iDreamPost

జగన్ సర్కారు గుడ్ న్యూస్.. ఇక వారంతా పర్మినెంట్ ఉద్యోగులు!

  • Author singhj Published - 10:57 AM, Fri - 4 August 23
  • Author singhj Published - 10:57 AM, Fri - 4 August 23
జగన్ సర్కారు గుడ్ న్యూస్.. ఇక వారంతా పర్మినెంట్ ఉద్యోగులు!

గవర్నమెంట్ జాబ్ కొట్టాలనేది చాలా మంది విద్యార్థుల కోరిక. కానీ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అంత సులువు కాదనేది తెలిసిందే. అందులోనూ ఇప్పుడు ఉన్న తీవ్ర పోటీలో అది చాలా కష్టతరంగా మారింది. ఒక్కో జాబ్​కు కొన్ని లక్షల మంది పోటీపడుతున్న తరుణం ఇది. చిన్న ఉద్యోగానికి కూడా పీజీలు, పీహెచ్​డీలు చేసిన వాళ్లు అప్లయ్ చేసుకుంటున్నారు. ఏళ్ల తరబడి అన్నీ మానుకొని కేవలం ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ప్రయత్నంలో చదువుతూ, సాధన చేస్తూ గడుపుతున్నారు. అయితే అందులో ఏ కొందరికో మాత్రమే ఉద్యోగం వస్తోంది.

ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడి, తమ ప్రయత్నాన్ని మాననివారు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. సర్కారీ కొలువు వస్తే వచ్చే ధీమా, అందే ప్రయోజనాలు వీటిపై నిరుద్యోగుల్లో క్రేజ్ పెరిగేలా చేస్తున్నాయి. ఐటీ లాంటి కొన్ని రంగాల్లో రూ.లక్షల్లో జీతాలు వస్తున్నా ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్​లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్ల కల నెరవేరింది. వాళ్ల జీవితాల్లో పండుగ వచ్చింది. ఎనర్జీ అసిస్టెంట్లకు ప్రభుత్వం తీపి కబురు అందింది.

జేఎల్​ఎం గ్రేడ్-2 ఉద్యోగాలు పొందిన వాళ్లలో రూల్స్ మేరకు అర్హత కలిగిన అందరినీ పర్మినెంట్ (రెగ్యులర్) చేస్తూ ఏపీ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఐ.పృథ్వీతేజ్, జె.పద్మా జనార్దన రెడ్డి, కె.సంతోషరావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. కంపెనీ రూల్స్​కు అనుగుణంగా వారి జీతభత్యాలు ఉంటాయని ఆదేశాల్లో తెలిపారు. 2019లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు ఎనర్జీ అసిస్టెంట్ల పోస్టులను ఏపీ ప్రభుత్వం సృష్టించి నిరుద్యోగులకు వరంలా అందించింది. ఏపీ సీపీడీసీఎల్​లో దాదాపు 1,910 మంది, ఏపీ ఈపీడీసీఎల్​లో సుమారు 2,859 మంది, ఏపీ ఎస్​పీడీసీఎల్​లో 3,114 మంది చొప్పున మొత్తం 7,883 మందికి ఉద్యోగాలు కల్పించింది. వీళ్లకు రెండేళ్ల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందని సీఎండీలు పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి