iDreamPost

9 Hours Season 1 9 అవర్స్ రిపోర్ట్

9 Hours Season 1  9 అవర్స్ రిపోర్ట్

కొద్దిరోజుల క్రితం డిస్నీ హాట్ స్టార్ లో విడుదలైన అచ్చ తెలుగు వెబ్ సిరీస్ 9 అవర్స్. ప్రమోషన్లు బాగా చేయడంతో ప్రేక్షకుల్లో దీని మీద ఆసక్తి బాగానే నెలకొంది. నందమూరి తారకరత్న మొదటి డిజిటల్ డెబ్యూ ఇదే. అధిక శాతం పేరున్న యాక్టర్లే ఇందులో నటించారు. అప్పుడెప్పుడో ముప్పై ఐదేళ్ల క్రితం సుప్రసిద్ధ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రాసిన 9 గంటల నవలనే దర్శకుడు క్రిష్ ఇప్పటి ట్రెండ్ అభిరుచులకు అనుగుణంగా మర్చి రాశాడు. డైరెక్టర్ ఆయన కానప్పటికీ నిర్మాణ భాగస్వామ్యంతో పాటు కీలక బాధ్యతలు చూసుకున్నారు. నిరంజన్ కౌశిక్, జాకోబ్ వర్గీస్ జంటగా దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ డ్రామా ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం.

ఇది 1985 హైదరాబాద్ లో సాగే కథ. జైలు నుంచి కొందరు ఖైదీలు అక్కడి జైలర్ సహాయంతో కాయగూరలు రవాణా చేసే వ్యాన్ లో తప్పించుకుంటారు. కేవలం తొమ్మిది గంటల్లో మూడు బ్యాంకులు దోపిడీ చేసి టైం అయ్యేలోపు తిరిగి రావాలనేది వాళ్ళ ప్లాన్. రెండు చోట్ల దాన్ని విజయవంతంగా అమలు చేస్తారు. కానీ కోటిలో ఉన్న ఇంపీరియల్ బ్యాంకు బ్రాంచ్ లో ఈ దొంగలు ఇరుక్కుపోతారు. ఇన్స్ పెక్టర్ ప్రతాప్(తారకరత్న)రంగంలోకి దిగుతాడు. లోపల ఉన్న సిబ్బంది, కస్టమర్ల వల్ల ఆ ముఠాకు ఇబ్బందులు ఎదురవుతాయి. తర్వాత ఏం జరిగిందనేది సిరీస్ లో చూడాలి. ఇక్కడ చెప్పినంత సింపుల్ గా స్టోరీ ఉండదు. చాలా మలుపులు పాత్రలు ఉంటాయి.

మొత్తం 9 ఎపిసోడ్లతో సాగిన ఈ సిరీస్ అరగంట చొప్పున మొత్తం నాలుగున్నర గంటలు ఉంది. అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా రామోజీ ఫిలిం సిటీలో సెట్ చేసుకున్న ఆర్ట్ వర్క్ బాగుంది. కొంత ల్యాగ్ ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే పర్లేదు అనిపిస్తుంది. అయితే రాబరీ డ్రామాల్లో ఉండాల్సిన డెప్త్ మిస్ కావడంతో ఫీల్ తగ్గింది. అజయ్, మధుశాలిని, బెనర్జీ, శ్రీతేజ్, రవివర్మ, వినోద్ కుమార్, రాజ్ ముదిరాజ్, గిరిధర్, సమీర్ ఇలా క్యాస్టింగ్ విషయంలో పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేశారు. కాకపోతే క్లైమాక్స్ లో చాలా కన్ఫ్యూజన్ కి చోటిచ్చారు. అది సెకండ్ సీజన్ కోసమా లేక నిడివి కోసం రాజీ పడ్డారా అనేది తెలియలేదు. ఈ కారణంగా మొత్తం చూశాక ఏదో మిస్ అయ్యిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఫ్రీ టైం ఎక్కువగా ఉంటే ఈ 9 అవర్స్ మరీ ఎక్కువగా నిరాశపరచదు. ట్రై చేయొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి