iDreamPost

IND vs SA: రెండో టీ20లో టీమిండియా ఓటమికి 3 ప్రధాన కారణాలు!

  • Published Dec 13, 2023 | 8:00 AMUpdated Dec 13, 2023 | 8:00 AM

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌-సౌతాఫ్రికా మధ్య మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలిచింది. సూర్య, రింకూ సింగ్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌లతో అదరగొట్టినా.. టీమిండియా ఓడిపోయింది. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి గల 3 కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌-సౌతాఫ్రికా మధ్య మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలిచింది. సూర్య, రింకూ సింగ్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌లతో అదరగొట్టినా.. టీమిండియా ఓడిపోయింది. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి గల 3 కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Dec 13, 2023 | 8:00 AMUpdated Dec 13, 2023 | 8:00 AM
IND vs SA: రెండో టీ20లో టీమిండియా ఓటమికి 3 ప్రధాన కారణాలు!

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమి పాలైంది. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగించినా.. సౌతాఫ్రికా ఆల్‌రౌండ్‌ ప్రరద్శనతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లు ఆడలేకపోయింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 19.3 ఓవర్ల వద్ద ఆపేశారు. అప్పటికీ టీమిండియా 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. రింకూ సింగ్‌ 68, కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ 56 పరుగులతో రాణించారు. వర్షం తర్వాత మ్యాచ్‌ మళ్లీ మొదలవ్వడంతో సౌతాఫ్రికాకు 15 ఓవర్లో 152 పరుగుల టార్గెట్‌ను అంపైర్లు నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని ప్రొటీస్‌ జట్టు 13.5 ఓవర్లలోనే ఛేదించి 5 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియాకి ప్రధానంగా మూడు కారణాలు చెప్పవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1. ఓపెనర్ల వైఫల్యం
ఆస్ట్రేలియాతో సిరీస్‌లో టీమిండియా ఓపెనింగ్‌ జోడి యశస్వి జైస్వాల్‌-రుతురాజ్‌ గైక్వాడ్‌ అద్భుతంగా రాణించారు. తొలి మ్యాచ్‌ మినహా మిగతా అన్ని 4 మ్యాచ్‌ల్లో మంచి ఆరంభాన్ని అందించారు. అయితే.. సౌతాఫ్రికాతో సిరీస్‌కు స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ తిరిగి టీమ్‌లోకి రావడంతో.. అతన్ని జట్టులోకి తీసుకోవాల్సి వచ్చింది. రుతురాజ్‌ స్థానంలో బరిలోకి దిగిన గిల్‌ దారుణంగా విఫలం అయ్యాడు. అతనితో పాటు మరో ఓపెనర్‌ జైస్వాల్‌ సైతం డకౌట్‌ కావడంతో టీమిండియాపై ఆరంభంలోనే తీవ్ర ఒత్తిడిని పెంచింది. సున్నా పరుగులకే ఓపెనర్లు ఇద్దరు అవుట్‌ కావడంతో.. వన్‌ డౌన్‌లో వచ్చిన తిలక్‌ వర్మ, కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఇన్నింగ్స్‌ను నిలబెడుతూ ముందుకు సాగారు. ఆ తర్వాత రింకూ సింగ్‌ అద్భుతంగా ఆడినా.. టీమిండియా మంచి ఆరంభం లభించకపోవడంతో జట్టు స్కోర్‌పై తీవ్ర ప్రభావం చూపింది.

3 reasons for Team India's defeat!

2. చెత్త బౌలింగ్‌
డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో సౌతాఫ్రికాకు 15 ఓవర్లలో 152 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించారు. ఇది అంత సులువైన లక్ష్యం కాదు. ఓవర్‌కు 10కి పైగా పరుగులు చేయాలి. టీమిండియా బౌలర్లు కాస్త కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేసినా.. ఫలితం వేరేలా ఉండేది. కానీ, బౌలర్లంతా దారుణంగా విఫలం అయ్యారనే చెప్పాలి. సిరాజ్‌, రవీంద్ర జడేజా లాంటి సీనియర్లు సైతం 9కి పైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. ఇక అర్షదీప్‌ సింగ్‌ అయితే ఏకంగా రెండు ఓవర్లలోనే 31 పరుగులు ఇచ్చుకున్నాడు. మరో పేసర్‌ ముఖేష్‌ కుమార్‌ సైతం 3 ఓవర్లకు 34 పరుగులిచ్చాడు. కుల్దీప్‌ యాదవ్‌ సైతం 3 ఓవర్ల వేసి 26 పరగులిచ్చాడు. ఇలా బౌలర్లంతా భారీగా పరుగులు ఇవ్వడంతో సౌతాఫ్రికాకు లక్ష్యం సులువైంది.

3. టీమ్‌లో మార్పులు, టాస్‌ ఓడిపోవడం
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణాల్లో టాస్‌ను కూడా కీలకంగా చెప్పుకోవాలి. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి ఉంటే.. ముందుగా ఫీల్డింగ్‌ చేసేంది. పిచ్‌, వాతావరణ పరిస్థితులు ఛేజింగ్‌కు అనుకూలంగా ఉన్నాయి. దీంతో టాస్‌ ఓడిపోవడం కూడా టీమిండియాను దెబ్బ తీసింది. అలాగే ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చేసిన మార్పులు సైతం జట్టు ఓటమి పాలవ్వడానికి కారణమయ్యాయి. సక్సెస్‌ఫుల్‌ జోడీగా ఉన్న జైస్వాల్‌-రుతురాజ్‌ స్థానంలో జైస్వాల్‌-గిల్‌ను బరిలోకి దింపడం బెడిసి కొట్టింది. పైగా రుతురాజ్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. కానీ, వరల్డ్ కప్‌ తర్వాత నేరుగా ఈ మ్యాచ్‌ ఆడుతున్నాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ జట్టులో లేకపోవడం.. టీమిండియా ఓపెనింగ్‌పై ప్రభావం చూపించింది. మరి టీమిండియాకి కారణమైన ఈ అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి