iDreamPost

ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెలలో 6,500 కోట్లు ఖాతాల్లో జమ..

ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెలలో 6,500 కోట్లు ఖాతాల్లో జమ..

ఇప్పటివరకు విపత్తుల వేళ చేతులు ఎత్తేసిన ప్రభుత్వాలనే ప్రజలు చూశారు. ఏదొక కారణాన్ని చూపి చేయాల్సిన పనులు చేయకుండా, నెరవేర్చాల్సిన హామీలకు ఎగనామం పెట్టిన ముఖ్యమంత్రులు బోలెడు మంది ఉన్నారు. కానీ, ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా … తాను ధైర్యంగా వుంటూ ప్రజలకు భరోసానిస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందుకు వెళుతున్నారు.

ఏ నెలలో ఏ పథకాన్ని అమలు చేస్తామో ముందుగానే ప్రకటించారు సీఎం జగన్. కానీ, కరోనా రెండో ఉపద్రవం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడి తప్పుతోంది. ఖజానాలో ప్రతీ రూపాయి కోసం కటకటలాడాల్సిన దుస్థితి దాపురించింది. ఇలాంటి సమయంలోనూ ప్రజలు ఇబ్బందులు పడకుండా.. ముందుగా చెప్పిన విధంగా పథకాలను అమలు చేస్తూ, ప్రజలకు అండగా నిలుస్తోంది.

తాజాగా జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలోనూ ప్రజా పథకాలకు ఆమోదముద్ర వేశారు. ఈ నెల 13వ తేదీన వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 54 లక్షల మందికి రూ. 4,050 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం.

బీమా కోసం 2,600 కోట్లు..

గతేడాది తుపానులు, అకాల వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. ఆ పరిహారాన్ని ఇప్పుడు నేరుగా రైతులకు అందజేయనున్నారు.

చంద్రబాబు హయాంలో పంట నష్టం వాటిల్లినా పట్టించుకున్న పాపాన పోలేదు. భారీగా నష్టం వాటిల్లితే చిల్లర విదిల్చి వేడుక చేసుకున్న కాలం రైతులకు ఇప్పటికీ గుర్తుంది. పంట నష్టం వాటిల్లిన రెండు, మూడేళ్లకు అరకొర పరిహారం అందజేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఉచిత బీమా పథకం అమలు చేస్తూ రైతన్నకు అండగా నిలుస్తోంది.

ఇందులో భాగంగా ఈ నెల 25వ తేదీన 2020 ఖరీఫ్‌ పంట నష్టపోయిన 38.30 లక్షల మంది రైతులకు వైఎస్సార్‌ ఉచిత పంటల భీమా కింద రూ. 2,589 కోట్ల పరిహారం వారి ఖాతాల్లో జమ చేయనుంది. ఇలా ఆపద సమయంలోనూ రైతులకు అండగా నిలుస్తూ రైతుల మన్ననలు చురగొంటున్నారు జగన్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి