iDreamPost

క్యాన్సర్‌తో పోరాడుతున్న 7 ఏళ్ల చిన్నారి.. సాయం కోసం తల్లిదండ్రులు ఎదురుచూపులు

చిన్న పిల్లలకు ఆటల్లో చిన్న దెబ్బలు తగిలితేనే విలవిలాడిపోతుంటారు తల్లిదండ్రులు. అలాంటిది వారిని పెద్ద రోగం కబళించేస్తుందని తెలిస్తే.. గుండెలు పిండేస్తూ ఉంటుంది. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వైద్యం చేయిస్తుంటారు. కొన్ని సార్లు ఆర్థిక పరిస్థితి సహకరించదు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో ఆపన్న హస్తం కోసం వేడుకుంటారు.

చిన్న పిల్లలకు ఆటల్లో చిన్న దెబ్బలు తగిలితేనే విలవిలాడిపోతుంటారు తల్లిదండ్రులు. అలాంటిది వారిని పెద్ద రోగం కబళించేస్తుందని తెలిస్తే.. గుండెలు పిండేస్తూ ఉంటుంది. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వైద్యం చేయిస్తుంటారు. కొన్ని సార్లు ఆర్థిక పరిస్థితి సహకరించదు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో ఆపన్న హస్తం కోసం వేడుకుంటారు.

క్యాన్సర్‌తో పోరాడుతున్న 7 ఏళ్ల చిన్నారి.. సాయం కోసం తల్లిదండ్రులు ఎదురుచూపులు

అది చిన్న కుటుంబం, చింత లేని కుటుంబం. భార్యా భర్తలు.. వారికి ఇద్దరు బంగారపు బొమ్మలు. వారిని చూసి మురిసిపోయేవారు తల్లిదండ్రులు. ఇద్దరు గలగలా నవ్వుతూ ఉంటే.. వాటిని చూసి బాధను కూడా మర్చిపోయేవారు. ఆడుతూ, పాడుతూ, తుళ్లుతూ సరదాగా గడిపోతున్నాయి రోజులు. అయితే వారి కుటుంబంపై ఏ కన్ను దిష్టి పడిందో తెలియదు కానీ.. ఒక్కసారిగా జీవితం తల్లకిందులైంది. భవిష్యత్తుపై ఆశలను నీరుగార్చింది. ఇంతకు ఏమైందంటే..? అభం, శుభం తెలియని బంగారు చిన్నారిని మహమ్మారి రోగం పట్టి పీడిస్తుందని తెలిసి.. ఒక్కసారిగా తల్లడిల్లిపోయారు తల్లిదండ్రులు. పాప వైద్యం కోసం ఆదుకోవాలంటూ ఆర్థిస్తుంది ఆ కుటుంబం.

వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని సిద్ధిపేటకు చెందిన అనగందుల రఘ, మంజుల దంపతలుకు ఇద్దరు కుమార్తెలు. అందులో పెద్దమ్మాయి వేదవల్లి (7) గత ఏడాది నవంబర్‌లో జ్వరం బారిన పడింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి.. చికిత్స అందించారు. జ్వరం తగ్గినట్లే తగ్గుతూ వస్తూ ఉంది. అయితే మరోసారి వైద్యుడ్ని సంప్రదించగా.. ఇది వైరల్ ఫీవర్ అంటూ మందులు రాసిచ్చారు. అవి వాడినా తగ్గకపోవడంతో.. మరో వైద్యుడ్ని సంప్రదించారు. వేదవల్లికి పలు పరీక్షలు నిర్వహించగా.. పాపకు బ్లడ్ క్యాన్సర్ అని తెలియడంతో తల్లిదండ్రుల గుండెల్లో పిడుగుపడినట్లయ్యింది. అయినప్పటికీ.. తమ పాప కన్నా ఏదీ ముఖ్యం కాదని భావించి.. పెద్ద పెద్ద ఆసుపత్రుల చుట్టూ తిప్పారు.

అక్కడ బాగా చూస్తారు, ఇక్కడ బాగా చూస్తారు అన్న సలహాలు విని, తమిళనాడు,వైజాగ్, ముంబయి ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ముంబయిలోని టాటా మోమోరియల్ ఆసుపత్రిలో చికిత్స అందించగా.. వైద్యం కోసం రూ. 30 లక్షలు ఖర్చు చేశారు. ఇంటిని అమ్మగా వచ్చిన డబ్బుల్ని పాప వేదవల్లి కోసం వినియోగించారు. అయితే ఇప్పుడు.. పాపకు బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ చేయాలని, అందుకోసం రూ. 20 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో.. అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకు రావాలని దిగులు చెందుతున్నారు తల్లిదండ్రులు. తమ దగ్గర ఉన్నదంతా.. పాపకు వైద్యానికి పెట్టేయడంతో..దిక్కుతోచని స్థితిలో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరైనా సాయం చేస్తే తమ కూతుర్ని తిరిగి మామూలు మనిషి అవుతుందని, తమ కుటుంబాన్ని నిలబెట్టిన వారు అవుతారని వేడుకుంటున్నారు. ఆర్థిక సాయం చేయాలనుకుంటే కింద పేర్కొన్న వివరాలు చూడండి.

Bank Name: RBL Bank
Account number : 2223220119848758
Account name : Vedhavalli Anagandula
IFSC code : RATN0VAAPIS
(The digit after N is Zero)
For UPI Transaction: assist.raghu9935@icici
Phone No: 9440611760

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి