iDreamPost

ప్రత్యేక రైలులో 40 మందికి అస్వస్థత.. గంట సేపు ఆగిన ట్రైన్

వరుసగా రైల్వే ప్రమాదాలు గుండెల్లో ఆందోళన కలగ చేస్తున్నాయి. ట్రైన్ ఎక్కాలంటే భయం వేస్తుంది ప్రయాణీకులకు. గమ్య స్థానం చేరేంత వరకు మనస్సు నిలకడగా ఉండటం లేదు. కానీ తప్పని పరిస్థితుల్లో రైల్వే జర్నీనే ఆశ్రయించక తప్పడం లేదు.. ఇప్పుడు..

వరుసగా రైల్వే ప్రమాదాలు గుండెల్లో ఆందోళన కలగ చేస్తున్నాయి. ట్రైన్ ఎక్కాలంటే భయం వేస్తుంది ప్రయాణీకులకు. గమ్య స్థానం చేరేంత వరకు మనస్సు నిలకడగా ఉండటం లేదు. కానీ తప్పని పరిస్థితుల్లో రైల్వే జర్నీనే ఆశ్రయించక తప్పడం లేదు.. ఇప్పుడు..

ప్రత్యేక రైలులో 40 మందికి అస్వస్థత.. గంట సేపు ఆగిన ట్రైన్

ఇటీవల వరుస రైలు ప్రమాద ఘటనలతో వార్తల్లో నిలుస్తోంది ఇండియన్ రైల్వే. ఒడిశాలోని బాలాసోర్, ఏపీలోని విజయనగరం వద్ద జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ ఘటనలు.. కొన్ని సంవత్సరాలు పాటు గుర్తిండిపోతుంటాయి. కలవరపాటుకు గురి చేస్తుంటాయి. ఈ క్రమంలో అడపాదడపా కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ప్రాణ నష్టం జరగలేదు. ఈ సారి ప్రమాదం కాదు కానీ.. ప్రయాణీకుల జీవితాలను రిస్కులో పడేసి అపవాదుకు బలం చేకూర్చింది. ఇంతకు ఏంటా అపవాదు అనేగా. రైల్వేలో ఫుడ్ బాగోదని, డబ్బులు వసూలు చేస్తారు కానీ.. నాసిరకం భోజనం పెడతారని, శుచి, శుభ్రత ఉండదని అనేక ఫిర్యాదులు వచ్చాయి. గతంలో వీరి వడ్డించిన ఆహారంలో జీవాలు కూడా బయటకు వచ్చిన సంగతి విదితమే.

తాజాగా ఓ రైలులో ప్రయాణిస్తున్న కొంత మంది ప్రయాణీకులు ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో రైలును గంటసేపు నిలిపేయాల్సి వచ్చింది. ఈ ఘటన చెన్నై నుండి పూణె వెళ్తున్న ప్రత్యేక రైలులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ లోని పాలిటానాలో జరిగే మతపరమైన కార్యక్రమం కోసం భారత్ గౌరవ్ రైలును ప్రైవేట్ వ్యక్తులు కోరగా.. ఆ ఏర్పాటు చేశారు రైల్వే అధికారులు. చెన్నై నుండి గుజరాత్ వెళ్తున్న ఈ ప్రత్యేక రైలు.. ఈ నెల 29న షోలాపూర్ చేరుకుంది. ఈ క్రమంలో ఫుడ్ పాయిజన్ కావడంతో భోగీలోని 40 ప్రయాణీకులు విరేచనాలు, వాంతులు, వికారం, తలనొప్పి వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. వెంటనే రైల్వే అధికారులకు ఫిర్యాదు వెళ్లింది.

రైలు మరో స్టేషన్‌కు చేరుకోగానే.. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో అస్వస్థతకు గురైన ప్రయాణీకులను చికిత్స అందించారు వైద్యులు. వీరందరికీ చికిత్స అందించడం కోసం ట్రైన్ సుమారు గంట సేపు అక్కడే నిలిపివేశారు రైల్వే అధికారులు. ఆ తర్వాత రైలు గమ్యస్థానానికి చేరుకుంది. అయితే  40 మంది ప్రయాణీకుల పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. రైల్వే మంత్రిత్వ శాఖ చెబుతున్న వివరాల బట్టి.. ఓ ప్రైవేట్ సంస్థ క్యాటరింగ్ సేవలను అందిస్తోంది. ఈ ఘటనతో సదరు సంస్థపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇలా పలుమార్లు.. రైల్వేలో ఫుడ్ తిని అనారోగ్యం బారిన పడిన దాఖలాలు ఉన్నాయి. ప్రయాణ సమయంలో చేదు అనుభవాలు మీకెప్పుడైనా ఎదురైతే.. కామెంట్ల రూపంలో తెలియజేయండి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి