iDreamPost

రూ.200 కోట్ల సంపదను వదిలి సన్యాసంలోకి దంపతులు.. ఎందుకంటే?

  • Published Apr 15, 2024 | 4:29 PMUpdated Apr 15, 2024 | 4:52 PM

ఇప్పుడు ప్రపంచంలో ఎంతో మంది సన్యాసులు ఉన్నారు. సన్యాసి జీవితం అంటే.. వారంతా ఎందుకు ఎలా సన్యాసం తీసుకున్నారో తెలియదు కానీ.. తాజాగా ఒక జంట మాత్రం వందల కోట్ల ఆస్తి వదిలి.. సన్యాసం స్వీకరించడానికి సిద్ధపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇప్పుడు ప్రపంచంలో ఎంతో మంది సన్యాసులు ఉన్నారు. సన్యాసి జీవితం అంటే.. వారంతా ఎందుకు ఎలా సన్యాసం తీసుకున్నారో తెలియదు కానీ.. తాజాగా ఒక జంట మాత్రం వందల కోట్ల ఆస్తి వదిలి.. సన్యాసం స్వీకరించడానికి సిద్ధపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

  • Published Apr 15, 2024 | 4:29 PMUpdated Apr 15, 2024 | 4:52 PM
రూ.200 కోట్ల సంపదను వదిలి సన్యాసంలోకి దంపతులు.. ఎందుకంటే?

ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలకు వెళ్లేందుకు చాలా మంది ఈ సన్యాస దీక్షను తీసుకుంటారు. ఇప్పుడు మన చుట్టూ ఉన్న ఎంతో మంది సన్యాసులు కూడా.. తపస్సు చేస్తూ. వారికీ నచ్చిన దేవుడిని కొలుచుకుంటూ.. నిరంతరం భక్తి ద్యాసలోనే ఉంటారు. అలాగే సన్యాసం తీసుకున్నవారికీ.. భౌతిక బంధాల మీద కానీ.. భౌతికంగా అనుభవించే విలాసవంతమైన జీవితం మీద కానీ ఏ మాత్రం వ్యామోహం ఉండదు. ఈ సమాజం మధ్యలో తిరుగుతూ ఉంటే వీటిపై ఎక్కడ మనసు మళ్లుతుందా అని.. చాలా మంది సన్యాస దీక్ష చేపట్టిన వారంతా భౌతిక వాసనలకు దూరంగా .. ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటారు. అయితే వారంతా ఎందుకు ఈ సన్యాస చేపట్టారో తెలియదు కానీ, తాజాగా ఒక జంట మాత్రం .. కోట్ల ఆస్తులను, బంగళాలను దానం చేసి.. సన్యాసం చేపట్టాలనే నిర్ణయాన్ని తీసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మానవ జీవితంలో పుట్టుక నుంచి మరణంలోపు ప్రతి ఒక్కరు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఉంటాయి. వాటిలో ఆఖరిది సన్యాసాశ్రమం. అంటే జీవితంలో అన్ని రుచులను చూసిన తర్వాత.. ఈ దశకు వస్తే మనస్సు అనేక రకాలుగా ఆలోచించకుండా.. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుందని అంతా చెబుతూ ఉంటారు. అయితే, తాజాగా ఒక జంట తమకు ఉన్న యావదాస్తిని చుట్టూ ఉన్న పని వాళ్లకు దారాదత్తం చేసి.. సన్యాసం స్వీకరించాలనే నిర్ణయాన్ని తీసుకున్నారంట. వారు ఎవరో కాదు.. గుజరాత్ కు చెందిన ప్రముఖ వ్యాపారి.. భవేశ్ భాయ్, అతని భార్య. వీరిద్దరూ కూడా వారికి ఉన్న రూ.200 కోట్ల ఆస్థిని, ఖరీదైన బంగళాలను తమ చుట్టూ ఉన్న పని వాళ్లకు దానం చేసేందుకు సిద్ధం అయ్యారు. జైన సమాజ వర్గానికి చెందిన వీరు ఇకపై సన్యాస మార్గంలో నడిచేందుకు.. సన్యాస దీక్షను చేపట్టారు.

200 crores left

ఇకపై ఈ జంట కేవలం భిక్షాటన ద్వారా మాత్రమే తమ రోజు వారి జీవనాన్ని కొనసాగించబోతున్నారు. “మెటీరియలిజం” అనే ఉచ్చులో చిక్కుకోకుండా ఆధ్యాత్మిక అన్వేషణ వైపు అడుగులు వేసేందుకు తాము ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నాం అని.. ప్రకటించారు. ఈ సంధర్బంగా .. సబర్‌కాంత జిల్లాలో భండారి దంపతులు నివసిస్తున్న హిమ్మత్‌నగర్‌లో భారీ ఊరేగింపు కూడా నిర్వహించారు. ఏప్రిల్ 22న కొంతమంది పెద్దల సమక్షంలో నదీ తీరానా వారికీ సన్యాస స్వీకరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అయితే భండారి పిల్లలు ఇప్పటికే సన్యాసం దిశగా అడుగులు వేశారు. భండారి కుమారుడు, కుమార్తె 2022 లో ఈ సన్యాస దీక్షను చేపట్టారు. తమ పిల్లలు ఆధ్యాత్మికంగా వేసిన అడుగులు ఇప్పుడు తల్లిదండ్రులకు మార్గ దర్శకాలుగా మారాయి. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో అందరిని ఆశ్చర్య పడేలా చేస్తోంది. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి