iDreamPost

రోహిత్-పాండ్యా గొడవపై యువరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! నేనైతే అలా చేసేవాడినంటూ..!

నేనైతే అలా చేసేవాడిని అంటూ రోహిత్ శర్మ-హార్దిక్ పాండ్యా గొడవపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్. మరి యువీ ఏం చేసేవాడు? వివరాల్లోకి వెళితే..

నేనైతే అలా చేసేవాడిని అంటూ రోహిత్ శర్మ-హార్దిక్ పాండ్యా గొడవపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్. మరి యువీ ఏం చేసేవాడు? వివరాల్లోకి వెళితే..

రోహిత్-పాండ్యా గొడవపై యువరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! నేనైతే అలా చేసేవాడినంటూ..!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న వైరం గురించి మనందరికి తెలియనిది కాదు. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ సాధించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ పగ్గాలు అందించడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై ఇప్పటికే పలువురు టీమిండియా మాజీ దిగ్గజాలు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ సైతం ఈ వివాదంపై స్పందించాడు.

రోహిత్ శర్మ-హార్దిక్ పాండ్యా గొడవపై తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ ఆల్ రౌండర్, 2011 వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్. లేటెస్ట్ గా స్టార్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ మాట్లాడుతూ..”రోహిత్ శర్మ విషయంలో ముంబై యాజమాన్యం పెద్ద నిర్ణయమే తీసుకుంది. ఐదుసార్లు జట్టును ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ ను కెప్టెన్ గా తొలగించి పాండ్యాకు పగ్గాలు అప్పగించారు. నేనైతే రోహిత్ కు ఇంకో ఛాన్స్ ఇచ్చేవాడిని. ఈ సీజన్ రోహిత్ ను కెప్టెన్ చేసి, హార్దిక్ ను వైస్ కెప్టెన్ గా నియమించేవాడిని. అప్పుడు తెలిసేది మెుత్తం ఫ్రాంచైజీ ఎలా వర్క్ చేసేదో” అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు యువరాజ్ సింగ్.

ప్రస్తుతం యువరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో ఆసక్తిగా మారాయి. రోహిత్ కు ఒక విధంగా మద్ధతు తెలిపాడు సిక్సర్ల కింగ్. ఇంకో సీజన్ కు రోహిత్ ను కెప్టెన్ గా కొనసాగించాల్సిందని తన మనసులో మాటను బయటపెట్టాడు యువీ. పాండ్యా విషయంలో టీమిండియా మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్ సైతం సంచలన ఆరోపణలు చేశాడు. పాండ్యాకు దేశం కంటే ఐపీఎల్, డబ్బే ముఖ్యమని షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ స్టార్ట్ కానున్న నేపథ్యంలో యువీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రోహిత్ పై యువీ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

ఇదికూడా చదవండి: శ్రేయస్‌ అయ్యర్‌కు మరో షాక్‌! IPLకు దూరం.. ఎందుకంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి