iDreamPost

మరోసారి గొప్ప మనసు చాటుకున్న లారెన్స్.. ఈ సారి వికలాంగుల కోసం

  • Published Apr 18, 2024 | 10:17 AMUpdated Apr 18, 2024 | 10:17 AM

Raghava Lawrence Donate Bikes: రాఘవ లారెన్స్ నటుడు, దర్శకుడుగా ఎంతో గొప్ప పేరు సంపాదించిన ఆయన పేద ప్రజలను ఆదుకోవడంలో కూడా అంతే గొప్ప పేరు సంపాదించారు.

Raghava Lawrence Donate Bikes: రాఘవ లారెన్స్ నటుడు, దర్శకుడుగా ఎంతో గొప్ప పేరు సంపాదించిన ఆయన పేద ప్రజలను ఆదుకోవడంలో కూడా అంతే గొప్ప పేరు సంపాదించారు.

  • Published Apr 18, 2024 | 10:17 AMUpdated Apr 18, 2024 | 10:17 AM
మరోసారి గొప్ప మనసు చాటుకున్న లారెన్స్.. ఈ సారి వికలాంగుల కోసం

సినీ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, నటుడు రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. నటుడిగా కొనసాగుతూనే సామాజిక సేవ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. అనాథలకు, దివ్యాంగులకు, వృద్దుల కోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది సాయం చేస్తున్నారు. ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి వారికి కొత్త జీవితాన్ని అందించారు. అంతేకాదు తన సినిమాల్లో దివ్యాంగులను నటింపజేస్తూ వారిని ప్రోత్సహిస్తుంటారు. ఎంతోమంది పేద వాళ్లకు ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నారు. తాజాగా లారెన్స్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే..

ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి మల్టిపుల్ టాలెంట్ ఉంటుంది. కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన రాఘవ లారెన్స్ తర్వాత నటుడిగా మారాడు. ఆ తర్వాత దర్శకుడిగా తన సత్తా చాటాడు. లారెన్స్ రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకుంటున్నారు. ఎంతోమంది అనాథలకు, కష్టాల్లో ఉన్న పేద వారికి ఆర్థిక సాయం అందిస్తూ వారి కళ్లల్లో ఆనందాన్ని చూస్తున్నారు. ప్రకృతి వైపరిత్యాల సమయంలో లక్షలు విరాళం అందించడమే కాదు.. ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టించాడు. ఈ మధ్య ఓ పేద మహిళా డ్రైవర్ కి కొత్త ఆటో బహుమతిగా అందించి ఆమెను సంతోషపరిచారు. తాజాగా వికలాంగులకు బైక్స్ పంపిణీ చేసి వారి మొఖాల్లో చిరునవ్వు తీసుకు వచ్చారు.

ఉండటానికి ఇళ్లు లేని వికలాంగులకు ఇళ్లు కట్టి ఇస్తానని గతంలో మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకొని కొంతమంది వికలాంగులకు ఇళ్లు కట్టించారు. కొంతమంది వికలాంగులకు వాహనాలు లేక ఇబ్బంది పడుతున్నారన్న విషయం తెలుసుకొని వారికి బైక్స్ డొనేట్ చేసి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. మొత్తం 13 బైక్స్ ని లారెన్స్ వారికి అందించి ఆశ్చర్యపరిచారు. తాజాగా లారెన్స్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఆ బైక్స్ ని వికలాంగులకు తగ్గట్లు త్రీ విలర్స్ గా మార్చి ఇస్తానని చెప్పుకొచ్చారు.  ఆ బైక్స్ చూసి వికలాంగులు సంతోషం పట్టలేక కన్నీరు పెట్టుకున్నారు. తమ కష్టాలను తీర్చడానికి వచ్చిన దేవుడు మా లారెన్స్ మాస్టర్ అంటూ మాట్లాడారు. ఆ వీడియో చూస్తున్నంత సేపు నెటిజన్లు సైతం ఎంతో ఎమోషన్ కి గురయ్యారు. నిజంగా నువు దేవుడివి సామీ అంటూ లారెన్స్ ని అభినందిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి