iDreamPost
android-app
ios-app

సిద్ధార్థ్‏కు చేదు అనుభవం.. ప్రెస్ మీట్ మధ్యలో నుంచి వెళ్లిపోయిన హీరో!

  • Author Soma Sekhar Updated - 09:24 PM, Thu - 28 September 23
  • Author Soma Sekhar Updated - 09:24 PM, Thu - 28 September 23
సిద్ధార్థ్‏కు చేదు అనుభవం.. ప్రెస్ మీట్ మధ్యలో నుంచి వెళ్లిపోయిన హీరో!

సాధారణంగా సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ లో భాగంగా.. ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలు పలు ఈవెంట్స్ నిర్వహించడం సర్వసాధారణమే. ఇలా ప్రమోషన్ కార్యక్రమాలు జరిగే సందర్భాల్లో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. తాజాగా అలాంటి అనుకోని సంఘటనే హీరో సిద్ధార్థ్ కు ఎదురైంది. అతడు నటించిన ‘చిత్తా’ (తెలుగులో చిన్నా) సినిమా విడుదలకు సిద్దమైంది. దీంతో మూవీ టీమ్ ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది. అందులో భాగంగానే గురువారం బెంగళూరులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో హీరో సిద్ధార్థ్ కు చేదు అనుభవం ఎదురైంది. దీంతో ప్రెస్ మీట్ మధ్యలోనుంచే అతడు వెళ్లిపోయాడు.

హీరో సిద్ధార్థ్ కు ‘చిత్తా’ మూవీ ప్రమోషన్స్ లో చేదు అనుభవం ఎదురైంది. ఈ మూవీకి సంబంధించి ప్రెస్ మీట్ ను బెంగళూరులో గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో సిద్ధార్థ్ మాట్లాడుతుండగా.. కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు మీటింగ్ ను అడ్డుకున్నారు. కావేరి నదీ జలాలు వివాదంలో ఉన్న సమయంలో ఒక తమిళ చిత్రానికి ప్రచారం చేయడం సరికాదని కార్యకర్తలు నినాదాలు చేశారు. మూవీ ప్రమోషన్స్ ను ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సమయంలో సిద్ధార్థ్ కన్నడలో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ వారు వినిపించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక సిద్ధార్థ్ అందరికి చేతులు జోడించి దండం పెట్టి.. ప్రెస్ మీట్ మధ్యలో నుంచే వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సిద్ధార్థ్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకి సేతుపతి మూవీ ఫేమ్ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా..ఈటాకీ, రెడ్ జెయింట్ మూవీస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించగా.. నిమిషా సజయన్ హీరోయిన్ గా నటించింది. అంజలి నాయర్ ముఖ్యపాత్ర పోషించింది. తమిళ్, మలయాళ, కన్నడ, తెలుగులో చిత్తా మూవీ రిలీజ్ కానుంది. తెలుగులో చిన్నా పేరుతో ఈ సినిమా రాబోతోంది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetbetvoleKingroyal girişcasibomgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobetMatadorbetMeritking