Nidhan
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఇప్పుడు ఐపీఎల్ ఆడేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ తరుణంలో అతడి ఫ్యామిలీని టార్గెట్ చేసుకొని కొందరు ట్రోలింగ్‌కు దిగారు.
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఇప్పుడు ఐపీఎల్ ఆడేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ తరుణంలో అతడి ఫ్యామిలీని టార్గెట్ చేసుకొని కొందరు ట్రోలింగ్‌కు దిగారు.
Nidhan
క్రికెట్లో ట్రోలింగ్ అనేది చాలా కామన్ అనే విషయం తెలిసిందే. మ్యాచ్ సీరియస్ మోడ్‌లో ఉన్నప్పుడు ప్లేయర్ల కాన్సంట్రేషన్‌ను దెబ్బతీసేందుకు ట్రోలింగ్ చేస్తుంటారు ప్రత్యర్థులు. ఆ టీమ్, ఈ టీమ్ అనేం లేదు.. దాదాపుగా అన్ని జట్లలోనూ ఇది సర్వసాధారణంగా మారింది. అయితే ట్రోలింగ్ గ్రౌండ్ వరకు పరిమితమైతే బాగుంటుంది. కానీ మైదానం దాటి ఆటగాళ్లను, వాళ్ల వ్యక్తిగత జీవితం, కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకొని అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఇబ్బంది పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. కానీ ఈ మధ్య ఇది ఎక్కువవుతోంది. టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఫ్యామిలీ ఇదే సమస్యతో ఇబ్బంది పడుతోంది. చాహల్ భార్య ధనశ్రీ వర్మను లక్ష్యంగా చేసుకొని కొందరు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దిగారు. దీనిపై ఆమె తాజాగా రియాక్ట్ అయ్యారు.
అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నెట్టింట తన మీద జరిగిన ట్రోలింగ్‌పై మాట్లాడుతూ ధనశ్రీ వర్మ ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ఇది తమ కుటుంబాన్ని చాలా బాధపెట్టిందని వాపోయారు. అయితే ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. ‘అందరికీ హాయ్. ఈ విషయం గురించి మాట్లాడటం బెటర్ అనుకొని మీ మందుకొచ్చా. ఒకరి మీద ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేయడం కాదు. ముందు మనిషిగా ఎలా ప్రవర్తించాలో నేర్చుకోండి. నాకు చాలా మెచ్యూరిటీ ఉంది. నా లైఫ్‌లో ఎప్పుడూ ట్రోల్స్‌కు గానీ మీమ్స్‌కు గానీ ఎఫెక్ట్ అవ్వలేదు. ఇలాంటివి నేను పట్టించుకోను. వీటిని చూసి నవ్వుకుంటా. కానీ రీసెంట్గా జరిగిన ట్రోలింగ్ మీద మాత్రం రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని వల్ల నా ఫ్యామిలీ చాలా ప్రభావితమైంది’ అని ధనశ్రీ వర్మ చెప్పుకొచ్చారు.
రీసెంట్ ట్రోలింగ్ వల్ల తన కుటుంబీకులు, సన్నిహితులు చాలా బాధపడ్డారని ధనశ్రీ తెలిపారు. మాట్లాడే స్వేచ్ఛ అందరికీ ఉందని.. కానీ ఈ ట్రోలింగ్ తమ ఫ్యామిలీ సెంటిమెంట్లను దెబ్బతీసిందని పేర్కొన్నారు. అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నానని.. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. నెట్టింట ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయడం, విద్వేషాన్ని రెచ్చగొట్టడం సరికాదని స్పష్టం చేశారు. తన వర్క్‌లో సోషల్ మీడియా చాలా ముఖ్యమని.. అందుకే తాను వెనక్కి తగ్గడం లేదని, మళ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులోకి వచ్చానని చెప్పారు. ప్రేక్షకులను, అభిమానులను ఎంటర్టైన్ చేయడానికే తాము ఉన్నామని వివరించారు ధనశ్రీ. అందరు మదర్స్, సిస్టర్స్‌లాగే తాను కూడా ఒక స్త్రీనే అని.. కాబట్టి సరిగ్గా వ్యవహరించాలని కోరారు. తాను ఫైటర్నని తలొంచే ప్రసక్తే లేదని చాహల్ సతీమణి స్పష్టం చేశారు. మంచి విషయాలపై ఫోకస్ చేయడం నేర్చుకోవాలని సూచించారు. మరి.. ధనశ్రీ వర్మ ట్రోలింగ్ అంశంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Dhanashree Verma has spoken against the filth going on against her on social media.
– Kudos to her for speaking up! 👏 pic.twitter.com/RXv2x8LmaW
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 16, 2024