iDreamPost

వాయు కాలుష్యం… మీ ఆయుర్ధాయం ఎంత త‌గ్గుతుందో తెలుసా?

వాయు కాలుష్యం… మీ ఆయుర్ధాయం ఎంత త‌గ్గుతుందో తెలుసా?

గత కొన్నేళ్ళుగా భారత్ లో వాయు కాలుష్యం పెరుగుతోంది అనే వార్తలు వింటూనే ఉన్నాం. అయితే చికాగో విశ్వవిద్యాలయంలో ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ తయారు చేసిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ ప్రకారం కొన్ని ఆశ్చర్యకర నిజాలు బయటకొచ్చాయి.

నేడు ఉన్న వాయు కాలుష్య తీవ్రత ప్రకారం, దేశంలో నివసించే ప్రజల ఆయుర్దాయం 5 సంవత్సరాల వరకు పడిపోయిందిని తేల్చింది. ఈ సర్వే కోసం 2022 నంచి డేటాను తీసుకోగా, జాతీయ వాయు నాణ్యతా ప్రమాణమైన 40 μg / m3 ను మించి ఉన్నదని పేర్కొంది. దీని ఆధారంగా దేశంలో ఉన్న 63 శాతం మంది ప్రజలు వాయు నాణ్యత ప్రమాణాలను దాటి ఉన్న ప్రదేశాల్లో జీవిస్తున్నారని తెలిపింది.

అంతర్జాతీయంగా పెరిగిన కాలుష్య లెక్కల్లో 44 శాతం భారతదేశం నుండి వచ్చినట్లుగా తేల్చింది. పార్టిక్యులేట్ కాలుష్య స్థాయి అప్పుడు 53 μg / m3 నుండి, నేడు 56 μg / m3 కు పెరిగిందిని, ఇది డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల కంటే సుమారు 11 రెట్లు ఎక్కువని పేర్కొంది.

అందుకే, మన చుట్టూ ఉన్న పర్యావరణం వీలైనంత కాలుష్యరహితంగా ఉండేలా మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా ముందడుగు వేసిన నాడే వాయు కాలుష్య తీవ్రత నుంచి మనం, మున ముందు తరాలు తప్పించుకునే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి