iDreamPost

80 ఏళ్ల సంసారం తర్వాత విడాకుల కోసం కోర్టుకి.. OTTలో బెస్ట్ ఫ్యామిలీ డ్రామా..

OTT Suggestions- Best Family Drama: ఓటీటీలో ఏ సినిమా చూడాలో అర్థంకాక తికమకలో ఉన్నారా? అయితే ఈ బెస్ట్ ఫ్యామిలీ డ్రామాని ఒకసారి చూసేయండి. మీరు ఒక బెస్ట్ మూవీ చూశామే అనే భావన కలుగుతుంది.

OTT Suggestions- Best Family Drama: ఓటీటీలో ఏ సినిమా చూడాలో అర్థంకాక తికమకలో ఉన్నారా? అయితే ఈ బెస్ట్ ఫ్యామిలీ డ్రామాని ఒకసారి చూసేయండి. మీరు ఒక బెస్ట్ మూవీ చూశామే అనే భావన కలుగుతుంది.

80 ఏళ్ల సంసారం తర్వాత విడాకుల కోసం కోర్టుకి.. OTTలో బెస్ట్ ఫ్యామిలీ డ్రామా..

ఓటీటీలు వచ్చిన తర్వాత లెక్కకు మించిన సినిమాలు వచ్చేశాయి. ఏ మూవీ చూడాలో? ఏ వెబ్ సిరీస్ చూడాలో ఒక పట్టాన క్లారిటీ రాదు. అందరి దగ్గర రెండు, మూడు ఓటీటీలు ఉంటున్నాయి. వాటిలో ఎన్నో సినిమాలు ఉంటున్నాయి. అలా ఏ మూవీ చూడాలో క్లారిటీ లేక ఇబ్బంది పడుతున్న ఓటీటీ ఆడియన్స్ కోసం మేము అన్ని రకాల సినిమాలు, వెబ్ సిరీస్లను సజీషన్స్ రూపంలో తీసుకొస్తున్నాం. వాటికి మంచి రెస్పాన్స్ కూడా లభిస్తోంది. ఈసారి మీకోసం ఒక మంచి ఫ్యామిలీ డ్రామా తీసుకొచ్చాం. ఈ ఫ్యామిలీ డ్రామాని చూశాక మీకు ఒక మంచి సినిమా చూశామనే భావన తప్పకుండా కలుగుతుది. మరి ఆ మూవీ ఏది? ఏ ఓటీటీలో ఉంది? ఆ మూవీ కథ ఏంటో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకుంటున్న మూవీ ఒక మంచి మలయాళం ఫ్యామిలీ డ్రామా. ఇందులో కావాల్సినంత ఫన్ ఉంటుంది. అలాగే ఈ మూవీ మంచి ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని కూడా చెప్పాలి. ఒకవైపు నవ్విస్తూనే మరోవైపు ఎమోషనల్ చేసేస్తారు. ఈ మూవీ మరేదో కాదు.. మలయాళం కామెడీ డ్రామా పూక్కాలం. ఇది ఏప్రిల్ 8 2023న థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక మంచి ఫ్యామిలీ డ్రామా చూడాలి. అందులోనూ మంచి కామెడీతో పాటు మంచి మెసేజ్ ఉండాలి అని కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. చూసిన తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూశామనే బావన కూడా కలుగుతుంది.

ఈ సినిమాలో మెయిన థీమ్ వచ్చేసి.. 80 ఏళ్ల సంసారం తర్వాత ఒక తాత తన భార్య నుంచి విడాకులు తీసుకోవాలి అని ఫిక్స్ అవుతారు. ఎందుకంటే ఇల్లు సర్దుతున్న సమయంలో ఆ తాతకు తన భార్యకు ఎవరో రాసిన ప్రేమలేఖ దొరుకుతుంది. అది 50 ఏళ్ల క్రితం రాసిన ప్రేమలేఖ. ఆ ప్రేమలేఖను పట్టుకుని ఆ తాత తన భార్య నుంచి విడాకులు కావాలి అని కోర్టుకెక్కుతాడు. ఈ విషయం విన్న తర్వాత ఇంట్లో ఉన్న కొడుకులు, కూతుర్లు, మనవళ్లే కాదు.. ముని మనవల్ళు, మనవరాళ్లు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇలాంటి వయసులో విడాకులు తీసుకుంటారా అని? అయితే ఎలాగైన విడాకులు తీసుకోవాల్సిందే అని ఆ తాత కోర్టుకు వెళ్తాడు.

ఈ మూవీ కోర్ట్ రూమ్ లో కూడా మంచి కామెడీని జనరేట్ చేశారు. వాదించే లాయర్ కు జడ్జీ ఫ్రెండ్ మాత్రమే కాకుండా.. క్లాస్ మేట్ కూడా. ఈ లాయర్ పేపర్లో చూసి రాసే ఆయన జడ్డి అయ్యాడు. అయితే ఆ లాయర్ కు వాదించడం రాదు. అలా జడ్డి, లాయర్ మధ్య జరిగే ఫన్ నెక్ట్స లెవల్లో ఉంటుంది. ఇంక తాతాబామ్మల విషయానికి వస్తే.. ఇంట్లో కొంతమంది వారికి విడాకులు ఇప్పించాలని చూస్తారు. అసలు వాళ్లు విడాకులు తీసుకున్నారా? చివరకు కలిసిపోయారా? కోర్టు విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకుందా? ఇలాంటి వాటికి సమాధానాలు కావాలంటే ఈ పూక్కాలం మూవీ చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి