iDreamPost

Bajrang Punia: ‘పద్మశ్రీ’ని వెనక్కి ఇచ్చేస్తున్నా! స్టార్ రెజ్లర్ ప్రకటన.. మోదీకి లేఖ!

రెజ్లర్ బజరంగ్ పూనియా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తనకు ఇచ్చిన 'పద్మశ్రీ' పురస్కారాన్ని వెనక్కి ఇస్తున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.

రెజ్లర్ బజరంగ్ పూనియా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తనకు ఇచ్చిన 'పద్మశ్రీ' పురస్కారాన్ని వెనక్కి ఇస్తున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.

Bajrang Punia: ‘పద్మశ్రీ’ని వెనక్కి ఇచ్చేస్తున్నా! స్టార్ రెజ్లర్ ప్రకటన.. మోదీకి లేఖ!

భారత రెజ్లింగ్ సమాఖ్యలో మరోసారి కలకలం మెుదలైంది. తాజాగా జరిగిన ఇండియా రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికైన విషయం తెలిసిందే. అతడి ఎన్నికపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. ఇప్పటికే స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించింది. ఇక ఈ విషయంపై తాజాగా మరో రెజ్లర్ బజరంగ్ పూనియా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తనకు ఇచ్చిన ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని వెనక్కి ఇస్తున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. దీంతో పాటుగా ప్రధాని మోదీకి లేఖ కూడా రాశాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) నూతన అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికవ్వడంతో.. రెజ్లింగ్ సమాఖ్యలో మరోసారి కలకలం మెుదలైంది. సంజయ్ సింగ్ ఎన్నికవ్వడంతోనే స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించింది. తాజాగా మరో రెజ్లర్ బజరంగ్ పూనియా సంచలన ప్రకటన చేశాడు. కొత్త అధ్యక్షుడి ఎన్నికను నిరసిస్తూ.. తనకు ఇచ్చిన ‘పద్మశ్రీ’ని వెనక్కు ఇచ్చేస్తున్నాను అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ సంచలన నిర్ణయంతో పాటుగా ప్రధాని మోదీకి లేఖ రాశాడు. ఆ లేఖలో..

“ప్రియమైన మోదీజీ.. మీరు మీ పనుల్లో బిజీగా ఉంటారని తెలుసు. కానీ ఇండియాలో రెజ్లర్ల పరిస్థితి దారుణంగా ఉంది. మా సమస్యలను మీ దృష్టికి తీసుకొచ్చేందుకే ఈ లేఖ రాస్తున్నా. గతంలో WFI మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం మీకు తెసిందే. అప్పుడు వారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో.. మేం ఆందోళన విరమించాం. కానీ నెలలు గడిచినా అతడిపై కేసు నమోదు చేయలేదు. దీంతో మళ్లీ రోడ్డెక్కాల్సి వచ్చింది. కానీ అప్పుడు కూడా అతడిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. న్యాయం కోసం మా పతకాలను గంగలో కలిపేద్దామనుకున్నాం” అంటూ ఆ లేఖలో రాసుకొచ్చాడు.

అయితే ఇప్పుడు మళ్లీ బ్రిజ్ భూషణ్ కు సన్నిహితుడైన సంజయ్ సింగే భారత రెజ్లింగ్ సమాఖ్యకు నూతన అధ్యక్షుడు కావడంతో.. ఈ వేధింపులు ఇలాగే కొనసాగుతాయని రెజ్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే తాను రిటైర్మెంట్ ప్రకటించానని సాక్షి మాలిక్ తెలిపింది. కాగా.. రోజురోజుకు మహళా రెజ్లకు భద్రత లేని కారణంగా నాకు 2019లో ప్రకటించిన పద్మశ్రీని మీకే తిరిగి ఇచ్చేస్తున్నా అని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మరి స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా రాసిన లేఖపై ప్రధాని ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఇక విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి