iDreamPost

Gas Cylinder Price: క్రిస్మస్ వేళ గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

  • Published Dec 22, 2023 | 12:36 PMUpdated Dec 22, 2023 | 12:36 PM

ఇయర్ ఎండ్, క్రిస్మస్ పండుగ వేళ.. గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఆ వివరాలు..

ఇయర్ ఎండ్, క్రిస్మస్ పండుగ వేళ.. గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఆ వివరాలు..

  • Published Dec 22, 2023 | 12:36 PMUpdated Dec 22, 2023 | 12:36 PM
Gas Cylinder Price: క్రిస్మస్ వేళ గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

పెరుగుతున్న ధరలతో సామాన్యుల జేబుకు చిల్లు పడుతున్న సమయంలో.. గ్యాస్ సిలిండర్ ధర తగ్గిస్తూ.. కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు ఊరట కలిగించింది. ఇక ఎన్నికల్లో కూడా గ్యాస్ ధర ప్రధాన ప్రచార అస్త్రంగా మారుతుంది. ఇప్పటికే ఎన్నికలు జరిగిన తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు.. ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చాయి. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో ప్రధానమైన 500 రూపాయలకే గ్యాస్ సిలింవర్ పథకాన్ని అమలు చేసే దిశగా చర్యలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో తాజాగా క్రిస్మస్ పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకి శుభవార్త చెప్పింది. సిలిండర్ ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మరి ఈ తగ్గింపు ఏ సిలిండర్లకు వర్తిస్తుంది అంటే..

గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు శుభవార్త చెప్పాయి. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. నూతన సంవత్సరం, క్రిస్మస్ వేడుకల సందర్భంగా నాలుగు ప్రధాన మెట్రో నగరాల్లో.. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు శుక్రవారం ప్రకటించాయి.

gas cylender cost reduced

ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో ఒక్కో సిలిండర్ పై రూ.39.50 తగ్గిస్తున్నట్లు వెల్లడించాయి. తగ్గించిన కొత్త రేట్లు ఈ రోజు నుంచే అనగా డిసెంబర్ 22 నుంచే అమల్లోకి రానున్నట్లు తెలిపాయి. ధరలు తగ్గిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 1757.50కి దిగివచ్చింది. ఇక నాలుగు ప్రధాన నగరాల్లో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి.

19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరలు..

  • ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1757.50కి దిగివచ్చింది.
  • కోల్‌కతాలో  రూ. 1868. 50కి దిగివచ్చింది.
  • ముంబైలో ఈ రేటు రూ.1710కి చేరింది.
  • చెన్నైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1929 వద్ద ఉంది.
  • హైదరాబాద్‌లో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గకుండా 2002 వద్దే స్థిరంగా ఉంది.

అయితే ఆయిల్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ ధరలు తగ్గించినప్పటికీ డొమెస్టిక్ (గృహ వినియోగ సిలిండర్) ఎల్‌పీజీ సిలిండర్ ధరలను మాత్రం మార్చలేదు. ప్రస్తుతం గృహ వినియోగ సిలిండర్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. చమురు సంస్థలు నెల ప్రారంభం కాగానే ఫస్ట్ తారీఖునే.. కమర్షియల్, డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను సమీక్షిస్తాయి. ఇక చివరి సారిగా ఆగస్టు 30 న కేంద్ర ప్రభుత్వం రూ. 200 మేర తగ్గించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు ఢిల్లీలో రూ. 903 గా ఉన్నాయి. కోల్‌కతాలో రూ. 929, ముంబైలో రూ. 902.50 గా ఉంది. హైదరాబాద్ లో 14. 2 కేజీల గృహ వినియోగ సిలిండర్ రేటు రూ. 955 గా ఉంది. మరోవైపు.. ఉజ్వల లబ్ధిదారులకు ప్రభుత్వం సిలిండర్ పై రూ. 300 సబ్సిడీ అందిస్తోన్న సంగతి తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి