iDreamPost
android-app
ios-app

YSRCP Plenary-Jagan బాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర, ప్రజలదే: సీఎం జగన్‌

  • Published Jul 09, 2022 | 7:26 PM Updated Updated Jul 09, 2022 | 7:26 PM
YSRCP Plenary-Jagan బాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర, ప్రజలదే: సీఎం జగన్‌

రెండో రోజుల వైఎస్సార్‌సీపీ స‌మావేశాలు ముగిశాయి. పార్టీ నేత‌లు ఆశించిన‌ట్లుగానే వైఎస్సార్‌సీపీ శాశ్వత అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్ర‌సంగం వ‌చ్చే రెండేళ్ల‌కు పార్టీకి దారివేసింది. రాజ‌కీయ ఉరుములు, బాబు మీద చెణుకులు, భ‌విష్య‌త్తుపై తిరుగులేని భ‌రోసా, కార్య‌క‌ర్త‌ల‌కు గుండెనిండుగా ఆత్మ‌విశ్వాసం ర‌గిలించేలా సాగింది సీంఎం జ‌గ‌న్ ప్రసంగం. వైఎస్సార్‌సీపీ ప్లీనరీ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌ను ఎన్నుకుంది ప్లీనరీ. అనంతరం పార్టీనుద్దేశంచి సీఎం జగన్‌ ప్రసంగించారు.

జన సునామీ కనిపిస్తోంది. కాని ఇది ఆత్మీయుల సునామీ. పదమూడేళ్లుగా ఇదే అభిమానం నాపై చూపిస్తున్న‌ కార్యకర్తలు, నేతలు, అభిమానులకు నా సెల్యూట్‌. అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు అని సీఎం జగన్ అన్నారు. పార్టీని, గట్టి పునాదిపై నిర్మించుకున్నాం. మీ కష్టాల పునాదులపైనే ఏర్ప‌డింది మ‌న‌ ప్రభుత్వం. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ విప్లవాలు సాగుతున్నాయి. మ్యానిఫెస్టోలో ఏం చెప్పామో, అవే చేస్తున్నాం. నా ఫోకస్‌ అంతా ప్రజలకు మంచి చేయడం, వెనుక బడిన వర్గాలకు న్యాయం చేయడమే నా లక్ష్యం సీం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

పార్టీ ఆవిర్భావానికి దారితీసిన ప‌రిస్థితులను ప్ర‌స్తావించిన వైఎస్ జ‌గ‌న్, నాన్న మరణ వార్త విని సుమారు 700 మంది చనిపోయారు. వారందరి కుటుంబాలను పరామర్శించడం నా బాధ్యతగా భావించా. నాపై, కాంగ్రెస్‌, టీడీపీ కలిసి కేసులు వేసి ఎన్నో కుట్రలు చేశాయి. ఎప్పుడూ కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి కుట్రలకు, తప్పుడు కేసులకు లొంగేవాడు కాదు, జగన్‌. నన్ను అన్యాయంగా అరెస్ట్‌ చేయించిన పార్టీయే నామరూపాల్లేకుండా పోయింది. ఆనాడూ చంద్రబాబు మన పార్టీలో, ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు. 2014లో 23 ఎమ్మెల్యేలను కొన్న పార్టీకి, 2019లో అన్నే సీట్లు వచ్చాయి అని సీఎం జగన్‌ గుర్తు చేసుచేశారు.

ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమైన ప్రయాణం, ఇప్పుడు 151కి చేరింది. ఒక్క ఎంపీతో ప్రారంభమైన ప్రయాణం, ఇప్పుడు 22కి చేరిందని గుర్తు చేసుకున్నారు. నిండు మనసుతో మీ అందరికీ సెల్యూట్‌ చేస్తున్నా అని ప్రజాభివాదం చేశారు సీఎం జగన్‌.

చిప్ కాలికీ వేలుకి ఉంటే స‌రిపోదు, చిన‌మెద‌డుకి ఉండాలి

ఆ త‌ర్వాత నుంచి వైఎస్ జ‌గ‌న్ త‌న‌లోని రాజ‌కీయ వాడిని చూపించారు. చంద్ర‌బాబుపై విరుకుప‌డ్డారు. చంద్రబాబు చేతికి పెట్టుకున్న స్మార్ట్ రింగ్ గురించి ప్ర‌స్తావించిన వైఎస్ జ‌గ‌న్, ఈ మధ్య చంద్రబాబు రింగ్‌లో చిప్‌ ఉందని చెప్తున్నారు. చంద్రబాబులా రింగ్‌లోనో, మోకాళ్లలోనో, అరికాళ్లలోనో చిప్‌ ఉంటే సరిపోదు. ప్రజల కష్టాలను అర్థం చేసుకునే చిప్‌ చంద్రబాబుకు లేదని హావ‌భావాల‌తో చూపించారు. చంద్రబాబుకు ప్రజల పట్ల మమకారం, ప్రేమ అన్నది ఏమాత్రం లేదు. పేదలు ఎదగకూడదన్నదే చంద్రబాబు, దుష్టచతుష్టయం విధానం. ప్రజలకు మంచి చేయకూడదన్నదే చంద్రబాబు అభిమతం. తమ పిల్లలను ఇంగ్లీష్‌ మీడియంలో చదివిస్తారు. పేదల పిల్లలు మాత్రం తెలుగు మీడియమే చదవాలంట. నారాయణ, చైతన్యలను మాత్రమే టీడీపీ ప్రోత్సహిస్తుంది. కానీ, మన ప్రభుత్వం ప్రభుత్వ బడులను కార్పొరేట్‌ తీసుకెళ్లడానికి శ్రమిస్తోంది. ఒక్క విద్యారంగం కోసమే తొమ్మిది పథకాలు తీసుకొచ్చింది.. అంటూ ప్ర‌భుత్వ సాధించిన విజ‌యాల‌ను ప్ర‌క‌టించారు.

14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి.. కుప్పంను రెవెన్యూ డివిజన్‌ చేయాలని అర్జీ పెట్టుకున్నారు. కుప్పంను రెవెన్యూ డివిజన్‌ చేసింది మీ జగన్‌ ప్రభుత్వమే. కుప్పం ప్రజలకు మంచి జరగాలనే అలా చేశాం. మరింత పాదర్శక పాలన కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం. టీడీపీ అంటే పెత్తందార్ల ద్వారా పెత్తందార్ల కోసం నడుస్తున్న పార్టీ. చంద్రబాబు పార్టీ సిద్ధాంతమే వెన్నుపోట్లు అని సీఎం జగన్ విమ‌ర్శించారు.

ఆ త‌ర్వాత నుంచి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌సంగంలో రాజ‌కీయ వేడి మ‌రింత‌గా పెంచారు. సంక్షేమ‌ప‌థ‌కాల‌ను ప‌దే ప‌దే ప్ర‌స్తావించిన జ‌గ‌న్ అదునుచూసి బాబుపై దాడిచేశారు. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లేనని, సంక్షేమ పథకాలను కాపాడుకునే బాధ్యత ప్రజలదేనని సీఎం జగన్ చెప్పారు.

చంద్రబాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర ప్రజలదేనని, తనకున్న ఏకైక అండా,దండా అంతా ప్రజలేనని ప్ర‌క‌టించారు. ‘చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పధకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లే. చక్రాలు లేని సైకిల్‌ను చంద్రబాబు తొక్కలేకపోతున్నారు. రాష్ట్రంలో అందరికీ న్యాయం చేసేందుకే మూడు రాజధానులు. ఎన్నికల దగ్గరపడే కొద్దీ దుష్టచతుష్టయం దుష్ప్రచారం ఎక్కువైంద‌ని అన్నారు.

అసత్యాలు, వెన్నుపోట్లు మనకు తెలీదు. వెన్నుపోటు ద్వారా అధికారం లాక్కోవడం నాకు తెలీదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు మనకు లేరు. ఈ దొంగల ముఠాతో ప్రజలు జాగ్రత్. సంక్షేమ పథకాలను ఆపేయాలన్నేదే దుష్టచతుష్టయం కుట్ర. ఓట్ల కోసం దొంగ వాగ్దానాలతో చంద్రబాబు మళ్లీ మీ ముందుకొస్తారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలవడమే మన లక్ష్యం. కుప్పం ప్రజలు కూడా మనల్ని దీవించారు. నాకున్న ఏకైక అండాదండా ప్రజలే’ అన్న సీఎం, ప్లీన‌రీ నినాదాల మ‌ధ్య‌ ఉద్వేగంగా ప్రసంగించారు.


ఎన్నికలకు సిద్ధం

ఆ త‌ర్వాత‌ పార్టీ కోరున్న‌ట్లే, ఎన్నిక‌ల‌కు స‌మ‌ర‌భేరి మ్రోగించారు. ‘మనం చేసిన మంచిని ప్రతి గడపకూ తీసుకెళ్లండి. దుష్టచతుష్టయం కుట్రలను సోషల్‌ మీడియా ద్వారా తిప్పికొట్టండి. పార్టీ నాయకత్వంతో కార్యకర్తలు సమన్వయం చేసుకోవాలి. ఎన్నికలకు సిద్ధం కావాలి’ అని క్యాడర్‌కు సీఎం జగన్ మార్గ‌నిర్దేశం చేశారు.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Girişiptv satın al