iDreamPost
android-app
ios-app

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్.. పేరు కూడా పెట్టేసిందిగా

Star Heroine Announce Her Baby Name ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ చూసిన వాళ్లకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేని పేరు ఆమెది. కరోనా సమయంలో మ్యారేజ్ చేసుకున్న ఈ చిన్నది. ఇప్పుడు తల్లిగా ప్రమోషన్ పొందింది.

Star Heroine Announce Her Baby Name ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ చూసిన వాళ్లకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేని పేరు ఆమెది. కరోనా సమయంలో మ్యారేజ్ చేసుకున్న ఈ చిన్నది. ఇప్పుడు తల్లిగా ప్రమోషన్ పొందింది.

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్.. పేరు కూడా పెట్టేసిందిగా

ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌తో ఫేమస్ అయిన బ్యూటీల్లో ఒకరు యామీ గౌతమ్. తెలుగులో ఎందుకో క్లిక్ కాలేదు కానీ.. హిందీలో వరుస హిట్లతో దూసుకెళుతుంది. అక్కడ ఆమె స్టార్ హీరోయిన్.  తాజాగా ఆర్టికల్ 370 మూవీతో సక్సెస్ అందుకుంది. పంజాబీ ప్రముఖ దర్శకుడు కూతురైన యామీ.. కన్నడ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో విజయ్ దేవరకొండతో ఆమె కెరీర్ స్టార్ చేయగా.. కేవలం నాలుగైదు చిత్రాలకే పరిమితం అయ్యింది. పెళ్లి చేసుకున్నా ఇండస్ట్రీలో రాణించొచ్చని నిరూపిస్తున్న అతికొద్దీ మంది నటీమణుల్లో ఆమె ఒకరు. 2021లో దర్శకుడు, నిర్మాత ఆదిత్య ధర్‌ను వివాహం చేసుకుంది. యురి మూవీ దర్శకుడే ఈ ఆదిత్య. ఇప్పుడు ఈ దంపతులు తల్లీదండ్రులుగా ప్రమోషన్ పొందారు.

యామి గౌతమ్, ఆదిత్యలకు బాబు పుట్టాడు. కాగా, అప్పుడే బాబుకు పేరు కూడా పెట్టేశారు. అక్షయ తృతీయ నాడే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది యామీ గౌతమ్. తాజాగా బాబు పేరును ఎనౌన్స్ చేస్తూ ఆశీర్వచనాలు కోరింది ఈ జంట. బాబుకు వేదవిద్ అనే పేరును పెట్టారు. దీంతో పలువురు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. యామీ గౌతమ్ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన నువ్విలా అనే చిత్రంలో నటించింది. ఇందులో విజయ్ కనిపించేది కాసేపే. కానీ యామీకి పేరు తెచ్చింది మాత్రం హిందీ మూవీ విక్కీ డోనర్. ఇక తెలుగులో బైలింగ్వల్ మూవీ గౌరవంలో అల్లు వారసుడు శిరీష్‌తో జతకట్టింది. యుద్ధం అనే మూవీతో పాటు నితిన్ హీరోగా వచ్చిన కొరియర్ బాయ్ కళ్యాణ్ చిత్రంలో నటించింది.

2015 తర్వాత ఆమె తెలుగు సినిమాలో కనిపించలేదు.  యామీ నటించిన ఏ సినిమాలు సక్సెస్ కొట్టకపోవడంతో బాలీవుడ్‌లో స్థిర పడిపోయింది అమ్మడు. అక్కడ స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. యురీ సర్జికల్ స్టైక్స్ దర్శకుడు ఆదిత్యతో ప్రేమలో పడింది. కరోనా సమయంలో ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన తర్వాత కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది యామీ గౌతమ్. ఎ థర్డ్స్ డే, దాస్వీ, లాస్ట్, ఘోర్ నికాల్ కే భాగ, అక్షయ్ కుమార్ ఓఎంజీ 2, ఆర్టికల్ 370 వంటి చిత్రాల్లో నటించింది. వరుస ఆఫర్లతో పెళ్లయ్యాక కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ప్రస్తుతం తల్లి ఫేజ్‌ను ఎంజాయ్ చేస్తున్న యామీ.. మళ్లీ తెరపై కనిపించే అవకాశాలున్నాయి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomtaraftarium24luxbetluxbetRulobetJojobet GirişkatlaJojobet Giriş