iDreamPost

TV యాంకర్‌పై తీర్థంలో నిద్రమాత్రలు కలిపి పూజారి అత్యాచారం!

Chennai Crime News: ఇటీవల మహిళలపై అత్యారాచాలు, లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. కొంతమంది కేటుగాళ్లు యువతులను నమ్మించి లైంగిక కోరిక తీర్చుకొని దూరం పెడుతున్నారు.

Chennai Crime News: ఇటీవల మహిళలపై అత్యారాచాలు, లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. కొంతమంది కేటుగాళ్లు యువతులను నమ్మించి లైంగిక కోరిక తీర్చుకొని దూరం పెడుతున్నారు.

TV యాంకర్‌పై తీర్థంలో నిద్రమాత్రలు కలిపి పూజారి అత్యాచారం!

దేశంలో ప్రతి నిత్యం ఆడవాళ్లపై ఎక్కడో అక్కడ అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరిగ మహిళళలు కనిపిస్తే చాలు మగాళ్లు మృగాళ్లుగా మారి రెచ్చిపోతున్నారు. చిన్న పెద్ద అనే వయసు తేడా లేకుండా అత్యాచారాలకు పాల్పపడుతున్నారు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు వచ్చినా కామంధుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. పూజారి అని నమ్మిన ఓ మహిళను దారుణంగా మోసం చేసి ఆమెపై అత్యాచారం చేసిన ఘటన చెన్నైలో సంచలనం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

గౌరవమైన పూజారి వృత్తిలో ఉండి మహిళపై దారుణానికి తెగబడిన ఘటన చెన్నైలో తీవ్ర కలకలం రేపింది. చెన్నైలోని ప్రధాన అమ్మవారి ఆలయానికి చెందిన పూజారి తీర్థంలో నిద్రమాత్రలు కలిపి టీవీ ఛానల్ యాంకర్ పై అత్యాచారానికి పాల్పపడ్డాడు. ఈ ఘటనపై సదరు టీవీ యాంకర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలోని ప్రధాన అమ్మవారి ఆలయంలో కార్తీక్ మునిస్వామి పూజారిగా వ్యవహరిస్తున్నారు. చెన్నైలోని సాలిగ్రాం ప్రాంతంలో ఉంటున్న టీవీ యాంకర్ కి పూజారి కార్తీక్ తో పరిచయం ఏర్పడింది. గుడికి వచ్చినపుడు గర్భగుడిలోకి తీసుకువెళ్లి ప్రత్యేక దర్శనం చేయించేవాడు.

ఈ క్రమంలోనే గుడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి తన కారులో తీసుకువెళ్తానని చెప్పాడు. కారులో ప్రయాణిస్తున్న సమయంలో తీర్థం ఇచ్చిన తర్వాత యాంకర్ స్పృహ కోల్పోయింది. తర్వాత ఆమెపై కార్తీక్ అత్యాచారం చేశాడు. తనకు స్పృహ వచ్చిన తర్వాత యాంకర్ పూజారిని నిలదీయడంతో పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తప్పించుకుంటున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తాను గర్భం దాల్చితే ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి అబార్షన్ చేయించాడని.. తర్వాత తనని వ్యభిచారం చేయాల్సిందిగా బలవంతం చేశాడని యాంకర్ ఫిర్యాదులో పేర్కొంది. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి