iDreamPost
android-app
ios-app

Video: రక్తంతో జగన్ బొమ్మ గీసిన ఫ్యాన్స్.. అభిమానం కాదు..అంతకు మించి!

  • Published Apr 17, 2024 | 4:05 PM Updated Updated Apr 17, 2024 | 4:05 PM

అభిమానం అనేది వినడానికి చాలా చిన్న పదమే. కానీ దాని పవర్ మాత్రం అపరిమితం. అందుకే కొందరు వ్యక్తులు.. తమ హీరోల, రాజకీయ నాయకుల పట్ల చూపించే అభిమానం ఆశ్చర్యం కలిగిస్తుంది. తాజాగా ఏపీ సీఎం జగన్ పై ఇద్దరు వ్యక్తులు చాటుకున్న అభిమానం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

అభిమానం అనేది వినడానికి చాలా చిన్న పదమే. కానీ దాని పవర్ మాత్రం అపరిమితం. అందుకే కొందరు వ్యక్తులు.. తమ హీరోల, రాజకీయ నాయకుల పట్ల చూపించే అభిమానం ఆశ్చర్యం కలిగిస్తుంది. తాజాగా ఏపీ సీఎం జగన్ పై ఇద్దరు వ్యక్తులు చాటుకున్న అభిమానం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

  • Published Apr 17, 2024 | 4:05 PMUpdated Apr 17, 2024 | 4:05 PM
Video: రక్తంతో జగన్ బొమ్మ గీసిన ఫ్యాన్స్.. అభిమానం కాదు..అంతకు మించి!

సాధారణంగా సినిమా హీరోలకు అభిమానులు ఉంటారు. తమ అభిమాన హీరో  పుట్టిన రోజు, సినిమా విడుదలైనప్పుడు వాళ్లు చేసే రచ్చ మాములుగా ఉండదు. అలానే  హీరోల పుట్టిన రోజులకు అన్నదానాలు, రక్తదానం వంటి కార్యక్రమాలు చేస్తుంటారు. మరికొందరు  తమ అభిమాన హీరో పేరును, బొమ్మను శరీరంపై ట్యాటూ వేయించుకుంటారు. కానీ ఈ స్థాయి అభిమానం పొలిటికల్ లీడర్స్ విషయంలో చాలా అరుదుగా కనిపిస్తుంది. సినిమా హీరోలకు మించి అభిమానులను సొంతం చేసుకున్న పొలిటికల్ సూపర్ స్టార్ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే. ఇప్పటికే ఆయనపై ఎందరో తమ అభిమానాన్ని ప్రత్యేకంగా చూపించారు. తాజాగా ఇద్దరు అభిమానులు ఏకంగా రక్తంతో సీఎం జగన్ బొమ్మను గీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పొలిటికల్ సూపర్ స్టార్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని కష్టాలు వచ్చిన ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలనేది ఆయనను చూసి నేర్చుకోవాలని పలువురు అభిప్రాయ పడుతుంటారు. ఇక సీఎం జగన్ కి సినిమాల హీరోలకు మించిన అభిమానులు ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఆయన నిర్వహించే ప్రతి సభను చూస్తే..సముద్రం ఉప్పొంగి..ఊరిపైకి వచ్చిందా అన్నట్లు కనిపిస్తుంది. అసలు ఓ రాజకీయ నాయకుడికి సినిమా హీరోలకు మించి అభిమానులు ఉండటం అనేది చాలా అరుదు. సీఎం జగన్ లాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రాజకీయనేత దేశంలోనే ఎవరు లేరని పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు.

ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఎంతో మంది భిన్నంగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇటీవలే ఓ యువతి సీఎం జగన్ ఫోటోను తన చేతిపై ట్యాటూ వేయించుకుంది. అలానే ఓ వ్యక్తి ఎండలో చెప్పులు లేకుండా సీఎం జగన్  కోసం తిరుమలకు పాదయాత్ర చేశాడు.  అలానే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి..తన సొంత ఊరి నుంచి జగన్ ను చూసేందుకు విజయవాడకు నెల రోజుల పాటున కాలినడకను వెళ్లారు. ఇవి కేవలం మచ్చుతునకలు మాత్రమే. ఇలా ఎంతో మంది వైఎస్ జగన్ పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

అయితే తాజాగా ఇద్దరు వ్యక్తులు సీఎం జగన్ పై చూపించిన అభిమానంకి అందరు ఆశ్చర్యపోతున్నారు. నంద్యాల జిల్లాకు చెందిన చింతపల్లి కోటేశ్ అనే వ్యక్తి సీఎం జగన్ పై జరిగిన రాయి దాడికి నిరసన తెలియజేశారు. తన రక్తంతో సీఎం జగన్ బొమ్మ గీసి..తన నిరసనను తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ గెలిచి..మళ్ళీ సీఎం అవుతారని తెలిపారు. అలానే  ఓ యువకుడు కూడా తన రక్తంతో సీఎం జగన్ ను బొమ్మను గీశాడు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఇది అభిమానం కాదు.. అంతకు మించి అని ఈ వీడియో చూసిన వారు అభిప్రాయ పడుతున్నారు.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetCasibomMeritkingGrandpashabetCasibomcasibomjojobet girişjojobet güncel girişdeneme bonusu veren sitelerMariobetJojobetMadridbetMadridbetgrandpashabetgrandpashabet girişJojobetcasibomgrandpashabetjojobetcasinomilyoncasinomilyonultrabetultrabetgrandpashabet girişcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel girişjojobet