iDreamPost

యువరాజ్ దంపతులకు పండంటి ఆడబిడ్డ.. ఏం పేరు పెట్టారంటే?

యువరాజ్ సింగ్- హేజల్ కీచ్ దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. భార్యాపిల్లలతో కలిసున్న ఫొటోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. చిన్నారిని పరిచయం చేస్తూనే ఆమెకు పెట్టిన పేరును కూడా వెల్లడించాడు. యువీ ఫ్యాన్స్ ఈ పోస్ట్ చూసిన తర్వాత ఆనందంతో గంతులేస్తున్నారు. యువరాజ్ సింగ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

టీమిండియా స్టార్ ప్లేయర్.. 2011 వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ మరోసారి తండ్రి అయ్యాడు. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా తన అభిమానులు, ఫాలోవర్స్ తో పంచుకున్నాడు. యువరాజ్ సింగ్- హేజల్ కీచ్ దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. భార్యాపిల్లలతో కలిసున్న ఫొటోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. చిన్నారిని పరిచయం చేస్తూనే ఆమెకు పెట్టిన పేరును కూడా వెల్లడించాడు. యువీ ఫ్యాన్స్ ఈ పోస్ట్ చూసిన తర్వాత ఆనందంతో గంతులేస్తున్నారు. యువరాజ్ సింగ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

యువరాజ్ సింగ్ ఆట నుంచి మాత్రమే దూరమయ్యాడు. కానీ, క్రికెట్ ప్రపంచం మాత్రం ఇప్పటికీ అతనితోనే ఉంది. ఇప్పటికీ యువరాజ్ సింగ్ కు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. పాప పుట్టిన విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఇలా రాసుకొచ్చాడు. “నిద్రలేని రాత్రులు మరింత ఆనందదాయకంగా మారాయి. మేము మా చిన్నారి ఆరాను కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడే మా కుటుంబం పరిపూర్ణంగా మారింది” అంటూ యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు. హేజల్, కొడుకు, కుమార్తెతో కలిసి తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేశాడు. ఫ్యాన్స్ అంతా యువరాజ్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. 2016లో మోడల్ హేజల్ కీచ్ ను యువరాజ్ సింగ్ వివాహం చేసుకున్నాడు. వారికి 2022 జనవరిలో అబ్బాయి పుట్టాడు. మళ్లీ ఇప్పుడు హేజల్ కీచ్ పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది. చిన్నారి పేరును ఆరాగా పెట్టినట్లు తెలియజేశారు. మరి.. యువరాజ్ సింగ్ దంపతులకు మీ శుభాకాంక్షలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి