iDreamPost

ఏపీ ప్రజలకు శుభవార్త – 5 కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభం ఎప్పుడంటే?

ఏపీ ప్రజలకు శుభవార్త – 5 కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభం ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మెడికల్ కాలేజీల ఏర్పాటు చేసేందుకు తీవ్ర కృషి చేస్తోంది సర్కారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక్కో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలనే గొప్ప ఆలోచన చేశారు. ఆ మార్గాన్ని మరింత సుగమం చేస్తూ, వచ్చే సంవత్సరం నుంచి 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తున్నారు.

నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, ఏలూరు జిల్లా ఆసుపత్రులను బోధనాసుపత్రులుగా మార్చేందుకు ప్రణాళికలు మొదలయ్యాయి. ఒక్కో దానికి రూ.5 కోట్లతో నిర్మాణ పునులు సైతం చేపడుతోంది ప్రభుత్వం. ఇలా ప్రతి కాలేజీలో 150 సీట్ల చొప్పున వచ్చే సంవత్సరానికి 750 మెడిసిన్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు కార్యక్రమం ద్వారా కొత్త కాలేజీలతో పాటు సమీప భవిష్యత్తులో 1,850 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఇవి కాకుండా మిగిలిన 11 ప్రాంతాల్లోనూ 2024-2025 నాటికి మరో 11 ప్రాంతాల్లో కళాశాలలు ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఇలా 16 నూతన వైద్య కళాశాలలకు గాను రూ.7,880 కోట్ల ఖర్చు చేస్తోంది.

మొత్తంగా నూతన వైద్య కళాశాలల ద్వారా అనేక మంది పేద, మధ్యతరగతి వారి కలగా ఉన్న మెడిసిన్ కోర్సును అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బోధనాసుపత్రులతో పాటు వైద్య కళాశాల పనులు కూడా వేగవంతం చేస్తోంది జగన్ సర్కారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి