iDreamPost

యంగ్ డైరెక్టర్‌తో ప్రముఖ నటుడు ప్రభు కుమార్తె పెళ్లి..!

బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు వరుసగా ప్రముఖుల ఇంట్లో శుభకార్యాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు కోలీవుడ్ ప్రముఖ నటుడు ప్రభు కుమార్తె.. యంగ్ డైరెక్టర్ ను మనువాడబోతున్నట్లు సమాచారం.

బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు వరుసగా ప్రముఖుల ఇంట్లో శుభకార్యాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు కోలీవుడ్ ప్రముఖ నటుడు ప్రభు కుమార్తె.. యంగ్ డైరెక్టర్ ను మనువాడబోతున్నట్లు సమాచారం.

యంగ్ డైరెక్టర్‌తో ప్రముఖ నటుడు ప్రభు కుమార్తె పెళ్లి..!

సినీ ఇండస్ట్రీలో వరుసగా భాజా భజంత్రీలు మోగుతున్నాయి. బాలీవుడ్ నటి పరిణతీ చోప్రా, ఆప్ నేత రాజీవ్ చద్దా సెప్టెంబర్‌లో వివాహం చేసుకున్న సంగతి విదితమే. టాలీవుడ్, కోలీవుడ్ యంగ్ హీరో త్రిగుణ్ కూడా అదే నెలలో ఓ ఇంటివాడయ్యాడు. అలాగే తమళ నటుడు అశోక్ సెల్వన్, నటి కీర్తి పాండ్యన్ మెడలో మూడు ముళ్లు వేశాడు. టీ టౌన్ హీరో, మెగా వారసుడు వరుణ్ తేజ్.. నటి లావణ్య త్రిపాఠి నవంబర్‌లో ఒక్కటైన సంగతి విదితమే. అలాగే ప్రముఖ నటుడు అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య ఎంగేజ్ మెంట్ జరిగింది. మాలీవుడ్ ప్రముఖ నటుడు, ఇప్పుడు తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉన్న జయరాం కుమారుడు కాళిదాస్ నిశ్చితార్థం జరిగింది. తాజాగా ఒకప్పటి అందాల తార రాధ కుమార్తె, నటి కార్తీక కూడా పెళ్లి పీటలు ఎక్కింది.

ఇప్పుడు మరో ప్రముఖ నటుడి ఇంట పెళ్లి భాజాలు వినిపించనున్నాయి. కోలీవుడ్ దిగ్గజ నటుడు శివాజీ గణేషణ్ కుమారుడు, నటుడు ప్రభు కుమార్తె త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. కాగా, ఇది ఆమెకు రెండో వివాహం. ప్రభు ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగారు. ప్రస్తుతం దక్షిణాది మూవీస్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. కుమారుడు విక్రమ్, కుమార్తె ఐశ్వర్య. విక్రమ్ తమిళంలో అనేక చిత్రంలో నటించారు. విక్రమ్ గజరాజు అనే డబ్బింగ్ మూవీతో తెలుగు వారికి పరిచయమయ్యాడు. ఇటీవల వచ్చిన ఇరుగపట్రు అనే మూవీలో కనిపించారు. ఈ చిత్రం మంచి ఆదరణ చూరగొంటుంది. కుమార్తె ఐశ్వర్య ప్రముఖ దర్శకుడ్ని రెండో వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

మార్క్ ఆంటోనీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌తో త్వరలో ఏడడగులు వేయబోతున్నారట ఐశ్వర్య. 2009లో తన బంధువైన కునాల్ తో ఆమెకు వివాహం జరగ్గా.. కొన్ని విబేధాల కారణంగా విడిపోయారు. ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో రవి, ఐశ్వర్యల మధ్య స్నేహం ఏర్పడి.. ప్రేమకు దారి తీసిందని, వీరి విషయం ఇరు వైపులా కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారని, డిసెంబర్‌లో వీరి వివాహం ఉండబోతుందని కోలీవుడ్ కోడై కూస్తుంది. మరి ప్రభు నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే దర్శకుడు అధిక్ రవీచంద్రన్ మార్క్ ఆంటోనీ హిట్ తో మంచి క్రేజ్‌లో ఉన్నాడు. తన తదుపరి చిత్రం..తన ఫేవరేట్ హీరో అయిన అజిత్ కుమార్‌తో సినిమా చేసే అవకాశం లభించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి