iDreamPost

Ambassador: 1964 లో అంబాసిడర్ కారు ధర తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..

  • Published May 06, 2024 | 2:07 PMUpdated May 06, 2024 | 2:07 PM

సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ నడుస్తుంది. అదేంటంటే ఇప్పుడున్న అప్పట్లో ఉండే హోటల్ బిల్స్ లేదా అప్పట్లో ఉండే వస్తువులకు సంబందించిన పాత బిల్స్ అన్ని కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి అప్పట్లో అంబాసిడర్ కార్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.

సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ నడుస్తుంది. అదేంటంటే ఇప్పుడున్న అప్పట్లో ఉండే హోటల్ బిల్స్ లేదా అప్పట్లో ఉండే వస్తువులకు సంబందించిన పాత బిల్స్ అన్ని కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి అప్పట్లో అంబాసిడర్ కార్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.

  • Published May 06, 2024 | 2:07 PMUpdated May 06, 2024 | 2:07 PM
Ambassador: 1964 లో అంబాసిడర్ కారు ధర తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..

కాలం మారుతూ వస్తుంది.. మారుతున్న కాలంతో పాటు నిత్యావసర ధరలు, వస్తువుల ధరలు పెరగడం సహజం. అయితే, ఒక్కప్పుడు ఉండే ధరలకు.. ఇప్పుడు ఉన్న ధరలకు వ్యత్యాసం ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే.. అప్పట్లో వస్తువులకు సంబంధిచిన పాత బిల్స్, హోటల్స్ లో టిఫిన్స్ కు సంబంధించిన బిల్స్ .. కొన్ని అరుదైన ఫోటోలు.. అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఓ హోటల్ లోని టిఫిన్స్ కు సంబంధించిన బిల్స్ గురించి వచ్చిన పోస్ట్ తెగ వైరల్ అయింది. ఇక ఇప్పుడు 1964 లో ఓ అంబాసిడర్ కార్ బిల్ వైరల్ అవుతుంది. అప్పట్లో అంబాసిడర్ కార్ ధర ఎంతో తెలిస్తే నోటి మీద వేలు వేసుకోవాల్సిందే. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇప్పుడంటే మార్కెట్ లో రకరకాల కార్లు వచ్చేశాయి కానీ.. ఒకప్పుడు అంబాసిడర్ కార్ అంటే ఎంతో ప్రత్యేకం. ఈ కారుకు బ్రిటిష్ మూలాలు ఉన్నా కూడా.. దీనిని ఇండియన్ కార్ గానే భావిస్తూ ఉంటారు. అప్పట్లో అంబాసిడర్ కారు రోడ్ పైకి వస్తుంది అంటే.. దానిని అందరూ ఎంతో ఆశ్చర్యంగా చూసేవారు. పైగా అంబాసిడర్ కార్ కు “కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్” గా ఓ మంచి పేరు కూడా ఉండేది. ఇండియన్ ఆర్మీ దగ్గర నుంచి గవర్నమెంట్ ఉద్యోగుల వరకు… సినీ సెలెబ్రిటీల దగ్గర నుంచి.. ఉన్నత స్థాయిలో ఉన్న వారంతా కూడా ఈ కార్ నే వినియోగించే వారు. అప్పట్లో ఈ కార్ ఉంటె వాళ్ళు రిచ్ అన్నట్లే లెక్క. ఇక ఇప్పుడు ఉన్న జెనెరేషన్ కు తగినట్లు రకరకాల ఫీచర్స్ తో కార్లు అందుబాటులోకి రావడంతో.. అంబాసిడర్ కారు వెనుక పడిపోయింది. అసలు ఇంతకీ ఇప్పుడు ఈ అంబాసిడర్ గురించి ఎందుకు వచ్చిందంటే.. అప్పట్లో ఉండే దీని ధరకు సంబంధించిన బిల్స్ బయట పడ్డాయి.

What is the price of Ambassador car in 1964!

ఇప్పుడు లక్షలు, కోట్లు పెట్టనిదే కార్ రావట్లేదు. అలాంటిది అప్పట్లో కేవలం వేళల్లోనే అంబాసిడర్ కార్ వచ్చిందటే నమ్మగలమా.. అవును .. 1964 లో అంబాసిడర్ కారు బిల్లును మద్రాస్ ట్రెండ్స్ అనే ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేశారు. ఆ బిల్ ను గమనించినట్లయితే.. అక్టోబర్ 20, 1964 లో ఆ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ అపుడు ఆ కారు ధర ఎంతంటే.. కేవలం రూ.16,495 మాత్రమే.. అసలు కారు ధర రూ.13,787 కాగా, సేల్స్ ట్యాక్స్ రూ.1493, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ రూ. 897 , రు నంబర్ ప్లేట్‌కు రూ.7 ఇలా మొత్తంగా దీని ధర రూ.16,495 అన్నమాట. దీనితో ఈ బిల్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ధర చూసిన ఇప్పటి జనరేషన్ వారు .. దీనిని చూసి నోటి మీద వేలు వేసుకుంటున్నారు. పైగా దీనికి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి