iDreamPost
android-app
ios-app

నటుడు రఘుబాబు కారు ఢీకొని BRS నేత మృతి!

  • Published Apr 18, 2024 | 7:28 AM Updated Updated Apr 18, 2024 | 7:29 AM

టాలీవుడ్ సీనియర్ నటుడు రఘుబాబు ప్రయాణిస్తున్న కారు ఢీకొని బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు అక్కడికక్కడే మరణించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ సీనియర్ నటుడు రఘుబాబు ప్రయాణిస్తున్న కారు ఢీకొని బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు అక్కడికక్కడే మరణించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

నటుడు రఘుబాబు కారు ఢీకొని BRS నేత మృతి!

BRS పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ సీనియర్ నటుడు రఘుబాబు ప్రయాణిస్తున్న కారు ఢీకొని బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు అక్కడికక్కడే మరణించిన సంఘటన నల్గొండ పట్టణంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

నల్గొండలోని బైపాస్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టాలీవుడ్ సీనియర్ నటుడు రఘుబాబు ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఓ వ్యక్తి స్పాట్ లోనే మరణించాడు. మృతుడు నల్గొండ పట్టన BRS ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావు(51)గా పోలీసులు గుర్తించారు. బైక్ పై వస్తున్న జనార్ధన్ ను ఢీకొట్టిన కారు దాదాపు 50 మీటర్ల దూరం లాక్కెల్లినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అసలేం జరిగిందంటే? జనార్ధన్ రావు బుధవారం మధ్యాహ్నం సమయంలో పట్టణంలోని రిక్షా పుల్లర్స్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన తన దత్తసాయి వెంచర్ నుంచి బైక్ పై ఇంటికి వెళ్తున్నాడు.

ఈ సమయంలోనే నటుడు రఘుబాబు కారులో హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నల్గొండలోని బైపాస్ రోడ్డు వద్ద బైక్ ను బలంగా ఢీకొట్టింది కారు. దీంతో తీవ్ర గాయాలపాలైన జనార్దన్ రావు.. అక్కడికక్కడే మరణించాడు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జనార్దన్ రావుకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా.. ప్రమాదం జరిగిన తర్వాత మాట్లాడిన రఘుబాబు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఆయన టెన్షన్ పడుతున్నట్లు కనిపించింది. అయితే ప్రమాద సమయంలో డ్రైవర్ కారు నడిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alAlobetAlobetberlinbetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş