iDreamPost

ఐశ్వర్యరాయ్ కు అబ్దుల్ రజాక్ బహిరంగ క్షమాపణలు!

  • Author Soma Sekhar Published - 03:40 PM, Wed - 15 November 23

వరల్డ్ కప్ లో పాక్ వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ.. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ పై దారుణమైన కామెంట్స్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్. దీంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో దెబ్బకు దిగొచ్చాడు.

వరల్డ్ కప్ లో పాక్ వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ.. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ పై దారుణమైన కామెంట్స్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్. దీంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో దెబ్బకు దిగొచ్చాడు.

  • Author Soma Sekhar Published - 03:40 PM, Wed - 15 November 23
ఐశ్వర్యరాయ్ కు అబ్దుల్ రజాక్ బహిరంగ క్షమాపణలు!

తరాలు మారుతున్నా పాకిస్థాన్ క్రికెటర్ల తీరు మాత్రం మారడంలేదు. అదే నోటిదూలతో తమ ఇష్టం వచ్చినట్లు.. అర్ధం పర్ధం లేకుండా పిచ్చి వాగుడు వాగుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే పాక్ మాత్రం తమ పేలవ ప్రదర్శనకు కారణాలను ఇతరుల మీద తోసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే టీమిండియా పిచ్ లపై పనికిమాలిన వ్యాఖ్యలు చేసింది. తాజాగా వరల్డ్ కప్ లో పాక్ వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ.. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ పై దారుణమైన కామెంట్స్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్. దీంతో అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ ఘోరమైన ప్రదర్శనతో టోర్నీ మధ్యలోనే ఇంటిదారి పట్టింది. ఇక తమ జట్టు ఇంటికి రావడంతో జీర్ణించుకోలేకపోతున్న పాక్ క్రికెటర్లు.. పనికిమాలిన మాటలతో విమర్శల పాలవుతున్నారు. తాజాగా వరల్డ్ కప్ లో తమ జట్టు పేలవ ప్రదర్శన గురించి ప్రస్తావిస్తూ.. స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ పై అసభ్యకర రీతిలో కామెంట్స్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్. ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..”ఐశ్వర్యరాయ్ ను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే తప్పులేదు. కానీ పిల్లలు పవిత్రంగా, మంచిగా పుట్టాలనుకోవడం తప్పు అవుతుంది” అంటూ వెకిలి మాటలు మాట్లాడాడు రజాక్. ఈ వ్యాఖ్యలపై క్రీడా లోకం మెుత్తం భగ్గుమంది. దీంతో భారతీయులు ఈ కామెంట్స్ ను తీవ్రంగా ఖండించారు. అబ్దుల్ రజాక్ ఆమెకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశాడు.

దీంతో టీమిండియా ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన అబ్దుల్ రజాక్ తాజాగా ఐశ్వర్యకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. “మేం పాక్ క్రికెట్ టీమ్ గురించి మాట్లాడుతుండగా.. నా నోరు జారీ ఐశ్వర్యరాయ్ ను మా ప్రస్తావనలోకి తీసుకొచ్చాం. అది నా తప్పే. ఆమెకు నేను వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నాను” అంటూ సమా టీవీలో వేదికగా చెప్పాడు రజాక్. కాగా.. ఐశ్వర్యరాయ్ పై చేసిన వ్యాఖ్యలు మాకు సరిగ్గా వినిపించలేదని, బహిరంగ క్షమాపణలు చెప్పమని మేమే అతడికి కోరామని షాహిద్ అఫ్రిది తెలిపాడు. సంవత్సరాలు మారుతున్నా గానీ పాక్ ఆటగాళ్ల బుద్ది మాత్రం మారడం లేదు.. ఇంకెప్పుడు మారతార్రా మీరు అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి