iDreamPost

మహిళ చేతిలో డ్ర*గ్స్ సామ్రాజ్యం.. OTTలో ఈ సిరీస్ మిస్ కావొద్దు!

OTT Suggestions: ఓటీటీలో ఒక అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఉంది. ఒక మహిళ కొన్ని వేలకోట్ల డ్ర*గ్స్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తుంది. దేశ విదేశాల్లో కూడా తన ప్రోడక్ట్ కి డిమాండ్ క్రియేట్ చేసుకుంటుంది. ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ని చూశారా?

OTT Suggestions: ఓటీటీలో ఒక అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఉంది. ఒక మహిళ కొన్ని వేలకోట్ల డ్ర*గ్స్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తుంది. దేశ విదేశాల్లో కూడా తన ప్రోడక్ట్ కి డిమాండ్ క్రియేట్ చేసుకుంటుంది. ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ని చూశారా?

మహిళ చేతిలో డ్ర*గ్స్ సామ్రాజ్యం.. OTTలో ఈ సిరీస్ మిస్ కావొద్దు!

ఓటీటీలో చాలా సినిమాలు, వెబ్ సిరీస్లు హీరో ఓరియంటెడ్ ఉంటాయి. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఉన్న కొన్ని మాత్రం నెక్ట్స్ లెవల్లో ఉంటాయి. లేడీ లీడ్ లో వెబ్ సిరీస్లు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రం అస్సలు మిస్ కాకూడనివి ఉంటాయి. ఇప్పుడు మీకోసం అలాంటి ఒక లేడీస్ లీడ్ వెబ్ సిరీస్ తీసుకొచ్చాం. ఈ సిరీస్ లో ఒక్క మహిళ ఒక పెద్ద డ్ర*గ్స్ సామ్యాజ్యాన్ని స్థాపిస్తుంది. వేల కోట్ల బిజినెస్ ని ఒంటి చేత్తో హ్యాండిల్ చేస్తుంటుంది. ఆ మహిళ ఎవరు? ఒక మహిళ అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించింది? తన కుటుంబం మొత్తం అందుకు ఎలా ఒప్పుకున్నారు? అసలు ఆ వెబ్ సిరీస్ ఏది? ఎందులో స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

లేడీ ఓరియంటెడ్ సిరీస్ అంటే ఎలివేషన్స్ కు చాలా తక్కువ స్కోప్ ఉంటుంది అనుకుంటారు. కానీ, ఈ సిరీస్ మొత్త ఆ లేడీ క్యారెక్టర్ కి బీభత్సమైన ఎలివేషన్స్ ఉంటాయి. ఫ్లాష్ బ్యాక్ మొత్తం గూస్ బంబ్స్ తెప్పిస్తుంటుంది. ఆ వెబ్ సిరీస్ మరేదో కాదు.. ‘సాస్ బహూ ఔర్ ఫ్లెమింగో’. ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ సిరీస్ మే 5, 2023 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సీజన్లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు నిడివి కలిగి ఉంటుంది. ఇది ఏ సర్టిఫికేట్ సిరీస్. సాధారణంగా మాదకద్రవ్యాలు అంటే ఏ సర్టిఫికేటే వస్తుంది. అలాగే కొన్ని నాన్ వెజ్ డైలాగ్స్ కూడా ఉంటాయి.

Lady don

ఈ వెబ్ సిరీస్ ని మొత్తం నలుగురు రైటర్స్ రాశారు. దానిని హోమీ అదజానియా డైరెక్ట్ చేశాడు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఆఖరి ఎపిసోడ్ వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా, ల్యాగ్ అనే భావన రాకుండా మంచి గ్రిప్పింగ్ గా కథ రాసుకున్నారు. దానిని అంతే పకడ్బందీగా తెరకెక్కించారు. ఈ సిరీస్ కి ఐఎండీబీలో 7.9 రేటింగ్ దక్కింది. ఈ సిరీస్ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలి అంటే.. ఒక మహిళ తల్చుకుంటే ఏదైనా సాధించగలదు అనే విషయాన్ని ఈ సిరీస్ లో చూపించారు. ఒకవైపు బాధ్యత గల తల్లిగా, మరోవైపు వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఏలుతున్న మకుటంలేని మహారాణిగా చూపిస్తారు. ఈ సిరీస్ లో లేడీ డాన్ సావిత్రికి ఒక కుటుంబం ఉంటుంది. ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉంటుంది. కొడుకులు ఇద్దరు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తుంటారు. సావిత్రి మాత్రం కూతురు, కోడళ్లతో కలిసి డ్ర*గ్స్ సామ్రాజ్యాన్ని చక్కపెడుతూ ఉంటుంది. వారు సొంతంగా ఫ్లెమింగో అనే డ్ర*గ్ ని సృష్టిస్తారు. దానికి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది.

సావిత్రి కుటుంబం తయారు చేసిన ఫ్లెమింగోకి కొందరు డూప్లికేట్ రెడీ చేసి ప్రాణాలు పోయేందుకు కారణం అవుతారు. అసలు ఈ ఫ్లెమింగో ఎక్కడ నుంచి వస్తోంది అంటూ పోలీసులు విచారణ మొదలు పెడతారు. మరోవైపు సావిత్రికి శత్రువుల బెడద కూడా పెరుగుతుంది. తన సామ్రాజ్యానికి కొత్త నాయకుడు కావాలని బావిస్తుంది. అది కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, కోడళ్లు కావచ్చు. ఎవరో నిర్ణయం తీసుకుని చెప్తాను అంటుంది. మరి.. ఆ వారసుడు ఎవరు? పోలీసులు సావిత్రిని పట్టుకున్నారా? శత్రువుల నుంచి సావిత్ర సామ్రాజ్యం సేఫ్ గా ఉందా? ఈ సవాళ్లను సావిత్రి ఎలా ఎదుర్కొంది? అనేదే మిగిలిన కథ. సిరీస్ మాత్రం నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. యాక్టర్స్ అందరూ ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. మరి.. ఈ సాస్ బహూ ఔర్ ఫ్లెమింగో సిరీస్ చూడాలి అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి