iDreamPost

వీడియో: పండ్లు అమ్మే వృద్దురాలికి కోటీశ్వరుడు సర్ ప్రైజ్..

చిన్న చిన్న సాయాలే చాలా మందికి పెద్ద ఊరటనిస్తాయి. ఆ సాయం వారికి జీవితంలో ఎంతో విలువైనది అయితే సాయం చేసిన వారిని లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటారు. అలాగే వారిని దేవుళ్లుగా కూడా కొలిచేవారున్నారు. ప్రస్తుతం ఓ బిజినెస్ మ్యాన్ తన పెద్ద మనస్సు చాటుకుంటున్నాడు.

చిన్న చిన్న సాయాలే చాలా మందికి పెద్ద ఊరటనిస్తాయి. ఆ సాయం వారికి జీవితంలో ఎంతో విలువైనది అయితే సాయం చేసిన వారిని లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటారు. అలాగే వారిని దేవుళ్లుగా కూడా కొలిచేవారున్నారు. ప్రస్తుతం ఓ బిజినెస్ మ్యాన్ తన పెద్ద మనస్సు చాటుకుంటున్నాడు.

వీడియో: పండ్లు అమ్మే వృద్దురాలికి కోటీశ్వరుడు సర్ ప్రైజ్..

సహాయం చేయాలంటే గొప్ప మనస్సు ఉండాలి. చేసేది చిన్న సాయమా, పెద్ద సాయమా అనేది పక్కన పెడితే.. పక్క వారి జీవితాలను మెరుగు పర్చగలిగేది, కష్టాల నుండి గట్టెక్కించేది, నైరాశ్యంలో కూరుకుపోయిన జీవితంపై ఆసక్తిని పెంచి, భరోసా నిచ్చే మాట సాయం కూడా హెల్ప్ కిందకే వస్తుంది. అయితే ఈ రోజుల్లో ఏ సాయం చేస్తే.. ఎటు నుండి ఎటు వస్తుందో అని ముందుకు రావడం లేదు. ఎక్కడ హెల్ప్ అని అడుగుతారేమోనని బయట వ్యక్తులకే కాదూ.. స్నేహితులకు కూడా మొహం చాటేస్తున్నారు కొందరు. అయితే మానవత్వం చనిపోతున్న ఈ రోజుల్లో.. అడగకుండానే ఓ ముదసలికి సాయం చేసి గొప్ప మనస్సు చాటుకున్నాడు ఓ కోటీశ్వరుడు.

తాజాగా పంజాబ్‌లోని లూథియానాకు చెందిన ఓ కోటీశ్వరుడు.. రోడ్డుపై పళ్లు వ్యాపారం చేసుకుంటున్న ఓ పెద్దావిడ దగ్గర నుండి ఫ్రూట్స్ కొనుగోలు చేసి.. ఆమెను ఆశ్చర్యానికి గురయ్యేలా చేయడమే కాదూ.. ఆమె కళ్లల్లో ఆనందం నింపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. బిజినెస్ క‌న్స‌ల్టెంట్‌, లుధియానా లివ్ వ్య‌వ‌స్ధాప‌కుడు క‌వ‌ల్ చ‌బ్రా ఆఫీసు నుంచి ఇంటికి వెళుతుండ‌గా ఓ పెద్దావిడ చిన్న బండిపై పండ్లు అమ్ముకుంటూ దిగులుగా కూర్చోవడం చూసి ఆగి.. ఆమెను వెళ్లి పలకరించాడు. ఆమెతో కాసేపు ముచ్చటించాడు.  పెద్దావిడ వివరాలు, వ్యాపారం గురించి అడిగి తెలుసుకున్నాడు మూడు సంవత్సరాల నుండి ఈ బండిపై తాను పళ్లు అమ్ముకుంటున్నానని, రోజుకు 12 గంటలు పనిచేస్తున్నట్లు పేర్కొంది.

మరీ రోజు ఎంత సంపాదిస్తావమ్మా అని అడిగితే.. ఆ రోజు ఇప్పటి వరకు తాను రూ. 100 మాత్రమే అమ్మినట్లు దిగులు పడుతూ చెప్పింది. దీంతో ఆమె ముఖంలో ఆనందాన్ని చూడాలనుకున్న ఆ వ్యాపార వేత్త.. వెంటనే.. అక్కడ ఉన్న మొత్తం పళ్లను కొనుగోలు చేశాడు. ఆ మొత్తానికి ఆమెకు 3 వేల రూపాలను చెల్లించాడు. దీంతో ఆమె ఆనందంలో మునిగిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారగా.. దీనికి మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంతేకాకుండా.. ఓ 80 ఏళ్ల చిరు వ్యాపారి వద్దకు వెళ్లి అతడి వస్తువులను కొనుగోలు చేసి.. అతడి నుండి ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం అతడు చేస్తున్న మంచి పని పట్ల నెటిజన్ల ప్రశంసలు కూడా పొందాడు. మరీ ఇలాంటి చిరు వ్యాపారులకు సాయం చేసి పెద్ద మనస్సు చాటుకున్న ఈ వ్యాపారి పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Kawaljeet Singh (@kawalchhabra)

 

View this post on Instagram

 

A post shared by Kawaljeet Singh (@kawalchhabra)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి