iDreamPost

ఆర్టీసీలో ఐటీఐ అర్హతతో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు..

ఆర్టీసీలో ఐటీఐ అర్హతతో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. నెల్లూరు జోన్ పరిధిలోని వివిధ విభాగాల్లో అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి 300 ఖాళీల భర్తీకి ఏపీఎస్ ఆర్టీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఐటీఐ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 8వ తేదీ లోపు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నెల్లూరు కాకుటూరులోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో అర్హులైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు. నెల్లూరు జోన్ పరిధిలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో మొత్తం 300 ఖాళీలు ఉన్నాయి. కేవలం ఈ జిల్లాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులుగా పరిగణించబడతారు.

మొత్తం ఖాళీలు: 300

జిల్లాల వారీగా ఖాళీలు:

  • తిరుపతి: 102
  • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు: 96
  • ప్రకాశం: 56
  • చిత్తూరు: 46

ట్రేడుల వారీగా ఖాళీలు:

  • డీజిల్ మెకానిక్: 238
  • మోటార్ మెకానిక్: 16
  • ఎలక్ట్రీషియన్: 22
  • వెల్డర్: 10
  • పెయింటర్: 5
  • ఫిట్టర్: 4
  • మెషినిస్ట్: 1
  • డ్రాఫ్ట్స్ మెన్ సివిల్: 4

తిరుపతి జిల్లాలో విభాగాల వారీగా ఖాళీలు: 102

  • డీజిల్ మెకానిక్: 80
  • మోటార్ మెకానిక్: 6
  • ఎలక్ట్రీషియన్: 8
  • వెల్డర్: 4
  • పెయింటర్: 2
  • మెషినిస్ట్: 0
  • ఫిట్టర్: 1
  • డ్రాఫ్ట్స్ మెన్ సివిల్: 1

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విభాగాల వారీగా ఖాళీలు: 96

  • డీజిల్ మెకానిక్: 78
  • మోటార్ మెకానిక్: 4
  • ఎలక్ట్రీషియన్: 7
  • వెల్డర్: 2
  • పెయింటర్: 1
  • మెషినిస్ట్: 1
  • ఫిట్టర్: 1
  • డ్రాఫ్ట్స్ మెన్ సివిల్: 2

ప్రకాశం జిల్లాలో విభాగాల వారీగా ఖాళీలు: 56

  • డీజిల్ మెకానిక్: 44
  • మోటార్ మెకానిక్: 3
  • ఎలక్ట్రీషియన్: 4
  • వెల్డర్: 2
  • పెయింటర్: 1
  • మెషినిస్ట్: 0
  • ఫిట్టర్: 1
  • డ్రాఫ్ట్స్ మెన్ సివిల్: 1

చిత్తూరు జిల్లాలో విభాగాల వారీగా ఖాళీలు: 46

  • డీజిల్ మెకానిక్: 36
  • మోటార్ మెకానిక్: 3
  • ఎలక్ట్రీషియన్: 3
  • వెల్డర్: 2
  • పెయింటర్: 1
  • మెషినిస్ట్: 0
  • ఫిట్టర్: 1
  • డ్రాఫ్ట్స్ మెన్ సివిల్: 0

నమోదు చేసుకునే విధానం:

  • ముందుగా https://www.apprenticeshipindia.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్ళాలి.
  • కుడి వైపున పైన లాగిన్/రిజిస్టర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో క్యాండిడేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
  • లాగిన్ యాజ్ క్యాండిడేట్ అని, రిజిస్టర్ యాజ్ క్యాండిడేట్ అని రెండు ఆప్షన్స్ కనబడతాయి.
  • మీరు ఇదే మొదటిసారి అయితే కనుక రిజిస్టర్ యాజ్ క్యాండిడేట్ మీద క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ద్వారా రిజిస్టర్ అవ్వండి.
  • ఆ తర్వాత లాగిన్ అవ్వండి.
  • లాగిన్ అయ్యాక అప్రెంటిస్ షిప్ చేయదలచుకున్నవారు జిల్లాను ఎంచుకుని పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఎస్టాబ్లిష్మెంట్ పేరు నమోదు చేసి ఎంటర్ చేస్తే దానికి సంబంధించిన వివరాలు వస్తాయి.
  • ఉదాహరణకు చిత్తూరు జిల్లాకు చెందిన అభ్యర్థులు ఏపీఎస్ఆర్టీసీ చిత్తూరు డిస్ట్రిక్ట్ ని ఎంటర్ చేయాలి.
  • అప్రెంటిస్ షిప్ ఆపర్చునిటీస్ లో సెర్చ్ బై ఎస్టాబ్లిష్ మెంట్ నేమ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది.
  • దాని మీద క్లిక్ చేసి ఎస్టాబ్లిష్మెంట్ పేరు ఎంటర్ చేస్తే ఖాళీలకు సంబంధించిన వివరాలు వస్తాయి.
  • అప్లై మీద క్లిక్ చేసి వివరాలు నమోదు చేసి దరఖాస్తు సబ్మిట్ చేయండి.

ఎస్టాబ్లిష్మెంట్ పేర్లు:

  • APSRTC CHITTOOR DISTRICT
  • APSRTC TIRUPATHI DISTRICT
  • APSRTC SPSR NELLORE DISTRICT
  • APSRTC PRAKASHM DISTRICT

దరఖాస్తు రుసుము: రూ. 100/-

అర్హత:

  • ఐటీఐలో సంబంధిత విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి.

సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగు ప్రదేశం:

  • నెల్లూరు ఏపీఎస్ ఆర్టీసీ కాకుటూరులోని జోనల్ సిబ్బంది శిక్షణా కళాశాలలో.
    ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక సెట్ జిరాక్స్ కాపీలతో హాజరు కావలెను.
    వెరిఫికేషన్ జరుగు తేదీ దినపత్రికల ద్వారా తెలియజేస్తారు.

ఎంపిక విధానం: మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ వంటి అంశాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ లోనే చేసుకోవాలి.

దరఖాస్తు పూర్తైన తర్వాత పంపవలసిన సర్టిఫికెట్ కాపీలు:

  • ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి ప్రొఫైల్
  • అప్రెంటిస్ షిప్ వెబ్ సైట్ లో నమోదు చేసుకున్న అప్రెంటిస్ షిప్ రిజిస్ట్రేషన్ నంబర్
  • టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్
  • ఐటీఐ మార్క్స్ (కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో)
  • ఎన్సీవీటీ సర్టిఫికెట్
  • కుల ధ్రువీకరణ పత్రం (ఎస్సీ/ఎస్టీ/బీసీ)
  • వికలాంగులైతే కనుక ధ్రువీకరణ పత్రం
  • మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలు అయితే కనుక ధ్రువీకరణ పత్రం
  • ఎన్సీసీ మరియు స్పోర్ట్స్ వారు ఐతే సంబంధిత ధ్రువీకరణ పత్రం
  • ఆధార్ కార్డు
  • రెజ్యూమ్

సర్టిఫికెట్ కాపీలు, రెజ్యూమ్ పంపవలసిన చిరునామా:

  • Principal,
  • Zonal Staff Training College,
  • kakutur, Venkatachalam Mandal
  • SPSR Nellore District. PIN: 524320

దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్ 8 2023

ఇతర వివరాలు:

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి