iDreamPost

రష్మిక ఘటన: స్పందించిన వీడియోలోని అమ్మాయి!

డీప్‌ ఫేక్‌ వీడియోపై రాజకీయ, సినీ వర్గాలకు చెందిన వారు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. రష్మికకు అండగా నిలుస్తున్నారు...

డీప్‌ ఫేక్‌ వీడియోపై రాజకీయ, సినీ వర్గాలకు చెందిన వారు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. రష్మికకు అండగా నిలుస్తున్నారు...

రష్మిక ఘటన: స్పందించిన వీడియోలోని అమ్మాయి!

ప్రముఖ హీరోయిన్‌ రష్మిక మందన్న డీప్‌ ఫేక్‌ వీడియో ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెనుదుమారం రేపుతోంది. రాజకీయ, సినిమా వర్గాలకు చెందిన వారు ఈ ఫేక్‌ వీడియోపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పు చేసింది ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని తేల్చి చెప్పింది. ఫేక్‌ వీడియో తయారు చేసిన వారికి 3 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు.. సోషల్‌ మీడియాలకు సైతం కేంద్రం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.

తప్పుడు సమాచారాన్ని పోస్టు చేస్తే .. 36 గంటల్లోగా తొలగించాలని వెల్లడించింది. ఇక, రష్మిక ఫేక్‌ వీడియోపై.. వీడియోలో ఉన్న అసలు యువతి జారా పాటెల్‌ స్పందించింది. ఈ మేరకు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. ‘‘ ఎవరో నా శరీరాన్ని ఉపయోగించి బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోయిన్‌కు సంబంధించి డీప్‌ ఫేక్‌ వీడియో తయారు చేశారు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలతో నాకు చాలా బాధగా ఉంది.

అప్‌సెట్‌ అయ్యాను. మహిళలు, చిన్నారుల భవిష్యత్తు తల్చుకుంటే భయంగా ఉంది. సోషల్‌ మీడియా వాడాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఇంటర్‌నెట్‌లో చూసే విషయాలపై ఒకటికి రెండు సార్లు క్రాస్‌ చెక్‌ చేసుకోండి. ఇంటర్‌నెట్‌లో కనిపించేదంతా ఒరిజినల్‌ కాదు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, రష్మిక మందన్న డీప్‌ ఫేక్‌ వీడియోపై మొదటి సారి బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ స్పందించారు. ఫేక్‌ వీడియో తయారు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఆ తర్వాత తెలుగునాట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత రష్మిక వీడియోపై స్పందించారు. కేంద్రం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమనుంచి అక్కినేని నాగచైతన్య స్పందించారు. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్న తీరును చూస్తుంటే నిరుత్సాహంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో ఇది దేనికి దారి తీస్తుందో తల్చుకుంటే భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిపై చర్యలు కచ్చితంగా తీసుకోవాలని కోరారు.

ఘటనల కారణంగా బాధింపబడ్డవారికి.. బాధింపబడకుండా ఉండడానికి కఠిన చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వాతలకు విజ్ఞప్తి చేశారు. రష్మికకు ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై సాయి థరమ్ తేజ్, మృణాల్ ఠాకూర్ తదితరులు కూడా స్పందించారు. వీడియో తయారు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రష్మికకు తామున్నామంటూ భరోసా ఇచ్చారు. మరి, రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియో ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి