iDreamPost

టెకీలకు కొత్త కష్టం.. ఇలాగైతే ఎన్ని లక్షల జీతమున్నా పెళ్లిళ్లు కష్టమే!

Girl Rejected Software Employee To Marry: సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇన్నాళ్లు ఉద్యోగాల విషయంలో చాలానే భయాలు ఎదుర్కొన్నారు. అవి తీరాయిలే అనుకుంటే ఇప్పుడు వారికి కొత్త కష్టం వచ్చి పడింది.

Girl Rejected Software Employee To Marry: సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇన్నాళ్లు ఉద్యోగాల విషయంలో చాలానే భయాలు ఎదుర్కొన్నారు. అవి తీరాయిలే అనుకుంటే ఇప్పుడు వారికి కొత్త కష్టం వచ్చి పడింది.

టెకీలకు కొత్త కష్టం.. ఇలాగైతే ఎన్ని లక్షల జీతమున్నా పెళ్లిళ్లు కష్టమే!

సాఫ్ట్ వేర్ జాబ్స్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. వారికి వచ్చే జీతాలు మరే ఫీల్డ్ లో రావు. ఒక్క సాఫ్ట్ వేర్ జాబ్ కొడితే రెండేళ్లలో లైఫ్ సెట్ అయిపోయినట్లే. ఏడాదికి లక్షల్లో ప్యాకేజీ ఉంటుంది. వారానికి 2 వీకాఫ్లు ఉంటాయి. జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. టెకీ అనగానే అందరూ ఇవే గుర్తు చేసుకుంటారు. కానీ, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ లైఫ్ మరోలా ఉందని అందరికీ తెలిసిందే. ఉద్యోగాలు ఎప్పుడు ఊడతాయో తెలీదు. జాబ్ సెక్యూరిటీ లేదు. ప్రశాంతంగా జాబ్ చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు కాస్త పరిస్థితులు మెరుగు పడ్డాయి. కానీ, వారికి కొత్త కష్టం వచ్చింది. అసలు సాఫ్ట్ వేర్ కుర్రాళ్లకు పెళ్లిళ్లు అవుతాయా? అనే అనుమానాలు, భయాలు బయట వినిపిస్తున్నాయి. మరి.. ఆ కష్టం ఏంటో మీరూ తెలుసుకోండి.

సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇన్నాళ్లు లేఆఫ్స్, ఉద్యోగాల తొలగింపు బాధలతో సతమతమయ్యారు. ఇప్పుడు కాస్త ఆ పరిస్థితి సద్దుమణిగింది. అందరూ కొంచం ప్రశాంతంగానే పని చేసుకుంటున్నారు. కానీ, టెకీ బ్యాచిలర్స్ కి ఇప్పుడు కొత్త కష్టం వచ్చింది. అదేంటంటే వారికి పెళ్లిళ్లు కావడం కష్టం అంటున్నారు. ఎందుకంటే ఒక యధార్థ ఘటనను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి తన మిత్రుడికి ఎదురైన ఒక అనూహ్య ఘటనను నెట్టింట పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ విషయం వైరల్ కావడం మాత్రమే కాకుండా.. సాఫ్ట్ వేర్ ఉద్యోగం, ఏడాదికి లక్షల్లో ప్యాకేజీ ఉన్నా మాకు పెళ్లిళ్లు కావా అని డీలా పడిపోతున్నారు.

Marriages in india

అసలు ఏం జరిగింది అంటే.. ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నాడు. పెళ్లి చూపులకు వెళ్లి పిల్లను చూశాడు. అంతా బాగానే ఉన్నా.. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని ఆ అమ్మాయి బాంబు పేల్చింది. అయితే ఎందుకు నచ్చలేదు అనే విషయం తెలుసుకోవాలి అనుకున్నాడు. అదే విషయాన్ని అమ్మాయిని అడిగితే గుండె పగిలే సమాధానం చెప్పింది. అతని జీతం తక్కువ అని పెళ్లికి నో చెప్పింది. ఈ అబ్బాయికి వచ్చేది ఏడాదికి రూ.8 లక్షలు. నిజానికి ప్రస్తుతం చాలామంది రూ.8 లక్షలు ఏడాదికి అంటే మంచి ప్యాకేజీ అనే అనుకుంటున్నారు. కానీ, ఆ అమ్మాయి మాత్రం ఏడాదికి రూ.25 లక్షల ప్యాకేజీ అయినా ఉండాలని కండీషన్ పెట్టింది. ఎందుకంటే ఆ అమ్మాయి ఎలాంటి ఉద్యోగం చేయడం లేదు.

ఒకరి సంపాదన మీదే ఇల్లు గడవాలి. కాబట్టి కనీసం రూ.25 లక్షలు ఉండాలని కోరింది. అలా అయితేనే ఎలాంటి ఇబ్బంది లేకుండా సంసారం సాఫీగా సాగుతుందని చెప్పిందటం. ఇంకేముంది ఆ టెకీ బ్యాచిలర్ ఈ విషయాన్ని తన మిత్రుడికి చెప్పుకుని బాధ పడ్డాడు. ఆ ఫ్రెండ్ ఈ విషయాన్ని ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికీ హార్ట్ అటాక్ తెప్పించేశాడు. రూ.8 లక్షల ప్యాకేజీ వాడికే పెళ్లికి నో చెప్పారంటే.. మాలాంటి పరిస్థితి ఏంటని మిగిలి స్ట్రీమ్స్ లో ఉండే బ్యాచిలర్స్ కూడా తలలు పట్టుకుంటున్నారు. కొందరు మాత్రం ఆ అమ్మాయి అడిగిన దాంట్లో తప్పేముంది అంటూ కామెంట్స్ చేయడం గమనార్హం. మరి.. టెకీలకు వచ్చిన కొత్త సమస్యపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి