iDreamPost

Anantapur: చీరలు కొనేందుకు దర్జాగా ఇన్నోవా కారులో వచ్చారు.. వీళ్లు చేసిన పని తెలిస్తే

చీరలంటే మహా ఇష్టం. షాపింగ్స్ చేసే సమయంలో ఆ కలర్ బాగోదని, ఈ డిజైన్ కావాలని అంటూ చిర్రాకు పెట్టిస్తున్నా ఓపిగ్గా చీరలను చూపిస్తుంటారు షాపు యాజమానులు. మంచి బేరం అయితే.. పెద్ద మొత్తంలో బిల్లు చేస్తారు. అలాగే అనుకున్నారు జానకి కూడా..

చీరలంటే మహా ఇష్టం. షాపింగ్స్ చేసే సమయంలో ఆ కలర్ బాగోదని, ఈ డిజైన్ కావాలని అంటూ చిర్రాకు పెట్టిస్తున్నా ఓపిగ్గా చీరలను చూపిస్తుంటారు షాపు యాజమానులు. మంచి బేరం అయితే.. పెద్ద మొత్తంలో బిల్లు చేస్తారు. అలాగే అనుకున్నారు జానకి కూడా..

Anantapur: చీరలు కొనేందుకు దర్జాగా ఇన్నోవా కారులో వచ్చారు.. వీళ్లు చేసిన పని తెలిస్తే

దొంగతనాల్లో ఈ రకం చోరీలు వేరయా. ఎక్కడికైనా షాపింగ్‌కు వెళితే.. కొంత మంది చేతివాటం ప్రదర్శిస్తుంటారు. ముఖ్యంగా మహిళా దొంగలు చాక చక్యంగా దొంగిలించేస్తుంటారు. వారిని తనిఖీ చేసే అవకాశాలు కూడా తక్కువ ఉండటంతో చటుక్కున దాచి పెడుతుంటారు. అటువంటి సంఘటనలు కూడా చాలానే వెలుగు చూశాయి. కొనేందుకు టిప్ టాప్‌గా రెడీ అయ్యి వెళతారు. భారీగా నగలు వేసుకుని.. మంచి కస్టమర్లలా బిల్డప్ ఇస్తారు. వీరిని చూసిన షాపు యజమానులు సైతం.. రండి మేడమ్.. రండి అంటూ షాపులో ఉన్నవన్నీ చూపిస్తుంటారు. మంచి బేరం వచ్చిందనకుని సంబరపడిపోతుంటారు. కానీ ఆ చీర తీయండి, ఈ నగ ఇవ్వండి అంటూ ఎంప్లాయిస్, యజమానులను మాటల్లో పెట్టి.. దోచేస్తుంటారు. సీసీ టీవీ రికార్డులను పరిశీలిస్తే కానీ ఇలాంటి ఘటనలు బయటకు రావు.

తాజాగా అనంతపురంలో ఈ తరహాలోనే మోసం జరిగింది. లక్షన్నర విలువ చేసే చీరలను చాక చక్యంగా కొట్టేసి ఉడాయించారు. వివరాల్లోకి వెళితే.. నార్పల మండలం కేశేపల్లి మెయిన్ రోడ్డు ప్రక్కన కేశవ, జానకి అనే దంపతులు తమ ఇంట్లోనే నాలుగేళ్లుగా బట్టల దుకాణం నడుపుతున్నారు. వీరి షాపు వద్దకు గురువారం మధ్యాహ్నం ఓ ఇన్నోవా కారు వచ్చి ఆగింది. అందులో నుండి ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు దిగి.. షాపులోకి వెళ్లారు. కస్టమర్లలా కలరింగ్ ఇచ్చి.. తిరుపతిలో వివాహం ఉందని, విలువైన పట్టుచీరలు చూపించాలని అడిగారు. అదీ కూడా క్లాస్టీవి కావాలన్నారు. మంచి బేరం వచ్చిందనుకున్న జానకి తమ వద్ద ఉన్న ఖరీదైన పట్టు చీరలు మహిళలకు చూపించారు.

మొత్తం 1.50 లక్షల విలువ చేసే 12 చీరలను సెలక్ట్ చేశారు ఆ మహిళలు. అంతలో తాగేందుకు మంచి నీళ్లు కావాలంటూ జానకిని కోరగా.. ఆమె ఇంట్లోకి వెళ్లారు. అంతలోనే చీరలన్నింటినీ మహిళలు తీసుకుని.. వచ్చిన కారులో ఉడాయించారు. బాధితురాలు కేకలు వేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆ కారుకు నెంబర్ కూడా లేకపోవడంతో ఏం చేయాలో తెలియక.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా దొంగలు శారీల చోరీకి పాల్పడిన మొత్తం ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. వీటిని తనిఖీ చేయగా.. మహిళలు వీరి షాపుకు, పురుషుడు మరో దుకాణానికి వెళ్లినట్లు గుర్తించారు. ఈ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. చీరలు కొనేందుకు వచ్చి.. వాటిని కొట్టేయడంతో లబోదిబోమంటున్నారు జానకి. ఇలాంటి చోరీల పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి