iDreamPost

YSR Matsyakara Bharosa దత్తపుత్రుడితో పాటు ఎల్లోమీడియాకు ఆ ధైర్యం లేదు, సీఎం జ‌గ‌న్ కామెంట్స్

YSR Matsyakara Bharosa దత్తపుత్రుడితో పాటు ఎల్లోమీడియాకు ఆ ధైర్యం లేదు, సీఎం జ‌గ‌న్ కామెంట్స్

విప‌క్షాల‌పై సీఎం జ‌గ‌న్ విమ‌ర్శ‌ల డోసు పెంచారు. మంచి చేశామని చెప్పే ధైర్యం బాబుకు లేదు. చంద్రబాబు ఇంత మంచి పని చేశాడని చెప్పే ధైర్యం, ఆ దత్తపుత్రుడికి లేదు. అస‌లు ఎల్లోమీడియాకూ ధైర్యం లేద‌ని అన్నారు. 2019లో మేనిఫెస్టోలో చెప్పిన 95 శాతం హామీలను అమలు చేశాం. నిజాయితీ, నిబద్ధతో ప్రజల ముందుకు వస్తున్నాం. దుష్టచతుష్టయం అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు. వీళ్ల‌కు తోడు, వీరి దత్తపుత్రుడు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్నిజీర్ణించుకోలేరు. పరీక్షల పేపర్లు వీళ్లే లీక్‌ చేస్తారు. పేపర్‌ లీక్‌ను సమర్థించిన ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశారా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ఈఎస్‌ఐలో డబ్బులు కొట్టేసిన నాయకుడిని విచారించడానికి వీళ్లేదనే విపక్షం, ఎల్లోమీడియాను ఎక్కడైనా చూశారా అని సీఎం జగన్‌ అన్నారు.

కొడుక్కి పచ్చి అబద్ధాలు, మోసాలతో ట్రైనింగ్‌ ఇస్తున్న చంద్రబాబు లాంటి తండ్రిని ఎక్కడైనా చూశారా?. కోర్టుకు వెళ్లి, మంచి పనులు అడ్డుకునే ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశారా? ప్రజలకు మంచి జరిగితే ఇలాంటి రాబందులకు అసలు నచ్చదని నిశితంగా విమ‌ర్శించారు.

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. దాదాపు లక్షా తొమ్మిదివేల మందికి, వరుసగా నాలుగో ఏడాది కూడా ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున, మత్స్యకారుల‌ ఖాతాల్లో, రూ.109 కోట్లను జమ చేశారు. మత్స్యకార భరోసా కింద ఇప్పటి వరకు రూ.418 కోట్ల సాయాన్ని అందించారు.

మ‌త్స్య‌కారుల‌కు గ‌త ప్ర‌భుత్వం ఏం చేయలేద‌ని విమ‌ర్శించిన జ‌గ‌న్, త‌మ ప్ర‌భుత్వం ఏం చేసిందో జ‌నం ముందుంచారు. డీజిల్‌పై సబ్సిడీ రూ.6 నుంచి రూ.9కి పెంచాం. స్మార్ట్‌ కార్డులు జారీ చేసి, డీజిల్‌ కొనేటప్పుడే, సబ్సిడీ సొమ్ము మినహాయింపునిస్తున్నాం. వేటకు వెళ్లి మత్స్యకారుడు ప్రమాదవశాత్తు చనిపోతే, వచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచాం. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులపై, ప్రత్యేక దృష్టి పెట్టాం. కొత్తగా 9 ఫిషింగ్‌ హార్బర్లు, 4 ఫిషింగ్‌ ల్యాండింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరిగేలా చర్యలు చేపడుతున్నామని సీఎం జగన్‌ అన్నారు.
గత ప్రభుత్వానికి,మన ప్రభుత్వానికి తేడా గమనించండి
చంద్రబాబు పాలనలో మత్స్యకారులను పట్టించుకోలేదు. గతంలో కొంతమందికి మాత్రమే పరిహారం అందేది. ఇవాళ అర్హులందరికీ మత్స్యకార భరోసానిస్తున్నామ‌ని సీఎం జగన్‌ అన్నారు. గత ప్రభుత్వ కాలంలో 12 వేల కుటుంబాలకు మాత్రమే పరిహారం అందించారు. ఎన్నికల వేళ‌ 50వేల మందికి పరిహారం ఇచ్చారు. చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చింది రూ.104 కోట్లు. ఇవాళ మన ప్రభుత్వంలో ఏడాదికి రూ.109 కోట్లు ఇస్తున్నాం. మనం ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్‌, ఖురాన్‌, గీతగా భావించామ‌ని అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి