధించిన సమాచారం, కరెక్టయినా, కాకపోయినా కూడా కాక పుట్టించడం మాత్రం ఖాయం. ఏదైనా పబ్లిక్ ఎక్కువ ఇంట్రస్ట్ చూపించేవి ఈ విషయాలే. అందుకే మీడియా కూడా వీటి మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. ఇక్కడే చిక్కంతా. ఏదైనా ఎక్స్లూజివ్ వార్తను అందించినప్పుడే దాని క్రేజ్. డిమాండ్. గ్లామర్. అందుకుని ఇటువంటి సమాచారం చాలా సార్లు దారితప్పిపోయి, లేనివి కూడా ఉన్నట్టుగా చిత్రీకరించబడతాయి. నిప్పు లేనిదే పొగరాదని సామెత బాగా ఇటువంటి సమాచారానికి అచ్చొచ్చింది. కొన్ని నిజంగానే రాయగా రాయగా నిజమైపోయిన పందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే గ్యాసిప్ అనే ప్రక్రియకి ఎంతో కొంత అస్థిత్వం ఏర్పడింది.

సమంతా, నాగచైతన్య వ్యవహరాంలో ఇదే జరిగింది. వాళ్ళు బైటపడి మీడియాకి ఎక్కకముందే ఎప్పుడో వాళ్ళ మీద దుమారం ప్రారంభమైంది. ఇన్స్ స్టాగ్రామ్ లో సమంత ఫొటో తీసేసిందని, అంటే దీని అర్ధమేమిటని వ్యాఖ్యానాలు మొదలై, చిలికి చిలికి గాలివానగా మారిందది. అలాగే శుభలేఖ సుధాకర్, శైలజ కూడా విడాకులు తీసుకుంటున్నారని వార్తలు ఒక టైంలో వచ్చాయి. వాళ్ళు హాయిగా ఉన్నా, ఈ గాసిప్కి మాత్రం తిరుగులేని అటెన్షన్ వచ్చిపడింది. తర్వాత యాంకర్ సుమ, రాజీవ్ కనకాల కూడా విడాకుల కోసం లాయర్ని ఆశ్రయించారని, ఇవ్వాళో రేపో విడాకులు ప్రకటిస్తారని చాలా జోరుగా ప్రచారం సాగింది. దాని గురించి రాజీవ్ కనకాల ఐ డ్రీమ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంతో వివరంగా చెప్పవలసి వచ్చింది. వాళ్ళిద్దరి మథ్యన ఏ పొరపొచ్చాలు లేకపోయినా, సజావుగా వాళ్ళ మేరీడ్ లైఫ్ ముందుకు విజయవంతంగా సాగిపోతున్నా కూడా గాసిప్లు మాత్రం వాళ్ళని కూడా వదలిపెట్టలేదు.

పెళ్లై ఎన్నాళ్ళో అయింది హీరో శ్రీకాంత్, అప్పటి హీరోయిన్ ఊహకి. వాళ్ళు హేపీగా ఉన్నారు. ఊహ కూడా పెళ్ళయిన మరుక్షణమే సినిమా జీవితానికి కట్ చెప్పి, సంసారజీవితంలో మునిగిపోయింది. అయినా సడన్గా వాళ్ళ మీద కూడా గాసిప్ అనే బాంబ్ పేలింది. దాని గురించే హీరో శ్రీకాంత్ ఐ డ్రీమ్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విడాకుల గాసిప్ గురించి నవ్వుకుంటూ చెప్పాడు. ‘’ నేనూ, ఊహా తిరువణ్ణామలై వెళ్ళాం. అక్కడ ఉంటుండగా ఇలా మేం విడాకులు తీసుకుంటున్నామని వార్త వైరల్ అయింది. అసలు ఎవరు పుట్టిస్తారో అర్ధం కాదు. కాకపోతే నాకర్థం అయింది ఒక్కటే మా మీద రాస్తే లక్షల్లో వ్యూస్ వస్తాయి.

దాని వల్ల డబ్బులొస్తాయి. అందుకోసమే అటువంటి గాలివార్తల్ని రాస్తారు. అప్పుడు మేం ఇద్దరం నవ్వుకుంటూ ఓ వీడియో రిలీజ్ చేశాం..మేం కలిసే ఉన్నామని. అక్కడితో అది సద్దుమణిగింది. అలాగే షూటింగ్లో నాకు యాక్సిడెంట్ అయిందని వార్తొచ్చింది. అది విని మా వాళ్ళంతా బెంబేలెత్తిపోయారు. నేను షూటింగ్లో ఉన్నప్పుడు మొబైల్ సైలెంట్లో పెడతాను. వాళ్ళు లెక్కలేనన్నిసార్లు ఫోన్ చేశారు. ఎందుకురా …అని తిరిగి చేస్తే ఇదీ విషయం. నేను బాగానే ఉన్నాను. నిక్షేపంలా షూటింగ్ చేసుకుంటున్నాను అని చెప్పాక గాని మా వాళ్ళు సెటిల్ అవలేదు.’’అని శ్రీకాంత్ చెప్పాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి