తెలంగాణలో వెలుగు చూసిన భారీ స్కామ్‌! ఏకంగా 700 కోట్ల కుంభకోణం!

తెలంగాణలో వెలుగు చూసిన భారీ స్కామ్‌! ఏకంగా 700 కోట్ల కుంభకోణం!

Telangana, Gorrela Pampini Pathakam Scam: ఒక వర్గం ప్రజల జీవనప్రమాణ స్థాయిని పెంచేందుకు ప్రభుత్వం ఒక ఆసరా చూపించాలని భావిస్తే.. అవినీతి అధికారులు అందులో కూడా డబ్బు దండుకున్నారు. తెలంగాణలో తాజాగా 700 కోట్ల స్కామ్‌ జరిగినట్లు ఏసీబీ అంటోంది. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Telangana, Gorrela Pampini Pathakam Scam: ఒక వర్గం ప్రజల జీవనప్రమాణ స్థాయిని పెంచేందుకు ప్రభుత్వం ఒక ఆసరా చూపించాలని భావిస్తే.. అవినీతి అధికారులు అందులో కూడా డబ్బు దండుకున్నారు. తెలంగాణలో తాజాగా 700 కోట్ల స్కామ్‌ జరిగినట్లు ఏసీబీ అంటోంది. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

గొర్రెల పంపిణీలో అవకతవకలు జరిగాయని దర్యాప్తు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ సంచలన విషయాలను వెలుగులోకి తెస్తోంది. ఈ కేసు విషయంలో తాజాగా ఇద్దరు కీలక అధికారులను అరెస్ట్‌ చేసింది ఏసీబీ. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో రూ.2.10 కోట్ల అవినీతి జరిగిందని రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా నలుగురు గవర్నమెంట్‌ ఆఫీసర్లను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. వారి నుంచి సేకరించిన సమాచారంతో.. మరింత విచారణ జరిపి.. తాజాగా మరో ఇద్దరు బడా అధికారులను అదుపులోకి తీసుకుంది. ఆ ఇద్దరిలో తెలంగాణ పశుసంవర్ధక శాక సీఈఓ సబావత్‌ రామ్‌చందర్‌తో పాటు ఓఎస్‌డీ కళ్యాణ్‌కుమార్‌ ఉన్నారు.

గొర్రెల పంపిణీ పథకంలో అవినీతికి పాల్పడి.. ప్రైవేట్‌ వ్యక్తులతో కలిసి బినామీ బ్యాంక్‌ ఖాతాల్లోకి పథనం నిధులు దారిమళ్లించినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. అయితే.. ఈ స్కామ్‌ విలువ కేవలం రూ.2.10 కోట్లు కాదని ఏకంగా రూ.700 కోట్ల వరకు ఉండొచ్చని ఏసీబీ అనుమానిస్తోంది. ఈ రూ.700 కోట్లలో బ్రోకర్లు, అధికారులే పెద్ద మొత్తంలో కొట్టేసి ఉంటారని భావిస్తోంది. ఈ స్కామ్‌లో కింది స్థాయి అధికారి నుంచి హైలెవల్‌ అధికారులను ఎవర్ని వదిలిపెట్టకుండా.. ఏసీబీ విచారణ చేయాలని అనుకుంటోంది. అలాగే ప్రభుత్వంలోని ఉన్నాతాధికారుల పాత్రపై ఏసీబీ పూర్తిస్థాయి విచారణ జరుపుతోంది. రంగారెడ్డి జిల్లాఓ జరిగిన అవకతవలపై విచారణ జరపగా.. ఇంత పెద్ద స్కామ్‌ బయటపడింది.

ఈ గొర్రెల స్కామ్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్ట్‌ అయిన నలుగురు అధికారుల్లో.. మేడ్చల్ పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య, కామారెడ్డి వెటర్నరీ ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్‌ రవి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్‌ గణేష్‌‌, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతిరెడ్డిలను ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలతో వారిని చంచల్ గూడ జైలుకు తరలించింది. గొర్రెల పంపిణీ పథకంలో అవినీతికి పాల్పడి.. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ బ్యాంక్ ఖాతాల్లోకి పథకం నిధులను తరలించిన వీరికి ఎలాంటి శిక్ష పడుతుందో చూడాలి. మరి ఈ గొర్రెల స్కామ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments