iDreamPost

ఒకేసారి బరిలోకి దిగిన 4 సినిమాలు.. దెబ్బకొట్టిన తుఫాన్

డిసెంబర్ మంత్ తమదే అనుకుని బరిలోకి దిగాయి నాలుగు సినిమాలు. అందులో ఓ స్టార్ నటి మూవీ కూడా ఉంది. విడుదలైన మూవీస్ పాజిటివ్ టాక్స్ వచ్చాయి. ఇక కాసుల వర్షం కురుస్తుందని అనుకున్నారు ఆయా చిత్రాల దర్శక, నిర్మాలు, కానీ అంతలో దూసుకొచ్చింది..

డిసెంబర్ మంత్ తమదే అనుకుని బరిలోకి దిగాయి నాలుగు సినిమాలు. అందులో ఓ స్టార్ నటి మూవీ కూడా ఉంది. విడుదలైన మూవీస్ పాజిటివ్ టాక్స్ వచ్చాయి. ఇక కాసుల వర్షం కురుస్తుందని అనుకున్నారు ఆయా చిత్రాల దర్శక, నిర్మాలు, కానీ అంతలో దూసుకొచ్చింది..

ఒకేసారి బరిలోకి దిగిన 4 సినిమాలు.. దెబ్బకొట్టిన తుఫాన్

ఇప్పటికే మిచౌంగ్ తుఫాన్.. అటూ కోస్తా ఆంధ్రతో పాటు చెన్నైని వణికించిన విషయం అందరికి తెలిసిందే. జన జీవనం అస్తవ్యస్థమైంది. చెట్లు నెలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముంపు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది.  సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  ఈ భారీ తుఫాన్ ప్రభావంతో ఇళ్ల నుంచి కాలు బయటకు పెట్టడానికే జనాలు భయపడుతున్నారు. ఈ ప్రభావం సామాన్యులపైనే కాదూ, సెలబ్రిటీపై చూపుతుంది. కారణం ఈ విషాద వేళ.. వినోదం కోసం థియేటర్లకు వెళ్లేవారు ఉండకపోవడంతో కలెక్షన్లు రావడం లేదు.  తాజాగా బరిలోకి దిగిన 4 చిత్రాలకు తుఫాన్ ముప్పుతో గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా నయనతారకు ఈ విషయంలో పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి.

ఈ తుఫాన్ కారణంగా ఈ వారం విడుదలైన సినిమాలపై భారీ ఎఫెక్ట్ పడింది. ముఖ్యంగా చెన్నైలో ప్రజలకు ఈ తుఫాన్ అతలాకుతలం చేస్తుంది. ప్రధాన రహదారులన్నీ జాలాశయాలుగా మారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా పరిశ్రమపై భారీగా నష్టం వాటిల్లింది. భారీ తుఫాన్ కారణంగా థీయేటర్లు అన్ని బోసిపోయాయి. అసలే తమిళనాట లియో చిత్రం తరువాత.. జపాన్, జిగర్ తాండ డబుల్ ఎక్స్ సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో జపాన్ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచిన.. జిగర్ తాండ డబుల్ ఎక్స్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తరువాత పెద్ద చిత్రలేవీ విడుదల కాకపోవడంతో.. ఇదే మంచి ఛాన్స్ అనుకుంటూ నాలుగు కొత్త సినిమాలు బరిలోకి దిగాయి. వీటిలో లేడి సూపర్ స్టార్ నయనతార సినిమాలు మినహా మిగతా అన్ని చిన్నచిత్రాలే కావడం విశేషం.

నాలుగు కొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి డిసెంబర్ 1వ తేదీన థీయేటర్లోకి వచ్చాయి. వీటలో నయన్ నటించిన ‘అన్నపూర్ణి’, హరిష్ కళ్యాణ్ నటించిన ‘పార్కింగ్’, రియోరాజ్ నటించిన ‘జో,’ దర్శన్ కథనాయకుడిగా నటించిన ‘నాడు’ వంటి నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఇవన్నీ మంచి కంటెంట్ తో రూపొందిన చిత్రలుగా ప్రశంసలు పొందడంతో పాటు.. ప్రేక్షకుల ఆదరణ కూడా తోడైయింది. దీంతో చిత్ర దర్శక నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. అంతా సజావుగా జరుగుతున్న తరుణంలో.. తుఫాన్ వారి కొంపలను ముంచింది. సినిమాల పై కలెక్షన్ వర్షం కురుస్తుందనకుంటే.. భారీ తుఫానే ముంచుకొచ్చింది. ఇక థియోటర్లకి వెళ్లే సంగతి దేవుడెరుగు.. కనీసం ఏది గొయ్యో, ఏదో నుయ్యో తెలియనంతగా ఊరు వాడ అంతా జలమయమైంది. అసలు ఇళ్లలోకి నీరు రాకుండా కాపాడుకోవడమే కష్టంగా మారింది. ఇక ఈ తుఫాను గండం కొత్తగా విడుదలైన చిత్రల వసూళ్లకు గండి కొట్టింది. మరి ఈ విషయం పై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి