iDreamPost
android-app
ios-app

HYD జూలో 125 ఏళ్ల వయసున్న గాలాపాగోస్ తాబేలు మృతి

హైదరాబాద్ నగరంలో ప్రకృతి ప్రేమికులు, యానిమల్ లవర్స్, ఫ్యామిలీస్ ఎక్కువగా ఇష్టపడే ప్రాంతం నెహ్రు జులాజికల్ పార్క్. సుమారు 300 ఎకరాల్లో విస్తరించిన ఈ జూలో ఎన్నో జంతువులు, పక్షులు అలరిస్తూనే ఉన్నాయి.

హైదరాబాద్ నగరంలో ప్రకృతి ప్రేమికులు, యానిమల్ లవర్స్, ఫ్యామిలీస్ ఎక్కువగా ఇష్టపడే ప్రాంతం నెహ్రు జులాజికల్ పార్క్. సుమారు 300 ఎకరాల్లో విస్తరించిన ఈ జూలో ఎన్నో జంతువులు, పక్షులు అలరిస్తూనే ఉన్నాయి.

HYD జూలో 125 ఏళ్ల వయసున్న గాలాపాగోస్ తాబేలు మృతి

హైదరాబాద్ నగరంలో సందర్శించ దగ్గ ప్రాంతాల్లో నెహ్రూ జులాజికల్ పార్క్ ఒకటి. వీకెండ్స్, సెలవు రోజుల్లో నగర వాసులంతా జూను సందర్శిస్తుంటారు. భాగ్యనగర వాసులే కాకుండా.. ఇరుగు పొరుగు రాష్ట్రాల నుండి ప్రజలు కూడా ఈ జంతు ప్రదర్శన శాలను తిలకించి, ఎంజాయ్ చేసేందుకు వస్తుంటారు. 300 ఎకరాల స్థలంలో ఉన్న ఈ జంతు ప్రదర్శనశాలను చుట్టి రావాలంటే సుమారు 6 నుండి 7 గంటలు పడుతుంది. ఇందులో ఉండే సవారి ప్రత్యేక అనుభూతిని మిగులుస్తుంది. నెహ్రూ జూలాజికల్ పార్కులో 1,500 కంటే ఎక్కువ రకాల పక్షులు, జంతువులు, సరీసృపాలు ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులు, కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేయాలనుకున్న వారంతా ఇక్కడ వాలిపోతుంటారు.

తాజాగా ఈ జూలో ఓ అరుదైన తాబేలు మృతి చెందింది. నెహ్రూ జూలో పెద్ద పెద్ద తాబేళ్లు మనల్ని ఎంట్రీలోనే పలకరిస్తుంటాయి. వాటిల్లో ఓ తాబేలు మృతి చెందింది. 125 సంవత్సరాల వయస్సున్న గాలాపాగోస్ జెయింట్ తాబేలు.. వృద్ధాప్య సమస్యలతో మృతి చెందినట్లు జూ అధికారులు వెల్లడించారు. గత 10 రోజుల నుండి ఆహారం తీసుకోవడం లేదని, దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తాయని జూ డిప్యూటీ డైరెక్టర్ (వెట్) డాక్టర్ ఎంఏ హకీమ్ నేతృత్వంలోని జూ వెటర్నరీ బృందం ఆ భారీ తాబేలుకు చికిత్స అందించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయిందని వెల్లడించారు. ఈ జూ ప్రారంభం అయిన నాటి నుండి ఈ తాబేలు ఉందని చెబుతున్నారు.

125 years gaint tortule died in hyderabad

అవయవాల వైఫల్యం వల్లే తాబేలు చనిపోయినట్లు ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. మరింత పరిశోధనల కోసం నమూనాలను వెటర్నరీ బయోలాజికల్ అండ్ రీసెర్చ్ ఇన్‌‌స్టిట్యూట్, రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాలకు పంపారు. కాగా, ఈ భారీ తాబేలును హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ (బాగ్-ఇ-ఆమ్) నుంచి 1963 సంవత్సరంలో నెహ్రు జులాజికల్ పార్కుకు తరలించారు. ఇది మగ తాబేలు. అప్పటి నుండి జూలోనే ఉంది. పర్యాటకులను అలరిస్తూనే ఉంది. దీనితో పాటు మరో తాబేలుతో కలిసి జీవిస్తోంది. దాని వయస్సు 95 సంవత్సరాలు. గాలాపాగోస్ జెయింట్ తాబేలు మృతి పట్ల క్యూరేటర్, జూ సిబ్బంది తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.