Tirupathi Rao
Tirupathi Rao
బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఏం మాట్లాడినా.. ఎవరు ఏం చేసినా రికార్డు అవ్వడం మాత్రమే కాదు.. వాళ్ల క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తుంది. అందుకే కంటెస్టెంట్స్ చేసే పని, అనే మాట ఆచి తూచి అనాల్సి ఉంటుంది. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో ఒక బాధ్యత తీసుకున్న తర్వాత దానిని సరిగ్గా నిర్వర్తించాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో ఆ విషయాన్ని హోస్ట్ నాగార్జున ప్రశ్నించడం మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా పాయింట్ అవుట్ చేస్తారు. అలా ఇప్పుడు అన్ని వేళ్లు ఆట సందీప్ వైపు తిరిగాయి. సంచాలక్ గా తాను చేయాల్సిన పని చేయకుండా.. పర్సనల్ గేమ్ ఆడటం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.
హౌస్ లో తొలివారం ఆట సందీప్ గేమ్ కు హోస్ట్ నాగార్జున మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. ఎప్పుడైతే హౌస్ మేట్ అయ్యాడో అప్పటి నుంచి ఆట సందీప్ కు టాస్కులు, గేమ్ ఆడే పరిస్థితి కనిపించడం లేదు. అతనికి దక్కుతున్న అవకాశం కేవలం సంచాలక్ గా మాత్రమే. కానీ, ఆట సందీప్ ఆ సంచాలక్ గా వచ్చిన అవకాశంతో మంచి అభిప్రాయం తెచ్చుకోకపోగా.. నెగిటివిటీ మూటగట్టుకుంటున్నాడు. ఇప్పటికే గౌతమ్, శుభశ్రీ, పల్లవి ప్రశాంత్ విషయంలో ఆట సందీప్ పెద్ద తప్పుచేశాడు. 28 చికెన్ పీస్ లను తక్కువ టైమ్ లో తింటే శోభాశెట్టిని ఓడించగలరు. అందరికంటే ముందు గౌతమ్ 28 చికెన్ పీస్ లు తిన్నాడు. ఆ తర్వాత గంట మోగిస్తాడు. ఆట సందీప్ గౌతమ్ ని విన్నర్ అని కూడా అనౌన్స్ చేశాడు.
ప్రశాంత్, శుభశ్రీ లైట్ తీసుకున్నారు. కానీ, గేమ్ అంతా అయిపోయాక బయటకు వచ్చిన తర్వాత చిన్న పీస్ ఉంది అంటూ చెప్తాడు. బిగ్ బాస్ కూడా శోభా శెట్టినే విన్నర్ అంటూ అనౌన్స్ చేశాడు. అక్కడ వాళ్లకు చాలా టైమ్ ఉంది. గౌతమ్ ముందే బెల్ కొట్టాడు కాబట్టి అక్కడే ఆ విషయం చెప్పుంటే ప్రశాంత్, శుభశ్రీ టాస్క్ కంప్లీట్ చేయేవాళ్లు వారిలో ఒకరు కంటెండర్ అయ్యేవాళ్లు. ఆ విధంగా ఆట సందీప్ తన పార్ట్ ని సరిగ్గా పూర్తి చేయలేకపోయాడు. ఆట సందీప్ చేసిన పనికి ముగ్గురికి అన్యాయం జరిగింది. అలాగే ప్రియాంక, ప్రిన్స్ యావర్, శోభాశెట్టిలో వీకెస్ట్ కంటెంస్ట్ ని ఎలిమినేట్ చేయాలి అని టాస్క్ ఇచ్చారు. ఆ టాస్కులో వ్యక్తిగత నిర్ణయంతో ఇద్దరు కలిసి ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. కానీ, అక్కడ సందీప్ మాత్రం తన మాటలతో శోభాశెట్టిని గైడ్ చేస్తున్నట్లు కనిపించాడు.
ప్రిన్స్ కి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు చెప్పాలో శోభాకి హింట్స్ ఇస్తున్నాడు. ఆ సమయంలో బిగ్ బాస్ కూడా అతడికి వార్నింగ్ ఇస్తాడు. మీరు కేవలం సంచాలక్ మాత్రమే మీకు నిర్ణయాలతో సంబంధం లేదు అని. ఆ తర్వాత ఆట సందీప్ సైలెంట్ గా ఉంటాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని స్టేజ్ పై నాగార్జున కూడా ఎండగట్టాడు. నువ్వు సంచాలక్ కదా.. మరి పర్సనల్ గేమ్ ఎందుకు ఆడావ్? అంటూ ప్రశ్నించాడు. వీక్ కంటెండర్ ని ఎలిమినేట్ చేయమని బిగ్ బాస్ చెప్పాడు. తనకన్నా స్ట్రాంగ్ అని చెప్పి శోభా.. ప్రిన్స్ యావర్ ని ఎలిమినేట్ చేసింది. మరి.. సంచాలక్ గా నువ్వు ఎవరిని ఎలిమినేట్ చేయాలి? అంటూ నాగార్జున ప్రశ్నించాడు. నిజానికి మొదటి నుంచి ఆట సందీప్ కు ప్రిన్స్ యావర్ కు పడటం లేదు.
ఇప్పుడు కూడా కావాలని సంచాలక్ గా తాను శోభా మాటను గైడ్ చేయడం మాత్రమే కాకుండా.. తను స్ట్రాంగ్ కదా అనే విషయాన్ని మెన్షన్ చేయకుండా సైలెంట్ గా ఉన్నాడు అంటూ ప్రేక్షకులు కూడా కామెంట్ చేస్తున్నారు. డైరెక్ట్ నామినేషన్ కూడా రెండోవారం ప్రిన్స్ యావర్ నే చేశాడు. ఇప్పటికే వీళ్లిద్దరికీ చిన్నపాటి గొడవలు జరిగాయి. ప్రిన్స్ యావర్ హౌస్ కి అన్ ఫిట్ అంటూ మొదటి నుంచి కామెంట్ చేస్తూనే ఉన్నాడు. అలా తాను సంచాలక్ అనే విషయాన్ని మర్చిపోయి.. సందీప్ పర్సనల్ గేమ్ ఆడి నాగార్జున వద్ద తిట్లు కూడా తిన్నాడు. మరి.. ఆట సందీప్ సంచాలక్ గా ఫ్లాప్ అయ్యాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.