iDreamPost

OTTలో మార్వెల్ మూవీస్ మేకింగ్ వీడియో.. అంతరిక్షాన్నే గదిలోకి తీసుకొచ్చి..

The Marvels Movie Making Video: మార్వెల్ స్టూడియో చిత్రాలు అంటే ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అయితే ఆ సినిమాలను ఎలా షూట్ చేస్తారో తెలుసా? ఒక గదిలోనే షూటింగ్ మొత్తం పూర్తి చేస్తారని తెలుసా? అయితే ఓటీటీలో ఈ మేకింగ్ వీడియో చూడండి.

The Marvels Movie Making Video: మార్వెల్ స్టూడియో చిత్రాలు అంటే ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అయితే ఆ సినిమాలను ఎలా షూట్ చేస్తారో తెలుసా? ఒక గదిలోనే షూటింగ్ మొత్తం పూర్తి చేస్తారని తెలుసా? అయితే ఓటీటీలో ఈ మేకింగ్ వీడియో చూడండి.

OTTలో మార్వెల్ మూవీస్ మేకింగ్ వీడియో.. అంతరిక్షాన్నే గదిలోకి తీసుకొచ్చి..

ప్రపంచవ్యాప్తంగా యాక్షన్ చిత్రాలకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. అందుకే హాలీవుడ్ చిత్రాలకు వరల్డ్ వైడ్ గా వేల కోట్ల మార్కెట్ ఉంది. ముఖ్యంగా మార్వెల్ స్టూడియోస్ చిత్రాలకు, మార్వెల్ యూనివర్స్ లో ఉండే సూపర్ హీరోలకు విపరీతపైన ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా మార్వెల్ చిత్రాలకు కోటానుకోట్ల మార్కెట్ ఏర్పడింది. అయితే ఈ మూవీస్ ని చూస్తున్నంత సేపు అసలు ఎలా షూట్ చేస్తారు? అంత సహజంగా వాళ్లు ఎలా చిత్రాలు నిర్మిస్తారు అనే ప్రశ్న అందరికీ వస్తుది. అందుకే అభిమానుల కోసం మార్వెల్ స్టూడియోస్ వారి చిత్రాల మేకింగ్ వీడియోలను కూడా విడుదల చేస్తూ ఉంటుంది. అవి ఓటీటీలో అందుబాటులో ఉంటాయి.

మార్వెల్ స్టూడియో చిత్రాలకు, సూపర్ హీరోలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ చిత్రాలను స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు వారిని వాళ్లు మర్చిపోతూ ఉంటారు. అంత అద్భుతమైన అవుట్ పుట్ రావాలి అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం అనే చెప్పాలి. అందుకే మార్వెల్ చిత్రాలకు వందల కోట్లలో బడ్జెట్ అవుతుంది. ఎంత ఖర్చు పెట్టినా కూడా ఈ చిత్రాలను ఒక గదిలోనో.. ఒక షెడ్ లోనే చిత్రీకరిస్తూ ఉంటారు. వీళ్ల షూటింగ్ ఆల్మోస్ట్ గ్రీన్ స్క్రీన్, బ్లూ స్క్రీన్ మీదనే జరుగుతూ ఉంటుంది. కాకపోతే సరికొత్త టెక్నాలజీని వాడుతూ ఉంటారు. ప్రస్తుతం మనకి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మార్వెస్ స్టూడియోస్ నిర్మించి ది మార్వెల్స్ మూవీకి సంబంధించిన బిహైండ్ సీన్స్ వీడియో అందుబాటులో ఉంది. ఈ మూవీకి మేకింగ్ సంబంధించి ఒక డాక్యుమెంటరీలా ఈ వీడియో విడుదల చేశారు.

ఈ మేకింగ్ వీడియో మొత్తం 59 నిమిషాలు ఉంటుంది. ఇందులో అసలు ది మార్వెల్స్ సినిమా షూటింగ్, సౌండ్, వీఎఫ్ఎక్స్ అన్నింటి గురించి స్పష్టంగా వివరించారు. అలాగే అంతరిక్షాన్ని వాళ్లు గదిలోకి ఎలా తీసుకొచ్చింది చూపించారు. ముఖ్యంగా స్పేస్ సీన్స్ కోసం పెద్ద ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు దాని మీద వారికి కావాల్సిన స్పేస్ విజువల్స్ ని ప్లే చేస్తు దాని ముందు యాక్టర్స్ నటిస్తూ ఉంటారు. ది మార్వెల్స్ చిత్రం చూసిన వారికి ఈ మేకింగ్ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే సినిమాలో అంత రియలిస్టిక్ గా ఉన్న సీన్ ఇలా షూట్ చేశారా అంటూ నోరెళ్లబెడతారు. మొత్తానికి మార్వెల్ చిత్రాల్లో గ్రాఫిక్స్ ఏ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తాయో అర్థమవుతుంది. అలాగే చాలా వరకు సహజంగా ఉండేలా షూట్ చేసేందుకే వాళ్లు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి.. ది మార్వెల్స్ మేకింగ్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి