iDreamPost

మహిళ కడుపులో రెండున్నర కిలోల వెంట్రుకలు.. ఈ వ్యాధి ఉంటే డేంజర్!

2.5 KG Hair In Lady Stomach: ఇది ఒక అరుదైన వ్యాధి. ఈ వ్యాధి ఉంటే కడుపులో కిలోల లెక్కన జుట్టు మొలుస్తుంది. తాజాగా ఒక మహిళ విషయంలో అదే జరిగింది. ఇలా ఎందుకు జరుగుతుందంటే?

2.5 KG Hair In Lady Stomach: ఇది ఒక అరుదైన వ్యాధి. ఈ వ్యాధి ఉంటే కడుపులో కిలోల లెక్కన జుట్టు మొలుస్తుంది. తాజాగా ఒక మహిళ విషయంలో అదే జరిగింది. ఇలా ఎందుకు జరుగుతుందంటే?

మహిళ కడుపులో రెండున్నర కిలోల వెంట్రుకలు.. ఈ వ్యాధి ఉంటే డేంజర్!

గర్భం దాల్చినప్పుడు స్త్రీలకు అనారోగ్య సమస్యలు రావడం అనేది సహజం. కడుపు నొప్పి రావడం, వాంతులు అవ్వడం, తలనొప్పి, అలసట వంటివి వస్తుంటాయి. డెలివరీ అయ్యాక కూడా కొన్నాళ్ల పాటు ఈ సమస్యలు అనేవి ఉంటాయి. అయితే ఓ మహిళకు మాత్రం డెలివరీ అయ్యాక కడుపులో వెంట్రుకలు మొలిచాయి. అది కూడా ఒకటీ, రెండు కాదు.. ఏకంగా రెండున్నర కిలోల వెంట్రుకలు. అసలు కడుపులో అన్ని కిలోల వెంట్రుకలు ఎలా మొలిచాయి? కారణం ఏంటి? ఆమెకున్న వ్యాధి పేరేంటి? ఈ వ్యాధి వస్తే ప్రాణాలకే ప్రమాదమా? డాక్టర్లు ఏం చెప్తున్నారు?

ఒక్కో మనిషికీ ఒక్కో అలవాటు ఉండడం అనేది మామూలే. గర్భంతో ఉన్న మహిళలకి కూడా ఏదో ఒక అలవాటు ఉంటుంది. గోర్లు కొరుక్కోవడం, మట్టి తినడం, గోడ మీద సున్నం తినడం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు కలుగుతాయి. తాజాగా ఓ గర్భిణీ చేసిన పనికి ఆమె కడుపులో రెండున్నర కిలోల వెంట్రుకలు మొలిచాయి. ఉత్తరప్రదేశ్ లోని చిత్రకూటలో 25 ఏళ్ల వివాహిత గర్భం దాల్చినప్పుడు వెంట్రుకలను తినడం అలవాటు చేసుకుంది. ఆమె వెంట్రుకలు మాత్రమే కాకుండా ఇతరుల వెంట్రుకలు కూడా తినడం అలవాటు చేసుకుంది.

ఆ అలవాటు ఎక్కువ అవ్వడంతో తినడమే పనిగా పెట్టుకుంది. ఎవరికీ తెలియకుండా వెంట్రుకలను తినేది. అయితే ఎప్పుడైతే డెలివరీ అయ్యిందో అప్పటి నుంచి వెంట్రుకలను తినడం మానేసింది. అయితే ఉన్నట్టుండి ఆమెకు కడుపునొప్పి రావడం, ఏమీ తినలేకపోవడం, వాంతులు అవ్వడం వంటి సమస్యలు తలెత్తాయి. ఆమె బాధ చూడలేక కుతుబ్కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు రాసిచ్చిన మందులు వాడారు. కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో మరో ప్రయత్నంగా చిత్రకూటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు స్కానింగ్ చేస్తేనే గానీ ఏమైందో తెలియదని అనడంతో స్కానింగ్ చేయించారు.

స్కానింగ్ చేయగా ఆమె కడుపులో రెండున్నర కిలోల జుట్టు ఉన్నట్లు గుర్తించారు. వైద్యులు ఆమెకు 45 నిమిషాల పాటు ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న వెంట్రుకలను బయటకు తీశారు. మహిళ ట్రైకోఫాగియా అనే అరుదైన మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఈ వ్యాధి ఉన్నవాళ్లు వెంట్రుకలు తినడం, అదే పనిగా తినడం, వాసన పీల్చడం వంటివి చేస్తుంటారని డాక్టర్లు తెలిపారు. కరెక్ట్ సమయానికి ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న వెంట్రుకలు తీయడం వల్ల ఆమె బతికిందని.. లేదంటే పరిస్థితి విషమించి చనిపోయేదని వైద్యులు వెల్లడించారు.      

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి