iDreamPost

పవన్ ఎందుకు యాత్ర చేస్తున్నాడో.. ఆయనకే తెలియదు: వైవీ

పవన్ ఎందుకు యాత్ర చేస్తున్నాడో.. ఆయనకే తెలియదు: వైవీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీంతో అదే స్థాయిలో పవన్ పై కూడా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాలను టైమ్ పాస్  కోసం చేస్తున్నాడని వైసీపీ నేతలు అంటున్నారు. తాజాగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సైతం పవన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ చేస్తున్న వారాహి యాత్రను ప్రజలు కూడా పట్టించుకోవడం లేదన్నారు.

టీటీడీ ఛైర్మన్, విశాఖపట్నం రీజినల్ కోర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడో ఆయనకే తెలియదంటూ ఎద్దేవా చేశారు. పవన్  చేస్తున్న వారాహి యాత్రను ప్రజలు కూడా పట్టించుకోవడం లేదని, ప్రజలకు ఉపయోగపడే ప్రయత్నం చేస్తే వారు పట్టించుకునే వారని సుబ్బారెడ్డి అన్నారు. “ఏపీ అభివృద్ధి టీడీపీ నేతలకు కనిపించడం లేదా?. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో ఎంత అభివృద్ధి జరిగిందే అందరికి తెలుసు. భోగాపురం ఎయిపోర్టు, మూలపేట ఎయిర్ పోర్టు, రహేజా ఇన్ఆర్బిట్ మాల్ నిర్మాణ పనులు టీడీపీ నేతలకు కనిపించడం లేదా?”  అని వైవీ ప్రశ్నించారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు  ఏ పని చేసినా శిలాఫలకం వేసి వదిలేశారు. కానీ ప్రతి పని నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశిస్తారు. విశాఖ అభివృద్ధితో పాటు ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపై కూడా అధికారులతో చర్చించాము” అని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. మరి..  జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదీ చదవండి: జగన్ సర్కారు గుడ్ న్యూస్.. ఇక వారంతా పర్మినెంట్ ఉద్యోగులు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి