iDreamPost

Harshavardhan : గూగ్లీ మిస్ అయ్యింది – ఇది కొట్టే తీరాలి

Harshavardhan : గూగ్లీ మిస్ అయ్యింది – ఇది కొట్టే తీరాలి

తెలుగు కామెడీ సీరియల్స్ లో బెస్ట్ ఏదీ అని చెప్పమంటే ఇప్పటికీ జనాలు ఠక్కున చెప్పే పేరు అమృతం. టైటిల్ సాంగ్ కూడా వైరల్ అయిపోయి జనాల నోట్లో నానడం ఒక్క దీని విషయంలోనే జరిగింది. 300 ఎపిసోడ్లకు పైగా సాగిన ఈ నవ్వుల ప్రహసనంలో హీరోలుగా ముగ్గురు చేశారు. శివాజీరాజా, నరేష్ ల తర్వాత ఆ అదృష్టం క్యారెక్టర్ ఆర్టిస్ట్ హర్షవర్ధన్ కు దక్కింది. వీళ్ళలో ఎక్కువ కనిపించింది కనెక్ట్ అయ్యింది కూడా ఈయనే. ఇటీవలి కాలంలో సినిమాల్లో కూడా రెగ్యులర్ గా కనిపిస్తున్న హర్షవర్ధన్ కు డైరెక్టర్ కావడమనేది ఎప్పటి నుంచో ఉన్న టార్గెట్. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందేలకు సంభాషణలు సమకూర్చినా కెరీర్ వేగమందుకోలేదు.

ఆ తర్వాత గుడ్ బ్యాడ్ ఆగ్లీ ద్వారా డైరెక్షన్ డెబ్యూ చేసిన హర్షవర్ధన్ కు ఆ సినిమా ఎన్నేళ్ళైనా విడుదల కాకపోవడం కొత్త అవకాశాలు రాకుండా చేసింది. గూగ్లీ అని టైటిల్ మార్చినా లాభం లేకపోయింది. దాంతో ఆయనా నిర్మాతలూ ఇద్దరూ ఆశలు వదిలేసుకున్నట్టే అనిపించింది. ఎట్టకేలకు అమృతం హీరోకి దర్శకుడిగా రెండో అవకాశం దక్కింది. సుధీర్ బాబు హీరోగా ఆసియన్ సంస్థ నిర్మించే చిత్రం ఇవాళే మొదలైంది. జానర్ ఏదీ అనేది చెప్పలేదు ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఏదో సెన్సిటివ్ స్టోరీనే అని చెబుతున్నారు. మంచి బ్యానర్, క్వాలిటీ క్యాస్టింగ్ వీటిని వాడుకునే బాధ్యత ఇప్పుడు హర్షవర్ధన్ మీద ఉంది.

లవ్ స్టోరీ ప్రొడక్షన్ హౌస్ కాబట్టి నిర్మాణంలో రాజీ ఉండకపోవచ్చు. గూగ్లీ కంటే నిర్మాతల సపోర్ట్ ఇతరత్రా కారణాలు దాన్ని బయటికి రాకుండా చేశాయి కానీ ఇప్పుడీ మూవీకి అలాంటి చిక్కులు ఏమి ఉండవు. ఇక సుధీర్ బాబు సంగతి చూస్తే చాలా కష్టపడి చేసిన శ్రీదేవి సోడా సెంటర్ ఫలితం బాగా నిరాశపరిచింది. అప్పటికీ పలుమార్లు చూసేసిన కులం ప్రేమకథను జనం రిసీవ్ చేసుకోలేకపోయారు. అందుకే తనకు సమ్మోహనం లాంటి కథలే సెట్ అవుతాయని భావించి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది కూడా అదే కోవలోకి వస్తుందేమో చూడాలి

Also Read : Bangarraju : నాగార్జున నిర్ణయం తీసేసుకున్నారా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి