SNP
Gautam Gambhir, Rohit Sharma, Virat Kohli: టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ రాక తర్వాత.. జట్టులో చాలా మార్పులు జరిగేలా కనిపిస్తున్నాయి. అయితే.. రోహిత్ వారుసుడిగా ఎవరికి బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
Gautam Gambhir, Rohit Sharma, Virat Kohli: టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ రాక తర్వాత.. జట్టులో చాలా మార్పులు జరిగేలా కనిపిస్తున్నాయి. అయితే.. రోహిత్ వారుసుడిగా ఎవరికి బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ఈ టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత జట్టుకు కొత్త హెడ్ కోచ్ రానున్నాడు. రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియనుండటంతో బీసీసీఐ కొత్త కోచ్ వేటలో చివరి దశకు చేరుకుంది. టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ టీమిండియాకు హెడ్ కోచ్‌గా వస్తాడనే లీకులు, వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే బీసీసీఐతో ఆన్‌లైన్ ఇంటర్వ్యూ పూర్తి చేసుకున్న గంభీర్.. నేడు(బుధవారం) ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో అసలైన ఇంటర్వ్యూకి హాజరు కానున్నాడు. ఈ ఇంటర్వ్యూ తర్వాత.. గంభీర్ పేరును అధికారికంగా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది.
అయితే.. తాను హెడ్ కోచ్‌గా ఉండాలంటే జట్టులో కొన్ని మార్పులు చేయాలని గంభీర్ బీసీసీఐకి కండీషన్స్ పెట్టినట్లు, వాటికి బీసీసీఐ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. అందులో అతి ముఖ్యమైంది కెప్టెన్సీ మార్పు, అలాగే వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు. గంభీర్ చెప్పిన అన్నింటికి బీసీసీఐ ఒప్పకున్నట్లు తెలుస్తున్న నేపథ్యంలో.. మరి గంభీర్ హెడ్ కోచ్‌గా వచ్చిన తర్వాత టీమిండియాకు కొత్త కెప్టెన్ ఎవరు? అనే విషయంపై ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో చర్చ మొదలైంది. రోహిత్ శర్మ వారుసుడిగా.. టీ20 ఫార్మాట్‌లో చాలా మంది యువ క్రికెటర్లు కెప్టెన్సీ రేసులో ఉన్నారు.
రోహిత్ శర్మను టెస్టు, టీ20 కెప్టెన్సీల నుంచి తప్పించి.. కేవలం వన్డేలకు మాత్రమే కెప్టెన్‌గా కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. టెస్టులకు మళ్లీ విరాట్ కోహ్లీని కెప్టెన్ చేయాలనే ఆలోచనలో గౌతమ్ గంభీర్ ఉన్నట్లు సమాచారం. ఇక టీ20ల్లో ఎవర్ని కెప్టెన్ చేస్తారనే విషయంపైనే ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఈ ఇప్పుడు టీ20లకు కెప్టెన్ అయ్యేవారే.. భవిష్యత్తులో రోహిత్ తర్వాత వన్డేల్లో కూడా టీమిండియాను నడిపించాల్సి ఉంటుంది. అయితే.. టీ20 కెప్టెన్సీ రేసులో శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిలో కూడా పంత్ లేదా శ్రేయస్ అయ్యర్‌లో ఒకరికి కెప్టెన్సీ వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి గంభీర్ రాక తర్వాత టీమిండియాలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Sayyad Nag Pasha (@nag_pasha) June 19, 2024