iDreamPost

మార్కెట్లోకి రాయల్ ఎన్ ఫీల్డ్ కొత్త బైక్… రేపే హంటర్ 350 లాంచ్

మార్కెట్లోకి రాయల్ ఎన్ ఫీల్డ్ కొత్త బైక్… రేపే హంటర్ 350 లాంచ్

రాయల్ ఎన్ ఫీల్డ్ కున్న బ్రాండ్ ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఈ రాయల్ బైక్ రాజసానికి గుర్తు అని ఫ్యాన్స్ ఫీలవుతుంటారు. ఇందులో కొత్త వర్షన్ వస్తోందంటే చాలు కొనేయడానికి షోరూంల ముందు క్యూ కట్టేస్తుంటారు. మొత్తానికి ఫ్యాన్స్ పండగ చేసుకునే ఆ రోజు మళ్ళీ వస్తోంది. రాయల్ ఎన్ ఫీల్డ్ సరికొత్త వర్షన్ హంటర్ 350 ఆదివారం లాంచ్ అవుతోంది. జె-సిరీస్ ప్లాట్ ఫాంపై వస్తున్న మూడో బైక్ ఇది. రెట్రో, మెట్రో అనే రెండు వేరియంట్ల రూపంలో ఇది మార్కెట్లోకి వస్తోంది. ఇందులో మెట్రోని రేంజ్-టాపింగ్ వర్షన్ గా చెబుతున్నారు.

హంటర్ 350 ధర ఎంత?

రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350 ధర లక్షా 30 వేల నుంచి లక్షా 40 వేల మధ్య ఉండొచ్చు. ఇదే నిజమైతే దేశవ్యాప్తంగా సేల్ లో ఉన్న రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్ లో ఇదే అతి చవకైన బండి అవుతుంది. అయితే అసలు ధర మాత్రం ఆదివారమే తెలుస్తుంది.

ఇంజన్ & గేర్ బాక్స్:

కొత్త రాయల్ ఎన్ ఫీల్డ్ వర్షన్ 350సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్-ఆయిల్ కూల్డ్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ మోటర్ తో వస్తోంది. దీని ఇంజన్ కి 5- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కనెక్టై ఉంటుంది. ఇది లీటరుకి 36.2 కిలోమీటర్ల మైలైజ్ ఇస్తుంది.

సైకిల్ పార్ట్స్ & హార్డ్ వేర్:

బైక్ ముందు భాగంలో 41mm టెలిస్కోపిక్ ఫోర్క్స్ అమర్చి ఉంటాయి. వెనక భాగంలో 6-స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్సార్బర్స్ ఉంటాయి. టైర్ వెడల్పు 17 అంగుళాలు. వేరియంట్ ని బట్టి స్పోక్ వీల్స్ కావాలా లేక అలాయ్స్ కావాలా అనేది ఎంచుకోవచ్చు. ఇక బ్రేకుల విషయనికొస్తే దీనికి ముందు వైపు 300mm డిస్క్, వెనక వైపు డ్యుయల్ చానెల్ ABS అమర్చిన 270 mm యూనిట్ ఉంది.

లైట్స్:

ఈ బైక్ లో టెయిల్ ల్యాంప్ ఎల్ఈడీ యూనిట్ అయితే హెడ్ ల్యాంప్ హాలోజన్ బల్బుతో వస్తుంది. హెడ్ ల్యాంప్ గుండ్రంగా ఉంటుంది. హాలోజన్ బల్బుపై ఫ్యాన్స్ లో కొంత నిరుత్సాహముంది. కానీ ఈ కంపెనీ మొదటి నుంచి ఇదే బల్బుకు స్టికాన్ అయి ఉంది.

ఫ్యుయెల్ ట్యాంక్  & సీటు:

ఫ్యుయెల్ ట్యాంక్ టియర్ డ్రాప్ ఆకారంలో వస్తుంది. దీని వల్ల రైడర్ కి మోకాళ్ళపై ఒత్తిడి తగ్గుతుంది. హ్యాండిల్ బార్ స్ట్రీట్ ఓరియెంటెడ్ గా అంటే ఈజీగా డ్రైవ్ చేసేవిధంగా డిజైన్ చేయబడింది. కంఫర్ట్ ని దృష్టిలో పెట్టుకుని సీటు డిజైన్ లో మార్పులు చేశారు.

ఫీచర్స్ & రైవల్స్:

హంటర్ 350 ట్విన్-పాడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఫీచర్ తో వస్తుంది. వీటిలో ఒకటైన ట్రిప్పర్ నావిగేషన్ పాడ్ ని యాక్సెసరీగా కొనుక్కోవల్సి ఉంటుంది. ఇవి కాక మరెన్నో యాక్సెసరీస్ ని కంపెనీ ఆఫర్ చేస్తోంది. హంటర్ 350 టీవీఎస్ రోనిన్, హోండా హెచ్ నెస్ సీబీ350, జావా ఫార్టీ టూని పోలి ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి