iDreamPost

దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఈ సారి 13 రోజులు..

దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఈ సారి 13 రోజులు..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విజయ దశమి సెలవుల్ని ప్రకటించింది. ఈసారి ఏకంగా 13 రోజులు దసరా సెలువులు ఇచ్చింది. 2023 అక్టోబర్‌ 13నుంచి 25 వరకు మొత్తం 13 రోజుల పాటు విద్యార్థులకు సెలవులు ఉండనున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు తాజాగా షెడ్యూల్‌ విడుదల చేశారు. ఇక, ఎస్‌ఏ-1 పరీక్షలు అక్టోబర్‌ 5వ తేదీనుంచి 11వ తేదీ వరకు జరగనున్నాయి. 8వ తరగతి మినహా మిగిలిన అన్ని తరగతుల విద్యార్థులకు ఉదయం పూటే పరీక్షలు పెట్టనున్నారు. గత సంవత్సరం వరకు త్రైమాసిక, అర్థ సంవత్సర, వార్షిక పరీక్షల నిర్వహణలో సరి, బేసి విధానాన్ని పాటించేవారు. ఉదయం 6,8,10 తరగతుల విద్యార్థులకు..

మధ్యాహ్నం 7,9 తరగతుల విద్యార్థులకు పరీక్షలు పెట్టేవారు. కానీ, ఈ సంవత్సరం ఆ పరిస్థితి లేదు. ఎస్‌ఏ-1 పరీక్షల టైమ్‌ టేబుల్‌ ప్రకారం 8వ తరగతికి మాత్రమే మధ్యాహ్నం పరీక్షలు ఉండనున్నాయి. మిగిలిన అన్ని తరగతుల వారికి ఉదయం పూట పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక, ఈ నేపథ్యంలోనే ఎస్‌ఏ-1 పరీక్షలు ముగిసిన తర్వాత దసరా సెలవులు ప్రారంభం అవుతాయి. అక్టోబర్‌ 26న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 13 రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి