iDreamPost
android-app
ios-app

ఎప్పుడూ సరదాగా ఉండే నరేశ్ తొలిసారి ఏడ్చేశాడు! ఇంత కష్టమా?

  • Author Soma Sekhar Published - 12:44 PM, Thu - 14 September 23
  • Author Soma Sekhar Published - 12:44 PM, Thu - 14 September 23
ఎప్పుడూ సరదాగా ఉండే నరేశ్ తొలిసారి ఏడ్చేశాడు! ఇంత కష్టమా?

సెలబ్రిటి.. ఈ పేరు వినగానే మన మెదడులో మెదిలే మెుదటి ఆలోచన లగ్జరీ లైఫ్, పేరుకు పేరు, డబ్బుకు డబ్బు. అందరూ ఇదే అనుకుంటారు. కానీ వారికి కూడా ఇండస్ట్రీలో, వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలు, కష్టాలు ఉంటాయి. అలాంటి కష్టాలే తన లైఫ్ లో కూడా ఉన్నాయని కన్నీరు పెట్టుకున్నారు సీనియర్ నటుడు వీకే నరేష్. ఎప్పుడూ సరదాగా ఉండే నరేష్ ఇలా కంటతడి పెట్టుకోవడంతో అక్కడ భావోద్వేగపూరిత వాతావరణం నెలకొంది. వినాయక చవితి పండుగ సందర్భంగా ‘స్వామిరారా’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది మల్లెమాల యాజమాన్యం. ఈ కార్యక్రమానికి సంబంధించి విడుదలైన తాజా ప్రోమోలో తన 50 ఏళ్ల సినీ, జీవితంలో తాను ఎదుర్కొన్న కష్టాలను తలచుకుని భావోద్వేగానికి గురైయ్యారు.

వీకే నరేష్.. 80,90వ దశకాల్లో సోలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో కామెడీ హీరోగా ఉన్న రాజేంద్రప్రసాద్ ను ఢీకొంటూ.. తనదైన ముద్రను ఇండస్ట్రీపై వేశాడు. ప్రస్తుతం హీరో, హీరోయిన్ లకు తండ్రి పాత్రలు చేస్తూ.. ఫుల్ బిజీగా మారారు. తనదైన కామెడీ టైమింగ్ తో క్యారెక్టర్ ఆర్టిస్టుగా దుమ్మురేపుతున్నారు. అయితే ఇవన్నీ నరేష్ ఒకపక్క జీవితం మాత్రమే. తన పర్సనల్ లైఫ్ కి వచ్చేసరికి ఎన్నో అవమానాలు, కష్టాలను ఎదుర్కొన్నాడు. మరీ ముఖ్యంగా పవిత్ర లోకేష్ తో పెళ్లితో సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఎదుర్కొన్నాడు. అన్ని విమర్శలను తట్టుకుని నిలబడి, నేడు బిజియెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు నరేష్. తాజాగా పవిత్ర లోకేష్ తో కలిసి మల్లెమాల నిర్వహించిన వినాయక చవితి స్పెషల్ పోగ్రామ్ ‘స్వామిరారా’ ఈవెంట్ కు వచ్చారు.

ఈ క్రమంలోనే తన సినీ కెరీర్ లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నరేష్ ను సన్మానించారు. నట జీవితంలో గోల్డెన్ జూబ్లి జరుపుకున్న నరేష్.. తన సినీ జీవితంలో, నిజ జీవితంలో జరిగిన సంఘటనలను తలచుని కన్నీరు పర్యంతం అయ్యారు. తన సినీ, నిజ జీవితంలో ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, వాటితో తాను హ్యాపీగా లేనప్పటికీ ముందుకు సాగుతున్నానని భావోద్వేగానికి గురైయ్యారు. దీంతో స్టేజిపై ఉన్న వారందరు ఎమోషనల్ అయ్యారు. ఎన్ని కష్టాలు, సమస్యలు ఉన్నాగానీ ఎప్పుడూ నవ్వుతూ ఉండే నరేష్ ఇలా కన్నీరు కార్చడంతో అభిమానులు షాక్ కు గురౌతున్నారు. నరేష్ జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి తన జీవితంలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.

Jojobet GirişmeritbetcasibomCasibom girişcasibomJojobet GirişcasibomcasibomcasibomjojobetjojobetMadridbetMadridbetcasibom girişbetgaranti girişganobetpokerklasjojobetMarsbahis GüncelCasibomJojobetGrandPashaBet destekDeneme bonusu veren siteler 2026jojobet girişCasibom GirişGrandPashaBet ŞikayetJojobet GirişJojobet Giriş