iDreamPost

17 ఏళ్ల విద్యార్థినితో 50 ఏళ్ల టీచర్ పరార్! మూడు నెలలుగా..!

17 ఏళ్ల విద్యార్థినితో 50 ఏళ్ల టీచర్ పరార్! మూడు నెలలుగా..!

ఈ రోజుల్లో కొందరు ఉపాధ్యాయులు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. చదువు చెప్పాల్సింది పోయి పిల్లలకు ప్రేమ పాఠాలు చెబుతూ వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. ఇంతటితో సరి పెట్టకుండా వారితో శారీరక కోరికలు తీర్చుకుంటూ చివరికి వారితో లేచిపోతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి. ఇవి మరువక ముందే ఇలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. ఓ 50 ఏళ్ల టీచర్ 17 ఏళ్ల స్టూడెంట్ తో పరారయ్యాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ గోండా జిల్లాలోని కొత్వాలి ప్రాంతంలోని ఓ 17 ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అయితే ఈ బాలిక స్థానికంగా ఉన్న ఓ కాలేజీలో ప్లస్ 2 చదువుతున్నట్లు తెలుస్తుంది. కాగా, ఇదే కాలేజీలో 50 ఏళ్ల వ్యక్తి టీచర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇకపోతే.. ఈ బాలికను ఇతగాడు ఎప్పటి నుంచో ఓ కన్నేసి ఉంచాడు. ఎలాగైన ఆ అమ్మాయితో కోరిక తీర్చుకోవాలని భావించాడు. ఇందులో భాగంగానే.. ఆ టీచర్ గత మూడు నెలల కిందటే ఆ బాలికను తీసుకుని పరారయ్యాడు. అప్పటి నుంచి ఆ బాలిక తల్లిదండ్రులు కూతురి జాడ కోసం వెతుకుతూనే ఉన్నారు.

ఈ క్రమంలోనే ఆ టీచర్ మరో దారుణానికి ఒడిగట్టాడు. ఆ మైనర్ బాలికతో అసభ్యకరంగా వీడియోలు, ఫోటోలు తీసి గ్రామస్తులకు పంపి వైరల్ చేస్తున్నాడు. ఇక తట్టుకోలేకపోయిన ఆ విద్యార్థిని తల్లిదండ్రులు ఇటీవల స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 17 ఏళ్ల బాలికను తీసుకుని పరారైన ఈ దుర్మార్గుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి