iDreamPost

స్మశానంలో ప్రేమ పెళ్లి.. ఎందుకో తెలుసా?

స్మశానంలో ప్రేమ పెళ్లి.. ఎందుకో తెలుసా?

స్మశానంలో ప్రేమికుల పెళ్లి. వినటానికి విచిత్రంగా ఉన్న ఇది నిజం. ప్రేమ వివాహం కనుక స్నేహితులు కలిసి చేసి ఉంటారంటే అదీ లేదు. ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకారంతోనే అందరూ కలిసి స్మశానంలో వివాహం జరిపించారు. ఈ వింత వివాహం తెలుసుకుని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అంతా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇంతకు వీరికి స్మశానంలోనే ఎందుకు పెళ్లి చేశారు. అసలు స్టోరీ ఏంటనేది తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

అది మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లాలోని రహతా ప్రాంతంలో గంగాధర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే, ఇతడు స్థానికంగా ఉన్న ఓ స్మశానవాటికలో కాటి కాపరిగా పని చేస్తుండేవాడు. ఇతడు చాలా ఏళ్లుగా ఇక్కడే పని చేస్తూ అందులోనే కుటుంబంతో కలిసి ఉండేవాడు. ఇదిలా ఉంటే.. ఇతని కూతురైన మాయూరి స్థానికంగా ఉన్న మనోజ్ అనే యువకుడిని ప్రేమించింది. అలా వీరి ప్రేమాయణం కొన్నేళ్ల పాటు కొనసాగుతూ వచ్చింది. ఇక ఈ ప్రేమికులు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ, వీరి పెళ్లికి మొదట్లో యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.

ఆ తర్వాత ఒప్పుకోవడంతో ఇరువురి కుటుంబ సభ్యులు వీరికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. కానీ, ఇక్కడ విచిత్రమేంటంటే? చాలా ఏళ్లుగా గంగాధర్ స్మశానంలోనే ఉండడంతో ఇక్కడే తన కూతురు వివాహం చేయాలని అనుకున్నాడు. ఇక అనుకున్నట్లుగానే ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో ఘనంగా స్మశానవాటికలోనే వివాహం జరిపించారు. వీరి పెళ్లికి బంధువులంతా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ విచిత్రమైన వివాహం గురించి తెలుసుకుని చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఇది కూడా చదవండి: పరమ శివుడ్ని పెళ్లి చేసుకున్న యువతి!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి