iDreamPost

విమెన్స్ ఐపీఎల్​ ఫైనల్​లో ఆర్సీబీ.. గెలిచినా, ఓడినా విమర్శలు తప్పవు!

  • Published Mar 16, 2024 | 5:06 PMUpdated Mar 16, 2024 | 5:06 PM

విమెన్స్ ఐపీఎల్​లో ఆర్సీబీ జట్టు ఫైనల్​కు దూసుకెళ్లింది. అయితే టైటిల్​ ఫైట్​లో ఆ టీమ్ గెలిచినా, ఓడినా విమర్శలు తప్పేలా లేవు.

విమెన్స్ ఐపీఎల్​లో ఆర్సీబీ జట్టు ఫైనల్​కు దూసుకెళ్లింది. అయితే టైటిల్​ ఫైట్​లో ఆ టీమ్ గెలిచినా, ఓడినా విమర్శలు తప్పేలా లేవు.

  • Published Mar 16, 2024 | 5:06 PMUpdated Mar 16, 2024 | 5:06 PM
విమెన్స్ ఐపీఎల్​ ఫైనల్​లో ఆర్సీబీ.. గెలిచినా, ఓడినా విమర్శలు తప్పవు!

విమెన్స్ ప్రీమియర్ లీగ్​లో గతేడాది దారుణమైన ఆటతీరుతో అందర్నీ నిరాశపర్చిందా జట్టు. ఐదు టీమ్స్ ఉన్న లీగ్​లో నాలుగో స్థానంలో నిలిచింది. కెప్టెన్ స్మృతి మంధాన, ఆసీస్ స్టార్ ఎలిస్ పెర్రీ సహా చాలా మంది స్టార్లతో నిండిన టీమ్ అట్టర్ ఫ్లాప్ అవడంతో అభిమానులు తట్టుకోలేకపోయారు. అయినా ఈసారి కూడా మద్దతుగా నిలిచారు. ఈ ఏడాది జట్టు బాగా ఆడాలని కోరుకున్నారు. వారి ప్రార్థనలు ఫలించి టీమ్ ఏకంగా ఫైనల్​కు చేరుకుంది. ఆ జట్టే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ సీజన్ మొదలైనప్పుడు ఆర్సీబీ ఫైనల్​కు చేరుతుందన్న నమ్మకం ఎవరికీ లేదు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ టైటిల్​ ఫైట్​కు క్వాలిఫై అయింది మంధాన సేన. శుక్రవారం పటిష్టమైన ముంబైతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్​లో 5 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది ఆర్సీబీ. అయితే ఫైనల్​లో గెలిచినా, ఓడినా ఆ జట్టుకు విమర్శలు మాత్రం తప్పేలా లేవు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..

విమెన్స్ ఐపీఎల్ ఫైనల్​కు చేరుకున్న ఆర్సీబీ ప్లేయర్లు సంతోషంలో మునిగిపోయారు. ఆ జట్టు అభిమానులు కూడా సంబురాలు చేసుకుంటున్నారు. ఈసాలా కప్ నమ్దే అని కామెంట్స్ చేస్తున్నారు. ట్రోఫీ తమదేనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్సీబీ ఛాంపియన్​గా నిలిచినా లేదా ఫైనల్ ఫైట్​లో ఓడిపోయినా విమర్శలు తప్పేలా లేవు. ఎందుకంటే ఒకవేళ తుది సమరంలో బెంగళూరు నెగ్గితే అమ్మాయిలు కప్పు కొట్టారు.. మెన్స్ టీమ్​కు చేతకాదని అంటారు. అదే ఒకవేళ ఓడితే ఆర్సీబీ చోకర్స్ అని దారుణంగా ట్రోల్ చేస్తారు. కప్పు కొట్టడం వీళ్ల వల్ల కాదని, ఎప్పటికీ ఛాంపియన్​గా నిలవలేరని క్రిటిసైజ్ చేస్తారు. సో, ఎలా చూసుకున్నా బెంగళూరుకు విమర్శలు తప్పేలా లేవు.

ఆర్సీబీ అభిమానులు మాత్రం తమ టీమ్ కప్పు కొట్టాల్సిందేనని అంటున్నారు. విమెన్స్ ఐపీఎల్​లో విజేతగా నిలిస్తే మెన్స్ టీమ్​లో కూడా గెలవగలమనే కాన్ఫిడెన్స్ పెరుగుతుందని చెబుతున్నారు. చోకర్స్ అనే ముద్రను తొలగించుకోవాలంటే ట్రోఫీని ఎగరేసుకుపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదని.. స్మృతి మంధాన, ఎలిస్ పెర్రీ సహా టీమ్​మేట్స్ అంతా ఫైనల్​లో తమ బెస్ట్​ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇక, విమెన్స్ ఐపీఎల్ ఫైనల్​లో ఢిల్లీ క్యాపిటల్స్​తో తలపడనుంది ఆర్సీబీ. ఈ మ్యాచ్ ఆదివారం నాడు జరగనుంది. ఫైనల్ మీద మరింత హైప్ పెంచేందుకు బెంగళూరు కెప్టెన్ స్మృతితో పాటు డీసీ సారథి మెగ్ లాన్నింగ్​తో ఫొటో షూట్ కూడా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. మహిళల ఐపీఎల్​లో ఈసారి ఎవరు విన్నర్​గా నిలుస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి