iDreamPost

RCB ఓడిపోవడానికి కారణం అదే.. సంచలన విషయాలు వెల్లడించిన యశ్ దయాళ్ తండ్రి!

చెన్నైపై గెలిచిన తర్వాత ఆర్సీబీ ఆటగాళ్లు చేసిన ఆ తప్పు కారణంగానే టీమ్ ఓడిపోయిందని సంచలన విషయాలు వెల్లడించాడు. మరి ఆర్సీబీ ప్లేయర్లు చేసిన ఆ తప్పు ఏంటి? ఆ వివరాల్లోకి వెళితే..

చెన్నైపై గెలిచిన తర్వాత ఆర్సీబీ ఆటగాళ్లు చేసిన ఆ తప్పు కారణంగానే టీమ్ ఓడిపోయిందని సంచలన విషయాలు వెల్లడించాడు. మరి ఆర్సీబీ ప్లేయర్లు చేసిన ఆ తప్పు ఏంటి? ఆ వివరాల్లోకి వెళితే..

RCB ఓడిపోవడానికి కారణం అదే.. సంచలన విషయాలు వెల్లడించిన యశ్ దయాళ్ తండ్రి!

ఐపీఎల్ 2024 సీజన్ లో దురదృష్టకరమైన టీమ్ ఏదైనా ఉందంటే అది రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు టీమే. లీగ్ దశలోనే ఇంటిదారి పట్టే స్థాయి నుంచి అనూహ్యంగా ప్లే ఆఫ్స్ కు దూసుకొచ్చింది ఆర్సీబీ. చెన్నైతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో అద్భుత విజయం సాధించిన ఆర్సీబీ.. ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. ఆర్ఆర్ పై ఓడిపోవడానికి కారణం చెప్పుకొచ్చాడు ఆర్సీబీ పేసర్ యశ్ దయాళ్ తండ్రి చంద్రపాల్. చెన్నైపై గెలిచిన తర్వాత ఆర్సీబీ ఆటగాళ్లు చేసిన ఆ తప్పు కారణంగానే టీమ్ ఓడిపోయిందని సంచలన విషయాలు వెల్లడించాడు.

చెన్నైపై అద్భుత విజయం సాధించి.. ప్లే ఆఫ్స్ లోకి దూసుకొచ్చిన ఆర్సీబీకి రాజస్తాన్ రాయల్స్ షాకిచ్చిన విషయం తెలిసిందే. అయితే సీఎస్కేపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించి.. మంచి ఊపులో ఉన్న ఆర్సీబీ రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం ఓడిపోయింది. దాంతో ఆర్సీబీ పడ్డ కష్టానికి ఫలితం దక్కకుండా పోయింది. అయితే ఈ ఓటమికి కారణం ఆర్సీబీ ఆటగాళ్లు చేసుకున్న స్వయంకృపరాధమే అంటున్నాడు ఆర్సీబీ పేసర్ యశ్ దయాళ్ తండ్రి చంద్రపాల్. చెన్నైపై విజయం సాధించిన తర్వాత ఆర్సీబీ ఆటగాళ్లు రాత్రి పార్టీ చేసుకున్నారని సంచలన విషయాలు వెల్లడించాడు.

యశ్ దయాళ్ తండ్రి మాట్లాడుతూ..”చెన్నైపై విజయం సాధించిన తర్వాత ఆర్సీబీ ఆటగాళ్లు రాత్రంతా పార్టీ చేసుకున్నారు. వారు తెల్లవారు జామున 5 గంటల వరకు పార్టీ చేసుకున్నారు. ఈ విషయాన్ని యశ్ తన తల్లితో చెప్పాడు. రాత్రి పార్టీ చేసుకున్నామని, ఎంతో సంతోషంగా ఉన్నామని అతడు తన తల్లికి చెప్పాడు. నెక్ట్స్ రౌండ్ కు క్వాలిఫై కావడంతో.. వారు తమ సంతోషాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు” అంటూ ఆ రోజు రాత్రి జరిగిన సంచలన విషయాలను వెల్లడించాడు. రాత్రి పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేసిన ఆటగాళ్లకు రెస్ట్ లేకపోవడంతో.. శారీరకంగా కుంగిపోయారని అతడు పేర్కొన్నాడు. మరి తెల్లవార్లూ పార్టీ చేసుకోవడం కారణంగానే ఆర్సీబీ ఓడిపోయింది అన్న యశ్ దయాళ్ తండ్రి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sarcasm (@sarcastic_us)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి